Home /News /astrology /

RASHI PHALALU TODAY TELUGU ASTROLOGY RASHIFAL RASHI PHALALU THESE PEOPLE SHOULD BE CAREFUL WITH NEW FRIENDS PJC GH SK

Rashi Phalalu Today: కొత్త మిత్రుల పట్ల వీరు జాగ్రత్తగా ఉండాలి.. పెద్దగా పట్టించుకోవద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rashi Phalalu Today: మే 19వ తేదీ.. గురువారం.. ఏయే రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఎవరిని దురదృష్టం వెంటాడుతుంది. జ్యోతిష పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నవారు. నేటి రాశి ఫలాల్లో తెలుసుకుందాం.

Horoscope Today: మే 19 రాశి ఫలాలు. నేడు ఓ రాశివారికి అనుకూలంగా ఈరోజు శక్తులు పనిచేస్తాయి. ఎవరినైనా పిలవడానికి వాయిదా వేస్తూ ఉంటే ఈరోజు ఆహ్వానించేందుకు సరైన సమయం. కొందరు వినూత్న ప్రణాళికలతో ఫలితాలు అందుకుంటారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 19వ తేదీ గురువారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం (Aries):
ఈ రోజు చాలా బిజీగా ఉన్న రోజు, ఇక్కడ మీ శక్తులు ఒక పని వైపు మళ్లుతాయి. మీరు సాయంత్రం ఆరుబయట వెళ్లే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరిగే సూచనలు కూడా ఉన్నాయి.

లక్కీ సైన్- ఒపాల్‌

* వృషభం (Taurus):
మీరు ఎవరినైనా పిలవాలని వాయిదా వేస్తూ ఉంటే, ఈ రోజు వారిని ఆహ్వానించాల్సిన రోజు. క్రమమైన శారీరక వ్యాయామం ఇప్పుడు తప్పనిసరి. లేదంటే అనారోగ్యం లేదా వైద్యులను సంప్రదించాల్సిన అవసరం రావచ్చు. ఒక వ్యాపార ప్రతిపాదన మీకు అందుతుంది. అది లాభదాయకంగా కూడా ఉంటుంది.

లక్కీ సైన్- ఎల్లో సెఫైర్‌

* మిథునం (Gemini):
శక్తులు ఈరోజు మీతో కలిసి ఉన్నందున రోజులో ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేయాలి. వినూత్న ప్రణాళికలతో తక్షణ ఫలితాలు అందుకుంటారు. వాటిని కొనసాగించే అవకాశం కూడా మీకు ఉంటుంది.

లక్కీ సైన్- బ్లాక్‌ టోర్మలైన్‌

* కర్కాటకం (Cancer):
మీ జీవితంలో ఒక కొత్త స్నేహితుడు కేవలం వచ్చి వెళ్లిపోయే రకం.. వారిని సీరియస్‌గా తీసుకోకండి. ఇంటికి సంబంధించిన అంశాలపై తక్షణ శ్రద్ధ అవసరం. కొంతమంది బయటి వ్యక్తుల జోక్యం మిమ్మల్ని బాగా చికాకు పెట్టవచ్చు.

లక్కీ సైన్- ల్యాంప్‌ షేడ్‌

* సింహం (Leo):
ఇతరుల కోసం, మీ కోసం మీ చుట్టూ ఉన్న సమస్యలను పరిష్కరించుకోండి. మీరు కొత్త జీవన విధానం కోసం అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుంటే బాధ కలిగించే సందర్భాలు ఉండవచ్చు. మీరు మీ అధికారుల నుండి ఆదరణ పొందే అవకాశం ఉంది.

లక్కీ సైన్- లేబుల్డ్‌ బాక్స్‌

* కన్య (Virgo):
మీ ప్రియమైన వారికి మీ నుండి ఎక్కువ శ్రద్ధ అవసరం కావచ్చు. అపార్థాలు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయండి. సృజనాత్మకంగా ఉండటానికి, ప్రోగ్రెస్‌ సాధించడానికి మీ మనసుకు కొత్త ఉత్సాహం అవసరం. మీకు అవకాశం వచ్చినప్పుడు, బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకోండి.

లక్కీ సైన్- గార్డెన్‌

* తుల (Libra):
పనిలో కొన్ని తీవ్రమైన సమస్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు తగినంత నిద్రపోతున్నారా? లేదా? చూసుకోండి. రోజంతా అశాంతికి దూరంగా ఉండండి. ఎవరైనా స్నేహితులు సాయంత్రం పూట మిమ్మల్ని కలిసేందుకు రావచ్చు.

లక్కీ సైన్- ఉడత

* వృశ్ఛికం (Scorpio):
రాబోయే కుటుంబ ఈవెంట్ కోసం మీరు చేస్తున్న ప్రిపరేషన్‌ ప్రశంసలు అందుకుంటుంది. ప్రాధాన్యతలను గుర్తించి పనులను పూర్తి చేయడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోండి. కొత్త దినచర్యను అనుసరించి మీరు మంచి పని చేస్తున్నారు.

లక్కీ సైన్- చిలుక

* ధనస్సు (Sagittarius):
ఇప్పుడు మీకు కలుగుతున్న అసౌకర్యానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ త్వరలో మీరు సానుకూల వార్తను అందుకుంటారు. శక్తులు ఇప్పుడు మీలో సరికొత్త ఉత్సాహాన్ని సృష్టించే దిశగా మారాయి. మీ కోసం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబం సంప్రదించక పోవచ్చు.

లక్కీ సైన్- రెడ్‌ డ్రెస్‌

* మకరం (Capricorn):
ఇప్పుడు మరికొంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీ సమయాన్ని ఆదా చేసుకోవచ్చు. మీరు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకునే విషయంలో దీనికి ఏదో సంబంధం ఉంది. మీకు సమీపంలోనే మిమ్మల్ని అడ్మైర్‌ చేస్తున్న వ్యక్తి ఉన్నాడు. మీ స్థానం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.

లక్కీ సైన్- బ్లూ సెఫైర్‌

* కుంభం (Aquarius):
మీ వ్యక్తిగత జీవితం ముందుకు వెళ్లడంలో ఆలస్యం జరగడానికి కొన్ని తెలియని అంశాలు కారణం కావచ్చు. లోతుగా తవ్వండి, అందే ఫలితాలతో మీరు ఆశ్చర్యపోతారు. ప్రాక్టికల్‌గా ఆలోచించి తీసుకొనే నిర్ణయం మీరు ముందుకు సాగడానికి సహాయపడవచ్చు.

లక్కీ సైన్- గ్రీన్‌ అవెంచురైన్‌

* మీనం (Pisces):
మిమ్మల్ని మీరు వ్యక్తీకరించుకోవడానికి ఇది ఒక అందమైన రోజు. ఏదైనా రాయండి, అది త్వరలో మీ అలవాటుగా మారవచ్చు. గత సంవత్సరం మీరు సాధించిన విజయాలకు కృతజ్ఞతతో ఉండండి. ఈరోజు కొత్త అవకాశాలను కూడా తెస్తుంది.

లక్కీ సైన్- ఎమరాల్డ్‌
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Future Prediction, Horoscope, Zodiac sign

తదుపరి వార్తలు