హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu : (జులై 10) దిన ఫలం : మీ వ్యక్తిత్వంలో మార్పు రావచ్చు..

Rasi Phalalu : (జులై 10) దిన ఫలం : మీ వ్యక్తిత్వంలో మార్పు రావచ్చు..

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలం (ప్రతీకాత్మక చిత్రం)

నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 10వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

Today horoscope (10 July 2022) ఇవాళ (10 జులై 2022, ఆదివారం) నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు దిన ఫలాలను అంచనా వేశారు. జులై 10వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి..

* మేషం (మార్చి 21-ఏప్రిల్ 19) : మీతో సన్నిహితంగా ఉండే ఫ్యామిలీ ఫ్రెండ్ కొత్త ఉద్యోగం గురించి మీకు ఒక సూచన చేయవచ్చు. ప్రస్తుతానికి అనేక ఆటంకాలు, అడ్డంకులు ఉన్నా... అప్పగించిన పనిపై దృష్టి సారిస్తే ఆశించిన ఫలితాన్ని పొందవచ్చు. కొందరు కొత్త వ్యక్తులు మీ గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవచ్చు. అది మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. ఒక చిన్న ట్రిప్ మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

లక్కీ సైన్- టీపాట్

* వృషభం (ఏప్రిల్ 20-మే20) : అడ్వాన్స్‌డ్‌ స్టడీస్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీరు కొన్ని కష్టాలను ఎదుర్కొంటూ ఉండవచ్చు. అయితే ప్రోగ్రెస్‌కు ఇప్పుడు సమయం అనుకూలంగా ఉండవచ్చు. ఆర్థిక సహాయం మీకు లభించే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా నివసిస్తున్నవారు అనారోగ్యంతో బాధపడవచ్చు, కానీ ఈ ఆరోగ్య సమస్యలు తాత్కాలికమే! ఈ సమయంలో వ్యాయామం చేసే అలవాటు ఏర్పరచుకోవచ్చు. తల్లి ఆరోగ్యం బాగోలేకపోవచ్చు. దానివల్ల ఆమె చిరాకుగా ఉంటూ కాస్త కోపంగా ప్రవర్తించవచ్చు.

లక్కీ సైన్ - నియాన్ స్ట్రిప్

* మిథునరాశి (మే 21- జూన్ 21) : మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే ముందడుగు వేయడానికి ఇదే మంచి సమయం కావచ్చు. వ్యాపార ఆలోచనలు మంచి ప్రారంభ ఫలితాలను ఇవ్వగలవు. ఒక భాగస్వామ్యం మీ ఆందోళనలను చాలా వరకు దూరం చేస్తుంది. అలానే కష్టపడి పనిచేసేటప్పుడు తగినంత సపోర్టు అందిస్తుంది. అధికారికంగా వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్ ఆకట్టుకునేలా ఉండొచ్చు. మీ మనస్సు అన్ని గందరగోళాల నుంచి బయటపడి చాలా ప్రశాంతంగా ఉన్నట్లు మీరు ఫీల్ అవచ్చు. స్నేహితులతో అనుకోకుండా చేసే ప్లాన్ మీలో అమితమైన సంతోషాన్ని నింపవచ్చు.

లక్కీ సైన్ - హోర్డింగ్

* కర్కాటకం (జూన్ 22- జూలై 22) : ఒక రిలేషన్‌షిప్‌ కోసం గతంలో మీరు వేసిన చిన్న చిన్న అడుగులే.. నేడు బాధలో ఉంటే ముఖ్యమైన రక్షకులుగా పనిచేస్తాయి. ఈరోజు వర్క్ చేయగలుగుతారు కానీ చాలా వర్క్ ఉంటుంది. అదేపనిగా పని చేయడం కూడా మిమ్మల్ని అలసిపోయేలా చేయవచ్చు. చట్టపరమైన కేసులో ఇరుక్కున్నవారు.. తమ రుజువులు భద్రంగా ఉన్నాయో లేదు నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం. కొంతమంది సన్నిహితులు మీ చుట్టూ ఉన్న రహస్య సమాచారాన్ని అందిస్తూ ఉండొచ్చు.

లక్కీ సైన్ - పురాతన గంట

* సింహ (జూలై 23- ఆగస్టు 22) : త్వరలోనైనా లేదా కాస్త ఆలస్యమైనా.. ఎంపికలు తొందరపాటులో చేసుకోకూడదని మీరు తెలుసుకుంటారు. తర్వాత మీరు మీ ఎంపికపై నమ్మకంగా ఉంటారు. అప్పుడు మీ ఛాయిస్‌ను ఇతరులు కూడా అంగీకరించడం మీరు గమనిస్తారు. వర్క్ ప్లేస్‌లో కాస్త అవిశ్రాంతి, అశాంతిగా అనిపించవచ్చు. మీ మనసు మీ దృష్టిని మరల్చవచ్చు. ఇన్నర్ వాయిస్‌ను ఎక్కువగా పట్టించుకోకపోవడమే మంచిది. ముందుకు సాగే మార్గంలో నడవడానికి ఇది సమయం.

లక్కీ సైన్ - ఒక వెండి గిన్నె

* కన్య (ఆగస్టు 23-సెప్టెంబర్ 22) : కన్యారాశి వారు సమయాన్ని వృధా చేయకుండా తమ నైపుణ్యాన్ని ఇప్పుడే ఉపయోగించాలి. లేకుంటే, కొన్ని వారాల్లో కష్టాలు పడక తప్పదు. మీ ఆసక్తికి సరిపోయే కొత్త అవకాశం కోసం మీరు వెతుకుతూ ఉండొచ్చు. మీ అన్వేషణను సన్నిహితులు ఎవరైనా గమనిస్తుండొచ్చు. ఆ సంగతి ఇప్పుడు మీకు తెలిసే అవకాశం ఉంది. మీ వ్యక్తిత్వంలో ఒక చిన్న మార్పు రావచ్చు. సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా వచ్చే అది ఒక మంచి మార్పుగా ఉంటుంది.

లక్కీ సైన్ - ఒక రాగి పలక

* తుల (సెప్టెంబర్ 23- అక్టోబర్ 23) : గత జ్ఞాపకాలు మంచి భవిష్యత్తుకు దారి చూపవచ్చు. మీరు అవే తప్పులు మళ్లీ చేయకుండా జాగ్రత్తపడుతున్నట్లు అనిపించవచ్చు. అకస్మాత్తుగా ఆందోళన కలిగించే కొన్ని విషయాలలో మీరు స్పష్టత పొందలేకపోతే ఇతరుల సహాయం తీసుకోవడం మంచిది. కొంత ఆర్థిక పురోగతి మిమ్మల్ని మళ్లీ సాధారణ స్థితికి తీసుకొస్తుంది. ఏదైనా ట్రిప్‌కు వెళ్లాలని ఆలోచిస్తుంటే.. అందుకు ఒక ప్లాన్ చేసుకోవడం మంచిది. మిమ్మల్ని మీరు ఎక్కువగా విమర్శించుకుంటున్నారనే నిజాన్ని ఈరోజు మీరు తెలుసుకోవచ్చు.

లక్కీ సైన్ - ఎరుపు గులాబీ

* వృశ్చికం (అక్టోబర్ 24 - నవంబర్ 21) : ఒత్తిడి వ్యూహాలు కొందరిపై పని చేయవచ్చు కానీ అందరిపై కాదు. మీరు మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులకు చికాకు కలిగించవచ్చు. మీ ఉద్దేశ్యం చికాకు పెట్టాలని కాకపోయినా, కమ్యూనికేట్ చేసే పద్ధతిని మార్చుకోవడం చాలా అవసరం. గత కొన్ని నెలల నుంచి కష్టాల్లో ఉన్న వ్యాపారం నేడు మెరుగుపడవచ్చు. కంప్యూటర్ హార్డ్‌వేర్‌ సంబంధిత పనులు చేసేవారు మంచి లాభాలు ఆశించవచ్చు.

లక్కీ సైన్ - ఒక పావురం

* ధనుస్సు (నవంబర్ 22 - డిసెంబర్ 21) : ధనుస్సు రాశి వారికి చాలా కొత్త అవకాశాలు కనిపిస్తాయి. కానీ ఈ అవకాశాలన్ని కాస్త రిస్కీగా అనిపించవచ్చు. ఈ అవకాశాలలో ఏది మంచిదో తెలిపేందుకు ఓ సీనియర్ ఉద్యోగి మీకు సలహా ఇవ్వచ్చు. రొమాంటిక్ రిలేషన్ షిప్ ఉన్నవారైతే ఆ బంధానికి మీరు కొంత సమయం కేటాయించాల్సి రావచ్చు. అలాగే, మీ భాగస్వామిలో నెలకొన్న ఊహాగానాలను మీరు తొలగించాల్సి రావచ్చు. ఇవేమీ చేయకపోతే వారు మీతో వాగ్వాదానికి దిగొచ్చు.

లక్కీ సైన్ - ఒక జాడే మొక్క

* మకరం (డిసెంబర్ 22 - జనవరి 1) : మీరు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని లేదా పురోగతి సాధించాలని అనుకుంటుంటే.. మీ వంతు ప్రయత్నం చేయడం తప్పనిసరి. రాబోయే రోజులు మరింత సమర్థవంతమైన పద్ధతి ద్వారా మీ పనిని పూర్తి చేయడానికి ఎంపికలను అందించవచ్చు. మీరు మరింత నమ్మకంగా, స్నేహపూర్వకంగా ఉండవచ్చు. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న చికాకు ఇకపై పెరగదు. మీ జీవిత భాగస్వామి పరిశీలించదగిన సూచనతో రావచ్చు.

లక్కీ సైన్ - పసుపు కొవ్వొత్తి

* కుంభం (జనవరి 20- ఫిబ్రవరి 18) : మీరు చాలని అనుకునే మూడ్ వచ్చే అవకాశం ఉంది. ఎక్స్‌ప్రెషన్స్ కొన్ని సమయాల్లో భావోద్వేగాలను అధిగమించవచ్చు, కానీ మీ మనసులో ఏముందో అవతలి వ్యక్తికి తెలియజేయడం ముఖ్యం. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే, పాత అవకాశాలు మళ్లీ కనిపించవచ్చు. సంబంధాలు ఇప్పుడు స్థిరత్వాన్ని వాగ్దానం చేయవచ్చు. మీరు వాటిలో పెట్టుబడి పెట్టాలని భావించవచ్చు. పాత భయాలు త్వరలో ఒక మార్గాన్ని కనుగొనవచ్చు.

లక్కీ సైన్- స్పష్టమైన క్వార్ట్జ్

* మీనం (ఫిబ్రవరి 19 - మార్చి 20) : నేడు మీకు శక్తి చెల్లాచెదురుగా అనిపించవచ్చు. ఈరోజు మీరు సాధించాలనుకున్నది మీ చర్యలకు మద్దతు ఇవ్వకపోవచ్చు. ఒకరి దృష్టిని ఆకర్షించడానికి మీరు కొత్త మార్గాలను కనుగొనాలి. న్యాయవాద వృత్తిలో ఉన్న వ్యక్తులు తప్పుగా అర్థం చేసుకోవడానికి జాగ్రత్తగా కమ్యూనికేట్ చేయాలి. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలనే తీవ్రమైన కోరిక మీలో పుట్టొచ్చు. మీరు దీన్ని దగ్గరగా అనుసరిస్తే, ఇది వ్యాపార ఆలోచనలను రూపొందించడానికి దారితీయవచ్చు.

లక్కీ సైన్ - పట్టు కండువా

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు