Horoscope: మే29 రాశిఫలాలు. నేడు ఒక రాశివారికి ఆఫీస్లో వచ్చే ఓ అవకాశం అతని ప్రతిష్టను పెంచేదిగా ఉండవచ్చు. మరో రాశివారు తనకు ఇష్టమైన పనిలో ప్రేరణ కలిగించే విషయం తెలుసుకోవచ్చు. ఇంకోరాశి వారు రోజుల తరబడి ప్రయాణం చేయాల్సి రావచ్చు. ఇప్పట్లో అది ముగిసిపోదు. వీటన్నిటిని నక్షత్రాల ఆధారంగా జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మే 29, ఆదివారం నాడు ఏ రాశికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.
* మేషం (Aries):
పదే పదే సవాళ్లు ఎదురవుతుంటే బలమైన పునరాగమనం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఆఫీస్లో వచ్చే ఓ అవకాశం మీ ఇమేజ్ పెరుగుదలకు సహాయపడవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక సహాయాన్ని అందుకోవచ్చు. అది ప్రస్తుత కాలానికి వరం అవుతుంది.
లక్కీ సైన్- సిల్క్ క్లాత్
* వృషభం (Taurus):
కొత్త వ్యక్తి మీకు ఆసక్తిగా అనిపించవచ్చు. చిన్న కమ్యూనికేషన్ లేదా ఫాలో అప్ అవకాశాలు ఉండవచ్చు. మీ అభిరుచికి తగ్గట్టు మీరు నడుచుకోవడం లేదని మీకు అనిపించవచ్చు. ఇప్పుడు పాత హాబీలను అన్వేషించడం లేదా ప్రస్తుత అలవాట్లను పునర్నిర్మించడం ప్రారంభించవచ్చు. మరొకరి జీవితం మీకు ప్రేరణగా మారవచ్చు.
లక్కీ సైన్ - స్ట్రింగ్ లైట్
* మిథునం (Gemini):
మీకు ఆసక్తి ఉన్న రంగాల్లో ప్రేరణ కలిగించే విషయాలు వెల్లడి కావచ్చు. భాగస్వామ్యం కోసం ఎవరితోనైనా సన్నిహితంగా ఉంటే, అది మంచిది కాకపోవచ్చు. మీరు తప్పనిసరిగా మీ ప్రయోజనాలు, వనరులను గుర్తించాలి. ఉద్యోగం కోసం ప్రయాణం త్వరలో రాబోతుంది. అది ఫలప్రదం కావచ్చు.
* కర్కాటకం (Cancer):
మీకు దగ్గరగా ఉన్నవారు మీ రహస్యాలను దాచలేరు. దీంతో మీ ఆలోచనలు, అభిప్రాయాలతో వ్యక్తులను విశ్వసించే ముందు మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మీరు రాజకీయ రంగంలో లేదా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నట్లయితే, పెద్ద మార్పు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత విజయాలపై విచారణ కూడా త్వరలో జరగవచ్చు. డబ్బు ప్రవాహం ఇప్పుడు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
లక్కీ సైన్- కోడి
* సింహం (Leo):
బ్యాలెన్స్డ్ ఎనర్జీ కారణంగా మీకు ఇవాళ అందమైన రోజుగా అనిపించవచ్చు. మిమ్మల్ని మీరు విలాసపరుచుకోవడానికి, ఇష్టపడే వ్యక్తులతో సుదీర్ఘ సంభాషణలు చేయడానికి మీరు సమయాన్ని కేటాయించవచ్చు. ఇతరులు మీతో సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మీరు భావించవచ్చు. పనిలో సీనియర్లు ఎవరైనా హఠాత్తుగా నిష్క్రమించాల్సి రావచ్చు.
లక్కీ సైన్- ఉడుత
* కన్య (Virgo):
మీలో సానుకూల మార్పు రావాలంటే పాత స్నేహితుడిని తప్పనిసరిగా నమ్మాలి. గతంలో పెండింగ్లో ఉన్న చాలా పనుల కోసం ఇప్పుడు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. సాయంత్రాలు మరింత వినోదాత్మకంగా ఉన్నప్పటికీ, రాబోయే వారంరోజులు పని కారణంగా ప్రస్తుత విధానాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.
లక్కీ సైన్- రాగి తీగ
* తుల (Libra):
ఇటీవల మీరు చాలా స్వీయ ప్రేరణతో ఉన్నట్లు కనిపిస్తుంటారు. మీరు చేసిన తప్పును మరొకరిపై మోపడం సరికాదు. మీగత అనుభవాల ఆధారంగా ట్రస్ట్ సమస్య ఉండవచ్చు. మీరు వాటిని పునఃపరిశీలించవలసి ఉంటుంది. ఆఫీస్ నుండి ఒక శుభవార్త మీ మానసిక స్థితిని ప్రకాశవంతం చేస్తుంది.
* వృశ్చికం (Scorpio):
లోతైన క్రిటికల్ అనాలసిస్.. జరగబోయే దాన్ని నాశనం చేయవచ్చు. ఏ విషయంలోనైనా తెగే దాక వాదించడం లేదా డిఫెన్స్ చేయడం అవసరం లేదు. మీరు ప్రకృతికి దగ్గరగా ఉండటం లేదా ధ్యానం చేస్తే శాంతిని పొందవచ్చు. పనిలో కొత్త నమూనా కనిపించినట్లయితే, మీరు బ్యాకప్ ప్లాన్లను రూపొందించడం ప్రారంభించవచ్చు.
లక్కీ సైన్- టోడ్
* ధనస్సు (Sagittarius):
చాలా కాలం నుండి దూరంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు టచ్లోకి రావచ్చు. స్నేహితులు ప్రస్తుతం గొప్ప సౌకర్యంగా అనిపించవచ్చు. మీరు విలువైన వస్తువును పోగొట్టుకున్నట్లయితే, దాన్ని త్వరలో కనుగొనే అవకాశం ఉంది. మిమ్మల్ని నియమించుకోవడానికి ఆసక్తి ఉన్న ఎవరైనా మిమ్మల్ని సంప్రదించవచ్చు.
లక్కీ సైన్- మనీ ప్లాంట్
* మకరం (Capricorn):
గత కొన్ని రోజులుగా ప్రయాణం ఆగడం లేదు. మరికొంత కాలం ఇలానే ఉండవచ్చు. నిజానికి ఇది మీకు కొత్త ఆలోచనలను అందించవచ్చు. మీరు భవిష్యత్తులో పనిని క్రమబద్ధీకరించడానికి కొంత సమయాన్ని వెచ్చించవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలతో పరధ్యానంలో ఉండకూడదు. మీ లక్ష్యాలను అంచనా వేయడానికి ప్రయత్నించండి.
లక్కీ సైన్- ఈక
* కుంభం (Aquarius):
అవకాశం, హోప్ మిమ్మల్ని ముందుకు నడిపించే సాధనాలు. మీరు చేపట్టిన ప్రతిదానిలో స్థిరంగా ఉండండి. ఇంటికి సంబంధించిన విషయాలు క్రమబద్ధీకరించవలసి ఉంటుంది. మీరు త్వరలో గెట్ టుగెదర్ని హోస్ట్ చేయాల్సి రావచ్చు. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా, అకస్మాత్తుగా వెళ్లిపోవాలని నిర్ణయించుకోవచ్చు.
* మీనం (Pisces):
రొటీన్ పని ఇప్పుడు పక్కకు పెట్టాల్సి రావచ్చు. ఎందుకంటే ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం రావచ్చు. తల్లి ఆరోగ్యానికి చికిత్స ఇప్పుడు అవసరం. మీరు మీ చుట్టూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించవచ్చు. పనిలో ఎవరైనా కష్టంగా వ్యవహరించవచ్చు. కానీ మీరు దానిని అధిగమించగలరు.
లక్కీ సైన్ – చెక్క పెట్టె
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.