హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rasi Phalalu: ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి.. సవాళ్లను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు..

Rasi Phalalu: ఈ రాశుల వారికీ వివాహా ప్రయత్నాలు ఫలిస్తాయి.. సవాళ్లను ఆత్మ విశ్వాసంతో ఎదుర్కొంటారు..

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

రాశి ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Today Horoscope (నేటి దిన ఫలం): జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 27వ తేదీ శనివారం నాడు వివిధ రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Today Horoscope (నేటి దిన ఫలం): జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. ఆగస్టు 27వ తేదీ శనివారం నాడు వివిధ రాశులకు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో పరిశీలిద్దాం.


* మేషం

మీరు మానసిక ఒత్తిడికి గురువుతుంటే, ఇప్పుడు దాన్ని సరిగ్గా పరిష్కరించాలి. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేందుకు సౌకర్యవంతమైన స్థితిలో మీరు ఉండవచ్చు. కొత్తగా ఏదైనా పని ప్రారంభించడం ద్వారా మీకు అవసరమైన ఉత్సాహాన్ని తీసుకురావచ్చు.

లక్కీ సైన్ - దాల్చిన చెక్క

* వృషభం

తాత్కాలిక రిలేషన్స్ ఇప్పటితో ముగిసిపోతాయి. ఇప్పుడు ముందుకు సాగడానికి సరైన సమయం. మీ జీవితాన్ని ప్రభావితం చేయకుండా ఉండటానికి, గతానికి సంబంధించిన జ్ఞాపకాలు వదిలేయండి. ప్రయాణ ప్రణాళికలు రెడీగా ఉండవచ్చు.

లక్కీ సైన్ - టెంట్

* మిథునం

సీనియర్ మేనేజ్‌మెంట్‌లో ఎవరితోనైనా సీరియస్ కన్వర్జేషన్ మీకు చాలా అవగాహన కల్పించవచ్చు. ప్రొఫెషనల్ లైఫ్‌ను ప్రభావితం చేసే కొన్ని వాస్తవాల గురించి మీకు తెలియక పోవచ్చు. విచిత్రమైన వైఖరితో రోజువారీ దినచర్యకు ఆటంకం ఏర్పడవచ్చు.

లక్కీ సైన్ - ఇంద్రధనస్సు

* కర్కాటకం

సవాళ్లను ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోవడం వల్ల త్వరలో సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక రొమాంటిక్ ప్రపోజల్ మీ ముందుకు రావచ్చు. అది మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. భవిష్యత్తు కోసం ఏదైనా యాదృచ్ఛిక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహించాలి.

లక్కీ సైన్- సరస్సు

* సింహం

మీరు ఏదైనా పోటీ పరీక్ష లేదా ప్రవేశ పరీక్షలో పాల్గొనడానికి ప్రయత్నిస్తుంటే ఫలితాలు మీకు అనుకూలంగా ఉండవచ్చు. వాటిని త్వరలో చూస్తారు. ఇప్పటి వరకు మీలో ఉన్న కొంచెం అలజడి కూడా పోతుంది. బయటి ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం తగ్గించడం మంచిది.

లక్కీ సైన్- ఫెర్రీ

* కన్య

రాబోయే వారం గురించి పటిష్టమైన ప్రణాళికతో ఉంటారు. త్వరలో ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇవన్నీ కలిసి పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. మీకు నైపుణ్యం ఉన్న దాంట్లో త్వరలో కొత్త అవకాశం రావచ్చు.

లక్కీ సైన్ - తలపాగా

* తుల

కొందరు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవచ్చు. అయితే అంత మాత్రన వారిపై ఓ నిర్ణయానికి రావడం తొందరపాటు అవుతుంది. విషయాలు మీ మార్గంలో పని చేయకపోతే, వేరే పద్ధతిని అవలంబించండి. డబ్బు లాభాలకు అవకాశం ఉంది.

లక్కీ సైన్- బ్లూ టూర్మాలిన్

* వృశ్చికం

మీరు స్టార్టప్‌ బిజినెస్‌లో ఉన్నట్లయితే, అవసరమైన ఫైనాన్స్‌ను నిర్వహించే అవకాశం ఉంది. మీకోసం కొన్ని అంతర్జాతీయ వార్తలు రెడీగా ఉన్నాయి. పాత స్నేహితుడు కొంత భ్రమ కలిగించేలా ప్రవర్తించవచ్చు.

లక్కీ సైపు- సముద్రపు షెల్

* ధనుస్సు

కుటుంబం లేదా సన్నిహితుల నుంచి మీరు కొంత ఆశ్చర్యానికి గురి కావచ్చు. పెళ్లి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో పెళ్లి జరగవచ్చు. ఏ విషయంలోనైనా మీ వ్యవహారం ఆర్భాటం లేకుండా పొందికగా ఉంటుంది.

లక్కీ సైన్ - పాషన్ ఫ్రూట్

* మకరం

కొంతమంది పాత స్నేహితులు మిమ్మల్ని భాగస్వామ్యం కోసం ఒప్పించవచ్చు. అదంతా ఒక రోడ్ ట్రిప్‌లో జరగవచ్చు. ప్రభుత్వ అధికారులకు ఇది సవాళ్లు ఎదురయ్యే సమయం. విద్యార్థులు మరికొంత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది.

లక్కీ సైన్ - స్పష్టమైన క్వార్ట్జ్

* కుంభం

మీరు కొన్ని రకాల ఆరోపణపై పోరాడాల్సిరావచ్చు. వ్యక్తులతో మీరు వ్యవహరించే తీరు కూడా సానుకూలంగా మారవచ్చు. కుటుంబం నుంచి ఊహించని మద్దతు లభించవచ్చు. మీరు అతిగా ఖర్చు పెట్టే అలవాటును నియంత్రించుకోవాలి.

లక్కీ సైన్ - మల్లె‌పూలు

* మీనం

ప్రస్తుతం మిమ్మల్ని ప్రభావితం చేస్తున్న పరిస్థితులను సరిచేయడానికి మీరు మూలాలు లేదా పునాదుల నుంచి ఆలోచించాలి. ఆఫీస్‌లోని సీనియర్ ఒకరు మీకు మంచి సలహా ఇవ్వవచ్చు. ప్రతి విషయాన్ని అందరితో చర్చించడం మానుకోండి.

లక్కీ సైన్- గులకరాయి

First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu

ఉత్తమ కథలు