Horoscope Today: చాలా మంది జ్యోతిష్యాన్ని బలంగా నమ్ముతారు. ఏదైనా కొత్త పనులు చేయాలంటే పరిస్థితులు ఎలా ఉంటాయో అంచనా వేయడానికి పండితుడి దగ్గరకు వెళ్లి ఆరా తీస్తారు. జ్యోతిష్యం ప్రకారం రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంది. మేషం నుంచి మీనం వరకు ఇవాళ (25 ఏప్రిల్ 2022, సోమవారం) ఏ రాశివారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
* మేషం
ఏదైనా సమస్య వస్తే ఆందోళన చెందకుండా ఉండడం వీరికి తీవ్రమైన సవాలు లాంటిది. కానీ అదే చేయాల్సి రావచ్చు. వీరు కొంత కాలం వరకు పోటీని విస్మరించవచ్చు. సొంత ఆస్తిని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే దాని గురించి ఆలోచించడం ప్రారంభించవచ్చు.
లక్కీ సైన్- ట్విస్టెడ్ రోప్
* వృషభం
మీ పనితీరులో లోపాన్ని అధికారులు సహించలేరు. దాని గురించి మీకు తెలుసు. కానీ ప్రస్తుత పని తీరుకు మీ సొంత కారణాలు ఉన్నాయి. సక్సెస్ కోసం మీరు మరింత కష్టపడాల్సి రావచ్చు.
లక్కీ సైన్ - గొంగళి పురుగు
* మిధునం
మీకు అనిపించిన దాన్ని ఎల్లప్పుడూ వ్యక్తపరచడం మంచిది కాదు. కొన్నిసార్లు మీరు ఎవరినైనా కించపరచవచ్చు. దీంతో తెలియకుండానే మీరు మీ సంభాషణను అదుపులో ఉంచుకోవాలి.
లక్కీ సైన్ – స్నూజ్ బటన్
* కర్కాటకం
మీరు కొన్ని రహస్యమైన వైబ్‌లను ఇతరులకు అందించవచ్చు. అయితే వారు మిమ్మల్ని యాక్సెస్ చేయలేరు. మీరు మీ డ్రీమ్ జోన్ నుండి బయటపడి వాస్తవికత వైపు వెళ్లాలి.
లక్కీ సైన్ - గాలిపటం
* సింహం
అనుకూలమైన దృక్పథం, బృంద స్ఫూర్తి, ఆసక్తిగా నేర్చుకోవడం వంటి నెఫుణ్యాలను అలవర్చుకోవాలి. వీటిని రోజువారీ జీవితంలో త్వరగా అలవాటు చేసుకోవాలి. మీ పనితీరును ఇతరులు గమనిస్తుంటారు. ధన ప్రవాహం పెరిగే అవకాశం ఉంది.
లక్కీ సైన్- పారాచూట్
* కన్య
కొన్నిసార్లు ఇద్దరు వ్యక్తులు కలిసినప్పుడు అయస్కాంతంలా ఆకర్షించుకుంటారు. మీకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు కొన్ని రోజుల వ్యవధిలో ఒకరితో కలిసే అవకాశం ఉంది. ఒక చిన్న పర్యటన సైతం త్వరలో రాబోతోంది. అది ఆనందదాయకంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతంగా ఉంటుంది.
లక్కీ సైన్ - కీ హోల్డర్
* తుల
ప్రస్తుతానికి కొన్ని విషయాల గురించి మీకు కచ్చితంగా తెలియకపోతే, వాటిని ప్రస్తుతానికి వాయిదా వేయండి. మీ కుటుంబం మీతో కొంత సమయం గడపాలని భావించింది. మీరు ముందుగానే ప్లాన్ చేసుకోండి. కొత్త ప్రాజెక్ట్ లేదా అసైన్‌మెంట్ మిమ్మల్ని కొన్ని రోజులు బిజీగా ఉంచే అవకాశం ఉంది.
లక్కీ సైన్- స్నోమాన్
* వృశ్చికం
మీరు పనిలో ప్రమోషన్ పొందనున్నారని బలమైన సంకేతం వస్తుంది. దీని కోసం మీరు కొంతకాలంగా వేచి చూస్తున్నారు. ఆరోజు రానే వచ్చింది. గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ దగ్గరలోనే ఉంది. అది మీ ఉత్సాహాన్ని రిఫ్రెష్ చేస్తుంది.
లక్కీ సైన్- సిల్క్ టై
* ధనుస్సు
మీరు పరిష్కారాల కోసం వెతుకుతున్నప్పుడు కోపం తగ్గించుకోవాలి. మీరు చిన్న సాకుతో కూడా ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉన్నందున దాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది. జూదం వంటి వాటిలో పాల్గొనడం మానుకోండి. ఇది నష్టాలకు దారితీయవచ్చు.
లక్కీ సైన్- నలుపు రంగు టూర్మాలిన్
* మకరం
ఒకరి ఆరోగ్యం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది. దీంతో మీరు వారి విషయంలో మానసికంగా కలత చెందుతారు. ఒకరి నుంచి చిన్న సహాయం లేదా రుణం మీకు ప్రస్తుత పరిస్థితిని పరిష్కరించడంలో సహాయపడవచ్చు. కొంత కాలం ఆర్థిక ఒత్తిడి ఉండవచ్చు.
లక్కీ సైన్ - కుందేలు
* కుంభం
మీరు ఆశించిన విధంగా చికిత్సను పొందలేకపోవచ్చు. కానీ మీ బస ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బయట ప్రాంతాల్లో కొంత నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు తిరిగి వచ్చినప్పుడు మీ ఒత్తిడిని వదిలివేయండి.
లక్కీ సైన్- పసుపు రంగు పువ్వు
* మీనం
పెండింగ్‌లో ఉన్న పనులను ఈ రోజు చక్కగా సర్దుబాటు అవుతాయి. చెల్లింపులు చేయడం, షాపింగ్ చేయడం, ఇన్ టైమ్‌లో వర్క్ పూర్తి చేయడం వంటివి అన్నమాట. మొత్తంమీద గతంతో పోల్చుకుంటే ఈ రోజు ఒత్తిడి తక్కువగా ఉంటుంది.
లక్కీ సైన్ - నైటింగేల్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs