హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : (జులై 11) దిన ఫలం : మీపై ఉన్న ఇంప్రెషన్ మసకబారవచ్చు.. జాగ్రత్త..

Rasi Phalalu : (జులై 11) దిన ఫలం : మీపై ఉన్న ఇంప్రెషన్ మసకబారవచ్చు.. జాగ్రత్త..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 11, సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (11 July 2022) ఇవాళ (11 జులై 2022, సోమవారం) నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 11, సోమవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : కొంత ఏకాగ్రత, స్పష్టమైన కమ్యూనికేషన్ మీ పనులను సులభతరం చేస్తుంది. మీరు ఏదో ఒక రకమైన పని కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తుంటే, కొన్ని నెలల్లో లక్ష్యం నెరవేరే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కొంత మెరుగుపడవచ్చు.

లక్కీ సైన్‌ - ఉడుత

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : మీరు కొంత కాలంగా ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉండి, ఇంకా సరైన అవకాశం రాకపోతే.. మరికొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. త్వరలో కొంతమంది అతిథులు వచ్చే అవకాశం ఉన్నందున, ప్రస్తుతం ఇంట్లో ఉండాల్సి రావచ్చు.

లక్కీ సైన్ - రెండు పిచ్చుకలు

* మిథునరాశి (మే 21- జూన్ 21) : మీ మనసు అస్తవ్యస్తంగా ఉంటే, ధ్యానం (మెడిటేషన్) మీకు సహాయం చేస్తుంది. కొన్ని ఆలోచనలు స్థిరపడాలి, కొన్నింటిని పూర్తిగా తొలగించాలి. ఎవరైనా యాదృచ్ఛికంగా చేసిన కామెంట్ వల్ల మీరు బాధపడితే.. దాన్ని క్షమించడం, మర్చిపోవడం మంచిది.

లక్కీ సైన్- ఒక తాటి మొక్క

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : రొమాంటిక్ ఇంట్రస్ట్ మీలో ప్రవేశించవచ్చు.. దీనిపై ఆలోచించడానికి లేదా ప్రతిస్పందించడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఈ సందర్భంలో తీసుకునే నిర్ణయంతో మీపై ఉన్న ఇంప్రెషన్ మసకబారవచ్చు. అకడమిక్ ఫీల్డ్‌లో ఉంటే వారికి సవాలుగా ఉండే సమయాలు రానున్నాయి.

లక్కీ సైన్‌ - నీలం రంగు కుండలు

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : మీరు చేసే పనులపై చాలా అంచనాలు ఉంటాయి. ప్రత్యేకించి మీరు అత్యంత అంకితభావంతో ఉన్నప్పుడు ఇలాంటి అంచనాలు ఉండవచ్చు. ప్రస్తుతం మీరు డిమాండ్, సరఫరా మధ్య గందరగోళాన్ని ఎదుర్కొంటున్నారు. దీని పరిష్కారానికి కొంత సమయం ఇవ్వాలి.

లక్కీ సైన్‌ - ఒపల్ (opal)

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : మంచి పనికి సమయం పడుతుంది, మీరు కొంత ఓపిక పట్టాల్సి ఉంటుంది. అద్భుతమైన ఫలితాలను ఆశించకుండా మీ తల దించుకుని పని చేయండి. క్రీడాకారులకు మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్‌ - రాకింగ్ కుర్చీ

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : ఒక క్లిష్టమైన సమస్యపై మీ స్నేహితుడు మీ సలహా తీసుకోవచ్చు. ఎవరైనా మీ పనిని, వ్యక్తిత్వాన్ని దూరం నుంచి మెచ్చుకుంటున్నారు. వాస్తవాలను పరిశీలించకుండా ఇతరులు చెప్పేది వినవద్దు.

లక్కీ సైన్‌ - సిల్వర్ వైర్

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : మీ టీమ్‌కు హార్డ్ టాస్క్‌మాస్టర్‌గా ఉంటే, ఫలితాలు కూడా ఆశ్చర్యకరంగా ఉంటాయి. మీ పనికి సంబంధించి ముఖ్యమైన వారి నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామికి కొన్ని సమస్యలు ఉండవచ్చు, వాటిని పరిష్కరించడానికి వెంటనే చర్చించాలి.

లక్కీ సైన్‌ - క్లియర్ క్వార్ట్జ్

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : విలువైన వస్తువును జాగ్రత్తగా ఉంచుకోవాలి. మీరు ప్రస్తుతం కొన్ని ట్రస్ట్ సమస్యలను కలిగి ఉండవచ్చు లేదా పనిలో ఆకస్మిక సంఘటనల వల్ల ఇబ్బంది పడవచ్చు. స్థలం మార్పుల సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్‌ - పిరమిడ్

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) : మీకు సంబంధించిన విషయం కొన్ని సమస్యలను సృష్టించవచ్చు, అది చట్టపరమైన సమస్యలను కూడా ఎదుర్కొంటుంది. కుటుంబం నుంచి ఒక శుభవార్త ఆశించవచ్చు. పిల్లలు రివార్డ్ లేదా గుర్తింపు పొందవచ్చు.

లక్కీ సైన్‌ - చెక్కిన రాయి

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : జీవితం పట్ల మీ అభిరుచి అంటువ్యాధిలా ఉంటుంది. మీ ముఖంలో నిరంతర చిరునవ్వును ఎలా ఉంచుకోగలుగుతున్నారు అని కొన్నిసార్లు ఇతరులు ఆశ్చర్యపోవచ్చు. మీరు ఎవరినైనా మిస్ అవుతూ ఉండవచ్చు, కానీ ఇది కమ్యూనికేట్ చేయడానికి కూడా భయపడతారు.

లక్కీ సైన్‌ - ఒక చెట్టు

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : పట్టుదల మాత్రమే మీకు కావలసిన ఫలితాలను అందించగలదు. విషయాలు పని చేయడానికి ప్రయత్నాలతో పాటు మీకు బలమైన సంకల్పం, స్థిరత్వం అవసరం కావచ్చు. ఏదైనా అధికారిక పత్రంపై సంతకం చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండండి.

లక్కీ సైన్‌ - గోల్డ్ ఫిష్

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు