హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Horoscope Today: ఏప్రిల్‌ 21న రాశిఫలాలు.. మారిన వారి వైఖరితో కుటుంబంలో సమస్యలు!

Horoscope Today: ఏప్రిల్‌ 21న రాశిఫలాలు.. మారిన వారి వైఖరితో కుటుంబంలో సమస్యలు!

నేటి దిన ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

నేటి దిన ఫలాలు (ప్రతీకాత్మక చిత్రం)

Horoscope Today : ఓ రాశివారికి ఈ రోజు(ఏప్రిల్-21,2022) అనుకోకుండా అందే అవకాశం సంతోషాన్ని కలిగిస్తుంది. కొందరికి ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరుతుంది. కొందరు ఓ వ్యక్తిని కలవాలని కోరుకుంటారు.. కానీ ఎలా సంప్రదించాలో వారికి తెలియదు. కొందరు వాయిదా వేసే పనులతో సమస్యలు తెచ్చుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్‌ 21 గురువారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

Horoscope Today : ఓ రాశివారికి ఈ రోజు(ఏప్రిల్-21,2022) అనుకోకుండా అందే అవకాశం సంతోషాన్ని కలిగిస్తుంది. కొందరికి ఎప్పటి నుంచో మిగిలిపోయిన కోరిక తీరుతుంది. కొందరు ఓ వ్యక్తిని కలవాలని కోరుకుంటారు.. కానీ ఎలా సంప్రదించాలో వారికి తెలియదు. కొందరు వాయిదా వేసే పనులతో సమస్యలు తెచ్చుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్‌ 21 గురువారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి తెలుసుకోండి.

* మేషం

మీరు మీ నిజమైన సత్తాను చూపించాలనుకొంటే.. పనులతో రుజువు చేయండి, మాటలతో కాదు. కొంత మంది మీ గురించి వదంతులు సృష్టిస్తారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా ఉండడం నేర్చుకోవాలి.

లక్కీ సైన్- ట్యాంజెరిన్‌ క్లాత్‌

* వృషభం

ఎప్పటి నుంచో తీరకుండా ఉండిపోయిన మీ కోరిక ఇప్పుడు నెరవేరుతుంది. ఇంట్లో జరిగే కొన్ని అంశాల కారణంగా ఇరిటేట్‌ అవుతారు. కొంత కాలం గా మారిన మీ వైఖరి వల్ల మీ జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- పిచ్చుక

* మిథునం

అనుకోకుండా వచ్చే ఓ అవకాశం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. మీ చేతిలో ఉన్న అన్ని పనులు సక్రమంగా పూర్తి చేసే అవకాశం ఉంది. న్యాయ సంబంధ వ్యవహారానికి సంబంధించిన ఇబ్బంది ఎదురుకావచ్చు.

లక్కీ సైన్- టోడ్‌

* కర్కాటకం

మీరు పూర్తి స్పృహతో ఉన్న కారణంగా ప్రస్తుతానికి సమస్యలు తొలగిపోతాయి. హఠాత్తుగా ట్రస్ట్‌ ఇష్యూస్‌ ఎదురుకావచ్చు. ఎమోషనల్‌ అవ్వకుండా చూసుకోండి. అనుకోని అతిథి వచ్చే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- నెమలి

* సింహం

మీకు పూర్తిగా కొత్తైన పనులు చేపట్టడంలో తెలియని భయం ఫీల్‌ అవుతారు. అది తప్ప మిగతావన్నీ సక్రమంగానే ఉంటాయి. పనులు అన్నింటినీ సక్రమంగా పూర్తి చేసే అవకాశం ఉంది.

లక్కీ సైన్- లిల్లీ పువ్వుల గుత్తి

* కన్య

మీరు సరైన మార్గంలోనే ఉన్నారు. ఎలాంటి అనుమానం అక్కరలేదు. కొత్త ఆలోచన చేయాల్సిన, మీపై మీరు నమ్మకం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. త్వరలో చిన్న పర్యటన చేపడతారు.

లక్కీ సైన్- క్యాండీ బాక్స్‌

* తుల

ఇటీవల కలిసిన వ్యక్తి గురించి పదే పదే తలచుకుంటారు. కానీ వారిని ఎలా సంప్రదించాలో మీకు తెలియదు. మీరు ఏదైనా ఎగ్జామ్‌కు సిద్ధం అవుతుంటే.. ఆశించిన ఫలితాలను అందుకోవాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాలి.

లక్కీ సైన్- సిల్వర్‌ రింగ్‌

* వృశ్ఛికం

మీ జీవితంలో ఒక కొత్త మార్పు జరిగింది. అది చాలా ప్రయత్నించిన తర్వాత మీకు దక్కిన మెంటల్‌ స్టెలిబిలిటీ కావచ్చు. అందుకే మిమ్మల్ని అందరూ ఆదర్శంగా చూస్తారు. మీరు ఏదైనా నిరూపించాలని భావిస్తుంటే ఇదే సరైన సమయం.

లక్కీ సైన్- గోల్డెన్ బ్యాంగిల్‌

* ధనస్సు

మీపై నుంచి పెద్ద భారం దిగిపోతుంది. చాలా రిలీఫ్‌గా ఫీల్‌ అవుతారు. కొత్త పనులు చేపట్టడానికి ఇది అనుకూల సమయం. అప్పుడే మీరు పనిలో నిమగ్నమై ఉంటారు. పిల్లలు చేసిన సూచనలను పాటించడం మేలు.

లక్కీ సైన్- క్లియర్‌ క్వార్ట్జ్‌

* మకరం

ఈ రోజు చివరికి చాలా పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ మీరు ఆపనులను ప్రాధాన్యం పరంగా ఎంచుకొని చేయడం మేలు. చాలా కాలం నుంచి మీరు మాట్లాడతారని ఒకరు వేచి చూస్తున్నారు.

లక్కీ సైన్- టో రింగ్‌

* కుంభం

మానసికంగా, శారీరకంగా మిమ్మల్ని మీరు సరైన స్థితిలో ఉంచుకొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం. వాయిదా వేసే మీ వైఖరితో సమస్యలు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- సెలెనైట్‌ క్రిస్టల్‌

* మీనం

ఈ రోజును మీరు చాలా ఇష్టపడతారు. చాలా కాలం నుంచి కొన్ని విభేదాలను పరిష్కరించుకోవాల్సిన వ్యక్తితో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకొంటారు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్త ఉత్సాహం పొందుతారు.

లక్కీ సైన్- మందారం పువ్వు

First published:

Tags: Horoscope, Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు