హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : దిన ఫలం : అదృష్టం ఈ రాశుల వారి వైపే ఉంటుంది..

Rasi Phalalu : దిన ఫలం : అదృష్టం ఈ రాశుల వారి వైపే ఉంటుంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 24, ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (నేటి దిన ఫలం) : జ్యోతిష్యం ప్రకారం రాశి ఫలాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 24, ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న సమయంలో మీరు ట్రావెల్ ప్లాన్స్ ఎంచుకోవచ్చు. మార్పులేని దినచర్యలో చిక్కుకున్నట్లు అనిపిస్తే, ఆ ఫీలింగ్ నుంచి త్వరలో బయటపడవచ్చు. డబ్బు వ్యవహారాల్లో ఒక వారంలో పురోగతి కనిపిస్తుంది. మీలో కొందరికి థెరపీగా పెంపుడు జంతువును ఇంటికి తీసుకురావాలని అనిపించవచ్చు. తెలిసిన వ్యక్తులతో సన్నిహితంగా ఉండటం ద్వారా మంచి అనుభూతి చెందుతారు.

లక్కీ సైన్‌- తెరిచిన గేటు

వృషభం (ఏప్రిల్ 20-మే20) : మీకు వచ్చిన కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. మీరు దృష్టిపెట్టిన కమ్యూనికేషన్ క్రమంగా ఊపందుకుంది. మీ కోసం మీరు బెంచ్‌మార్క్‌లను సృష్టించారు. కుటుంబం మీ నుంచి కొంత అదనపు సమయాన్ని కోరవచ్చు. కొత్త వెల్‌నెస్ రొటీన్‌ అనుసరించడం వల్ల మానసికంగా మరింత చురుకుగా ఉండవచ్చు.

లక్కీ సైన్‌- గులాబీ రేక

మిథునం (మే 21- జూన్ 21) : మీ ఇంటిని రెన్నొవేషన్ చేయాలనే ఆలోచన మీ మైండ్ స్పేస్‌ను ఆక్రమించడం ప్రారంభించవచ్చు. మీకు కొత్త ఆదాయ వనరులు వచ్చే అవకాశం ఉంది. మంచి సమయం, నిబద్ధత ఉంటే అనుకున్నది చేయగలుగుతారు. మీలో కొత్త విశ్వాసం కనిపిస్తోంది. శక్తులు సానుకూలంగా ఉన్నాయి. గతంలో సమస్యాత్మకంగా, ప్రతికూలంగా కనిపించినవన్నీ దూరమవుతాయి.

లక్కీ సైన్‌- బుద్ధ విగ్రహం

కర్కాటకం (జూన్ 22- జూలై 22) : ఇది వేచి ఉండి, ఎదురు చూడాల్సిన సమయం. అయితే మీరు యాక్షన్ ఓరియెంటెడ్ ప్లాన్‌లపై దృష్టి సారిస్తే, కొంత విరామం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. పనిలో ఉన్న ఎవరైనా మీ లైమ్‌లైట్‌ను షేర్ చేయాలనుకుంటున్నారు. ఆఫీస్‌లో మారుతున్న వాతావరణం పట్ల జాగ్రత్తగా ఉండండి. అది మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. ఇల్లు కూడా ప్రశాంతంగా, నమ్మదగినదిగా ఉంటుంది.

లక్కీ సైన్‌- ఒక పోర్ట్రెయిట్

సింహం (జూలై 23- ఆగస్టు 22) : రాబోయే రోజుల్లో మీ కోసం కొత్త ప్రయాణం ప్రారంభమవుతుంది. దూకుడు విధానం మీ పురోగతికి సహాయపడవచ్చు. మీ నెట్‌వర్క్‌ను పెంచుకోవడానికి నేచురల్ చార్మ్ ఉపయోగించండి. మీ వ్యక్తిత్వం ప్రజలను ఆకర్షిస్తుంది. మీ అభిప్రాయాలను, ఆలోచనలను వారు గమనించేలా చేస్తుంది. ఇంట్లో కొన్ని చిన్న ఆటంకాలు ఉండవచ్చు. ప్లానింగ్ లేని మీటింగ్ మీకు విరామం ఇస్తూ, చైతన్యం నింపుతుంది.

లక్కీ సైన్‌– స్వీట్ బాక్స్

కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : మీకు పొరుగున ఉన్న కొత్తవారిపై క్యూరియాసిటీ ఉండవచ్చు. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న వాటితో ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకోవచ్చు. ఒక రహస్యాన్ని దాచడం కష్టం. మార్నింగ్ వర్కవుట్‌లతో ఇబ్బంది పడుతుంటే.. మిడ్ మార్నింగ్ అందుకు మంచి సమయం కావచ్చు. సన్నిహిత సంబంధాలతో వ్యాపారాన్ని కలపకుండా జాగ్రత్తపడండి.

లక్కీ సైన్ - ఒక ట్యాగ్

తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : అనుకున్నవి ఏమీ ముందుకు సాగడం లేదనిపిస్తుంది. ప్రస్తుతానికి కొత్తగా వస్తున్నది ఏదీ చూడలేకపోవచ్చు. కానీ ఇది చీకటి సొరంగం దాటడం వంటి తాత్కాలిక పరిస్థితి. త్వరలో పరిస్థితులు మెరుగవుతాయి. మీ ప్రమోషన్ గురించి చర్చలు సంవత్సరం ప్రారంభంలోనే జరిగి ఉండవచ్చు, అవి మీకు గుడ్ న్యూస్‌గా మళ్లీ తెరపైకి రావచ్చు.

లక్కీ సైన్‌- వాకింగ్ స్టిక్

వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : మంచి హృదయం ఉన్న వ్యక్తులకు మంచి జరుగుతుంది. ఇప్పటివరకు మీ విధానంలో వాస్తవికంగా ఉన్నారు, ఇది మీరు వేగంగా అభివృద్ధి చెందడానికి సహాయపడవచ్చు. మీ సిబ్బంది ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు. వీలైతే సహాయం అందించండి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు, వాటి షాపింగ్ మిమ్మల్ని బిజీగా ఉంచవచ్చు. కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని ఆలోచిస్తూ ఉండవచ్చు, మరిన్ని అన్వేషించడానికి ఇదే సరైన సమయం.

లక్కీ సైన్‌– ఒక చెక్క పెట్టె

ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : షాపింగ్ చేయడానికి, స్నేహితులతో మంచి సమయాన్ని గడపాలని ప్లాన్ చేస్తుంటే, అదృష్టం మీ వైపు ఉంటుంది. తోటపని మంచి హాబీ కావచ్చు, దీన్ని వ్యాపారంగా మార్చే ఆలోచన ఉండవచ్చు. మీ పని వేగంతో సమస్య ఉండవచ్చు. మెరుగైన ఫలితాలను పొందడానికి మీరు కొన్ని మెకానిజమ్‌లను మార్చాల్సి రావచ్చు. విశ్రాంతి కోసం మరో నగరానికి పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.

లక్కీ సైన్‌- గులాబీ పూలు

మకరం (డిసెంబర్ 22 - జనవరి 19) : కుటుంబ సమేతంగా ఒక వేడుకకు హాజరు కావాల్సి రావచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉండవచ్చు. ఈ నెలాఖరులోగా మీకు మంచి డీల్ లభించే అవకాశం ఉంది. మీ సన్నిహిత కుటుంబ సభ్యులలో ఎవరినీ బహిరంగంగా విమర్శించవద్దు, వారు దాని గురించి త్వరగా లేదా తర్వాత వింటారు.

లక్కీ సైన్ - కొత్త నాణెం

కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : అవసరంలో ఉన్న మీ స్నేహితుని పట్ల శ్రద్ధ వహించండి. కొన్ని సంవత్సరాల క్రితంనాటి ఓల్డ్ ప్యాటర్న్స్ రిపీట్ కావచ్చు, వాటిని గుర్తించగలరు. మీరు ప్రయోగాలు చేయడాన్ని ఇష్టపడతారు కానీ అది దారిపై సరైన రిసెర్చ్ చేయకపోవడం వల్ల ముగింపు సరిగా ఉండదు. పెళ్లి మరింత వాయిదా పడే అవకాశం ఉంది. నిజంగా మెచ్చుకున్న వ్యక్తిని చేరుకోవాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ఈ దశలో పార్ట్నర్‌షిప్ వద్దు.

లక్కీ సైన్‌- అక్వేరియం

మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : మీ పనికి అందే రాబడిని కొలవలేకపోవచ్చు, అది నిరాశ కలిగించవచ్చు. వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలపై పని చేసేందుకు తహతహలాడుతున్నారు. పాత విషయాలకు మళ్లీ కనెక్ట్ అవ్వడం ద్వారా ఒంటరితనానికి నివారణ మార్గాలు కనుగొనవచ్చు. వాతావరణం ట్రావెల్ ప్లాన్స్‌కు అంతరాయం కలిగించవచ్చు. ఆన్‌లైన్ ఫ్రాడ్స్ పట్ల జాగ్రత్త వహించండి. జీవిత భాగస్వామి వద్ద మీ సమస్యలకు పరిష్కారం ఉండవచ్చు, వారిని చేరుకోండి.

లక్కీ సైన్ - టాన్జేరిన్ ప్లేట్లు

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు