హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : శక్తులన్నీ మీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి..

Rasi Phalalu : దిన ఫలం : శక్తులన్నీ మీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 25, సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 25, సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : అధిక పని లేదా ముందస్తు కమిట్‌మెంట్స్ కారణంగా మీరు ఈ రోజు కాస్త ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. ఆలోచించి ముందడుగు వేయడం కొత్త ప్రాజెక్ట్‌ను మేనేజ్ చేయడంలో బాగా సహాయపడవచ్చు. ఒక అప్‌కమింగ్ ఛాలెంజ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండటం మంచిది.

లక్కీ సైన్ - ఎరుపు రంగు క్రిస్టల్

వృషభం (ఏప్రిల్ 20-మే20) : ఒక పరిస్థితి మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేస్తుందని ముందుగానే ఎప్పుడూ అనుకోకూడదు. మీ చుట్టూ జరిగే అనేక సంఘటనల కారణంగా మీరు చాలా గందరగోళంగా ఫీల్ అవ్వొచ్చు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం.

లక్కీ సైన్ - ఒక సిరామిక్ గిన్నె

మిథునం (మే 21- జూన్ 21) : మీకు మీరే కొత్త కమిట్‌మెంట్స్ పెట్టుకుని, డెడ్‌లైన్స్ సెట్ చేసుకోవడం మంచిది. ఈరోజు అన్ని శక్తులు మీ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి. విదేశాల నుంచి వచ్చే పాజిటివ్ న్యూస్ మీకు ఒక కొత్త ఐడియా వచ్చేలా చేయవచ్చు.

లక్కీ సైన్ - వెండి సంచి

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : ఒక వాదన కారణంగా మీ పనులకు భంగం వాటిల్లవచ్చు. మీ అనుబంధం బలపడుతుంది కానీ ఇంకా కొంత కృషి చేయాల్సిన అవసరం రావచ్చు. ఈ విషయంలో శ్రద్ధ అవసరం కాబట్టి మీరు నిపుణులను సంప్రదించే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - ఒక బహుమతి

సింహం (జూలై 23- ఆగస్టు 22) : కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడిపే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పని కొన్ని కొత్త సవాళ్లను తీసుకురావచ్చు. పెండింగ్‌లో ఉన్న కొన్ని చట్టపరమైన విషయాలు ఇప్పుడు ఊపందుకోవచ్చు.

లక్కీ సైన్ - వెలుతురు ఉన్న గది

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : పనిలో కనిపించే ఓ సానుకూల అభివృద్ధితో మీరు ఈరోజు చాలా సంతోషంగా గడిపే అవకాశం ఉంది. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఇప్పుడు విశ్రాంతే లేకుండా పని చేయడం వల్ల భవిష్యత్తులో మీరు మీ వర్క్‌లో ప్రయోజనం పొందవచ్చు. మీరు ఇప్పుడు ముందుగానే ప్లాన్ చేయడం ప్రారంభించవచ్చు.

లక్కీ సైన్ - కొత్త దీపం

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : కుటుంబసభ్యులు, స్నేహితుల ముందు మీ ఇమేజ్ పెరిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా సంభాషణను వాయిదా వేస్తూ వస్తున్నట్లయితే, ఇప్పుడు మీరు ఆ సంభాషణను ప్రారంభించే సమయం వచ్చింది. రోజులోని చివరి క్షణాల్లో మీరు మరింత రిలాక్స్‌డ్‌గా ఉంటారు.

లక్కీ సైన్ - స్పష్టమైన ఆకాశం

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : కొంతమంది తెలిసిన వ్యక్తులు మీ గురించి పుకార్లు సృష్టించే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఈరోజు ఎవరిపై ఆధారపడకుండా స్వతంత్రంగా ఉంటూ మీ పని మీరు చేసుకుంటారు. వర్క్‌ప్లేస్‌లో ఒక కొత్త రోల్ మీ కోసం చర్చించవచ్చు. నేడు కుటుంబ స్నేహితుడు చాలా సహాయకారిగా మారవచ్చు.

లక్కీ సైన్ - ఒక అంబర్ స్టోన్

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : ఈ రోజు మీరు చూసే పాత ఫొటోలు ఎప్పుడో మరచిపోయిన ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేయవచ్చు. కొన్ని ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండవచ్చు. ప్రస్తుతమున్న విషయాలను పరిష్కరించడానికి మీ స్వచ్ఛమైన మానసిక స్థితి సహాయపడుతుంది. నేడు మీకు సంబంధిత మెసేజ్‌ను అందుకోవచ్చు.

లక్కీ సైన్ - ఒక పచ్చ

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : సంక్లిష్టమైన విషయాల పట్ల మీ విధానాన్ని సులభతరం చేసుకోవడం మంచిది. పరిష్కారం దొరకని విషయాలను మళ్లీ అంచనా వేయాలి. ఒక పనిని ముందుకు తీసుకెళ్లడానికి ఈ రోజు ఇక చాలా శక్తిని అందిస్తుంది. ధ్యానం చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

లక్కీ సైన్ - ఒక సరస్సు

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : స్నేహితుడి కారణంగా మీ రోజు మారే అవకాశం ఉంది. షాపింగ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. హ్యాపీ వైబ్స్‌ మిమ్మల్ని సంతోషంగా ఉంచొచ్చు. బయట ప్రదేశాల్లో తినడం మానేయడం ఆరోగ్యానికి మంచిది. భావాలను మరింత స్పష్టంగా వ్యక్తీకరించడానికి ప్రయత్నించాలి.

లక్కీ సైన్ - ఒక సైన్ బోర్డు

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : కొత్త అనుబంధం మరింత బలపడడానికి సమయం పడుతుంది. మీరు ఓపికగా ఉండాలి. కొత్తగా కమ్యూనికేషన్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీరు డెలివరీ చేయని వాటిని డెలివరీ చేస్తామని కమిట్ అవ్వక పోవడమే ఉత్తమం.

లక్కీ సైన్ - వెండి తీగ

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు