హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : (జులై 13) దిన ఫలం : బయటి ఆహారంతో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది..

Rasi Phalalu : (జులై 13) దిన ఫలం : బయటి ఆహారంతో ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 13 తేదీ బుధవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (13 July 2022) ఇవాళ (13 జులై 2022, బుధవారం) నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 13 తేదీ బుధవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : ఎవరి వల్లనైనా మీకు మానసిక ఒత్తిడి ఏర్పడితే, ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని ఎదుర్కోవడానికి అనుకూలమైన స్థితిలో ఉండవచ్చు. కుటుంబంతో మంచి సంబంధాలను కొనసాగించడం భవిష్యత్తులో సహాయపడుతుంది.

లక్కీ సైన్- దాల్చిన చెక్క

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : తాత్కాలిక సంబంధాలు ఆగిపోయే అవకాశం ఉంది. మీరు గతం తాలూకు విషయాలను వదిలేసినట్లు నిర్ధారించుకోండి. ఎందుకంటే అది మీ జీవితాలను ప్రభావితం చేయకూడదు. ప్రయాణ ప్రణాళికలు రెడీగా ఉన్నాయి.

లక్కీ సైన్ - టెంట్

* మిథునరాశి (మే 21- జూన్ 21) : మేనేజ్‌మెంట్‌కు సంబంధించి సీనియర్లలో ఎవరితోనైనా తీవ్రమైన సంభాషణ బాగా ఉపయోగపడవచ్చు. వృత్తిపరమైన నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేసుకోవడానికి మీకు ఆసక్తిగా అనిపించవచ్చు. అయితే వెనుకబడే వైఖరి మీ దినచర్యకు ఆటంకం కలిగించవచ్చు.

లక్కీ సైన్- ఇంద్రధనస్సు

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : సవాళ్లు ఎదురయ్యే సమయాల్లో ఆత్మవిశ్వాసంతో ఉండడం వల్ల మీరు త్వరలో సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక ప్రత్యేకమైన ప్రతిపాదన మీ ముందుకు రావచ్చు. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఏదైనా యాదృచ్ఛిక నిర్ణయాలు తీసుకోవడం కేవలం ఒకరి ప్రభావంతో జరగవచ్చు.

లక్కీ సైన్- క్రిస్టల్

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : ఏదైనా ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్ ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. దీంతో ఇప్పటి వరకు మీలో ఉన్న కొంచెం అలజడి కూడా పోతుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- ఫెర్రీ

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : రాబోయే వారంలో మీరు బలమైన ప్రణాళికలను రచించే అవకాశం ఉంది. దీంతో కొత్తగా ఖర్చు కూడా పెరగవచ్చు. మీకు నైపుణ్యం ఉన్న అంశాల్లో త్వరలో కొత్త అవకాశం రావచ్చు.

లక్కీ సైన్- తలపాగా

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : కొన్నిసార్లు ప్రజలు చేసిన వాగ్దానాల ప్రకారం నడుచుకోరు. దీన్ని బట్టి వారిపై ఓ నిర్ణయానికి రావడం అర్థంలేని చర్య అవుతుంది. పనులు మీ మార్గంలోకి రాకపోతే, వేరే మార్గాన్ని అవలంభించవచ్చు. మరికొన్ని రోజులు సాధారణం కంటే నగదు ప్రవాహం తక్కువగా ఉండవచ్చు.

లక్కీ సైన్- బ్లూ టూర్మాలిన్

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : మీరు స్టార్ట్-అప్‌లో ఉన్నట్లయితే, తాత్కాలికంగా నిధుల కొరతను ఎదుర్కొనే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా కొంత సహాయం అందవచ్చు. ఒక పాత స్నేహితుడు గతం తాలుకు జ్ఞాపకాలను తిరిగి పొందేందుకు మళ్లీ ప్రయత్నించవచ్చు.

లక్కీ సైన్- సముద్రపు షెల్

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : మీరు మీ కుటుంబం నుండి లేదా సన్నిహితుల నుండి కొంత ఆశ్చర్యానికి గురి కావచ్చు. వివాహ పొత్తులు వచ్చే అవకాశం ఉంది. వచ్చే వేసవి వివాహానికి దారి తీస్తుంది. ఏ రోజు అయినా సరే, నిశ్శబ్ధంగా ఉండటమే మీ ప్రాధాన్యతగా ఎంచుకోండి.

లక్కీ సైన్ - పాషన్ ఫ్రూట్

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) : కొంతమంది పాత స్నేహితులు మిమ్మల్ని భాగస్వామ్యం లేదా కొత్త వ్యాపార ఆలోచన కోసం ఒప్పించే అవకాశం ఉంది. యాదృశ్చికంగా జరిగే రోడ్ ట్రిప్ మీలో మార్పులకు కారణం కావచ్చు. కొత్త నిబంధనల కారణంగా ప్రభుత్వ అధికారులు కొన్ని సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంది.

లక్కీ సైన్- స్పష్టమైన క్వార్ట్జ్

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీపై వచ్చిన ఓ ఆరోపణపై పోరాడవలసి రావచ్చు. కుటుంబం నుండి తగినంత మద్దతు లభించకపోవచ్చు. మీరు అతిగా ఖర్చు పెట్టే అలవాటును నియంత్రించుకోవాలి. ఇందుకు ఇప్పటి నుంచే పొదుపు చేయడం ప్రారంభించండి.

లక్కీ సైన్ - మల్లె

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న పరిస్థితులను సరిచేయడానికి మీరు కొన్నిసార్లు మీ ఫౌండేషన్‌‌ను మళ్లీ సందర్శించాల్సి రావచ్చు. మీ కార్యాలయంలోని సీనియర్ వ్యక్తి మీకు మంచి సలహా ఇవ్వగలరు. ప్రతి విషయాన్ని అందరితో చర్చించవద్దు.

లక్కీ సైన్- గులకరాయి

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు