హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : (జులై 12) దిన ఫలం : కమిట్‌మెంట్స్‌ ఇచ్చే ముందు జాగ్రత్త..

Rasi Phalalu : (జులై 12) దిన ఫలం : కమిట్‌మెంట్స్‌ ఇచ్చే ముందు జాగ్రత్త..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 12వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (12 July 2022) ఇవాళ (12 జులై 2022, మంగళవారం) నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 12వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : మీరు చాలా అవసరమైన బ్రేక్‌ తీసుకొని, తిరిగి కొత్త ఉత్సాహాన్ని పొందడానికి వెళ్ళవచ్చు. మీరు చూస్తున్న కొత్త అసైన్‌మెంట్ ఇప్పుడు మీ కోసం పని చేయవచ్చు. పాత బాధలు ఒక కొలిక్కి రావచ్చు.

లక్కీ సైన్- మ్యారిగోల్డ్‌

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : పాత రిలేషన్‌ను పునరుద్ధరించడానికి ఒక సింపుల్‌ అప్రోచ్‌ పని చేయవచ్చు. మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలవడానికి ప్రయత్నిస్తుంటే, ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మీరు మీ వ్యక్తిత్వంలో మంచి మార్పును గమనించవచ్చు.

లక్కీ సైన్- గెర్బెరాస్‌

* మిథునరాశి (మే 21- జూన్ 21) : కొత్త రొటీన్ కొంత ఆందోళనను కలిగిస్తుంది. ఈ రోజంతా మిమ్మల్ని నడిపించడానికి మీ మనసు చాలా దగ్గరగా అనుసరిస్తూ సూచనలు చేస్తుంది. సన్నిహితంగా ఉండే మిత్రుడు విలువైనదిగా భావించేదాన్ని పంచుకోవచ్చు.

లక్కీ సైన్- మైల్‌స్టోన్‌

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : మీరు నిరంతరం గత విజయాల వైపు తిరిగి వెళ్లి ఆ వైభవాన్ని తిరిగి పొందాలని కోరుకుంటూ ఉండవచ్చు. మీ ప్రతిభను మిమ్మల్ని అనుసరించే ఎవరైనా ప్రయత్నించవచ్చు, అనుకరించవచ్చు. మిమ్మల్ని మీరు ఆనందింపజేసుకోవడానికి మంచి రోజు.

లక్కీ సైన్- క్రిస్టల్‌ క్లస్టర్‌

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : మీరు ఇల్లు, పని బాధ్యతల మధ్య నలిగిపోతున్నట్లు అనిపించవచ్చు. ఒక వాదన శాంతికి తాత్కాలికంగా భంగం కలిగించవచ్చు. ఇప్పుడు చాలా విషయాలకు ముగింపు అవసరం.

లక్కీ సైన్- బ్లాక్ టోర్మలైన్‌

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : పరధ్యానం మీ దినచర్యకు అంతరాయం కలిగించవచ్చు. ఇతరులకు కమిట్‌మెంట్స్‌ ఇచ్చే ముందు జాగ్రత్తగా ఉండాలి. కొద్దిరోజుల్లో నగదు ప్రవాహం వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- ఓల్డ్‌ మూవీ

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : టెక్నాలజీ డిజాస్టర్‌ సంభవించే ముందు, ప్రత్యేకించి పని ప్రదేశంలో దానిని ముందుగా తొలగించడం మంచిది. మీరు మీ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మిమ్మల్ని విశ్వసించే వ్యక్తికి త్వరలో సహాయం అవసరం కావచ్చు.

లక్కీ సైన్- పాల్మ్‌

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : ఇంటర్వ్యూ విషయంలో, మీరు ఎటువంటి అదనపు ప్రయత్నం చేయనవసరం లేదు. ఎవరి పనికిమాలిన వ్యాఖ్య మీ విశ్వాసాన్ని వమ్ము చేయకూడదు. స్థిరమైన ఆర్థిక పరిస్థితి మనశ్శాంతిని అందిస్తుంది.

లక్కీ సైన్- ఇండోర్‌ గేమ్‌

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : ఏదైనా సవాలుతో కూడిన పరిస్థితిలో పాల్గొనే ముందు మీరు మీ హోంవర్క్‌ను బాగా చేయాలి. సంక్షోభ సమయాల్లో మీ కుటుంబం గొప్ప సపోర్ట్‌ ఇస్తుంది. మెంటర్ నుండి ఒక సలహా మీరు ముందుకు కొనసాగడానికి సహాయం చేస్తుంది.

లక్కీ సైన్- వాటర్‌ లిల్లీస్‌

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) : ఇది ఒక ఆసక్తికరమైన పరిస్థితి కావచ్చు, ఇక్కడ మీరు వేరొకదాని వైపు ఆకర్షితులవుతారు, కానీ మరొకటి అవసరం. ఈ రోజు శక్తులు అధిక ఖర్చును సూచిస్తాయి. మాటలను నియంత్రించు కోవాల్సిన అవసరం ఉంది.

లక్కీ సైన్- థియేటర్‌ షో

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీ దినచర్య మీ దృష్టిని కొన్ని ముఖ్యమైన విషయాల నుంచి దూరం చేయవచ్చు. ముఖ్యంగా కొత్త స్నేహితుల నుంచి ఏవైనా యాదృచ్ఛిక సలహాలను తీసుకోవడానికి మీ మనస్సు అంగీకరించదు. మీరు త్వరలో కొత్త ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

లక్కీ సైన్- వ్యాలెట్‌

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : హృదయ సంబంధమైన విషయాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. మీ సమయాన్ని కూడా తీసుకుంటాయి. మీకు సంబంధం లేని ఫంక్షన్‌కు మీరు హాజరు కావలసి రావచ్చు. ధన లాభాలు ఇప్పటికీ మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతాయి.

లక్కీ సైన్- కాఫీ మగ్‌

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు