Zodiac Signs: ఏప్రిల్ 28 రాశిఫలాలు. చంద్రుడికిపై రాకెట్లను పంపుతున్న కంప్యూటర్ యుగంలో కూడా చాలా మంది జ్యోతిషశాస్త్రాన్ని నమ్ముతారు. జ్యోతిష్య పండితులు.. రాశులు, గ్రహాల కదలిక, నక్షత్రాల ఆధారంగా ప్రతి రోజు దినఫలాలను చెబుతారు. ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరిస్తారు. మరి ఏప్రిల్ 29న ఎవరికి ఎలా ఉంది? మేషం నుంచి మీనం వరకు ఏ రాశికి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
మేషం (Aries):
అదనపు లేదా కొత్త ఆదాయ వనరుల ఆలోచన రూపుదిద్దుకోవడం ప్రారంభించవచ్చు. మీరు పనిచేసే విధానంలో మార్పులు చోటుచేసుకోవచ్చు. ఇది మీ పురోగతికి మరింతగా ఉపయోగపడుతుంది. కుటుంబం మీకు అండగా ఉంటుంది.
లక్కీ సైన్- ఒక సెలెనైట్
వృషభం(Taurus):
వాయిదా వేయాలనే ఎలాంటి ఆలోచన మీలో ఉన్నా వెంటనే దానిని మీ మైండ్ నుంచి తొలగించాలి. బయటి నుంచి వచ్చే కొంత ఉపయోగకరమైన సమాచారం మీ రోజును ఆదా చేస్తుంది. మీపై ఆర్థికంగా ఆధారపడిన వారు ఇప్పుడు మీకు ఆ భారాన్ని తగ్గిస్తారు.
లక్కీ సైన్ - ఆర్చిడ్స్
మిథునం (Gemini):
మీ నిజాయితీ మొదట్లో ఎవరూ గుర్తించకపోవచ్చు. కానీ మీరు గురించి ఇప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలుస్తుంది. నమ్మదగిన పనులలో విజయం సాధించగలరు. బయటి వ్యక్తులతో నిబంధనలు ఊహించిన దాని కంటే మరింత కఠినంగా ఉండవచ్చు.
లక్కీ సైన్ - ఒక పుస్తకాల పురుగు
Chanakya Niti: మగవాడు ఈ 4 విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదట.. కట్టుకున్న భార్యకు కూడా..
కర్కాటకం (Cancer) :
చిన్న సమస్యలు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. కానీ వాటిని ఒక్కొక్కటిగా ఎదుర్కోవడం వల్ల మీ జీవితం సులభతరం అవుతుంది. మీ పిల్లలకి కొన్ని డిమాండ్లు ఉండవచ్చు. కానీ అవి సరైనవి కాకపోవడం వల్ల మీరు అంగీకరించలేని పరిస్థితి. వాటి గురించి మీ పిల్లలకు అర్థమయ్యేలా వివరించండి.
లక్కీ సైన్ - ఒక క్రిస్టల్
సింహం (Leo):
మీరు ఒక అద్భుతం లాంటి పరిస్థితిని నమ్మకపోవచ్చు. కానీ కొన్నిసార్లు మీకే అర్ధమవుతుంది. ఈరోజు మీకు చాలా ఈజీగా ఉంటుంది. డబ్బుకు సంబంధించిన పనులను ఎక్కువగా జరుగుతాయి. ఇవాళ మీరు బహుమతులు పొందే అవకాశం ఉంది.
లక్కీ సైన్ - ఒక పిరమిడ్
కన్య (Virgo):
మీరు మీ బిజీ షెడ్యూల్‌ని ఇష్టపడకపోవచ్చు. మరింత ఆసక్తికరమైన దాని కోసం వెతుకుతూ ఉండవచ్చు. మీరు గతంలో కంటే ఎక్కువగా కూర్చుని విశ్లేషించవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మీరు మీ ప్రణాళికలను అమలు చేయడానికి అవకాశం పొందవచ్చు.
లక్కీ సైన్- ఒక అలంకార రిబ్బన్
Zodiac Signs | May Month: మే నెల ప్రేమికులకు మంచి జ్ఞాపకంగా నిలుస్తుంది.. ఈ 3 రాశుల వారికి
తుల (Libra):
మీ జీవితంలో కొత్తగా వచ్చిన వారితో అనుబంధం పెరుగుతుంది. మీ వ్యాపార చతురతకు ప్రశంసలు దక్కుతాయి. ముఖ్యంగా మీ తల్లిదండ్రుల మెప్పు పొందుతారు. మీరు ఒకవేళ రిలేషన్‌షిప్‌లో ఉన్నా? భాగస్వామి కోసం వెతుకుతున్నా? కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీ ముందు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. నచ్చిన వారిని ఎంచుకున్నాకే కమిట్ అవ్వాలి.
లక్కీ సైన్ - ఒక నియాన్ గుర్తు
వృశ్చికం (Scorpio):
మీ ఆలోచన ప్రక్రియలో ఆకస్మిక మార్పు మీ నిర్ణయాన్ని మార్చగలదు. మీరు కమ్యూనిటీ ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నట్లయితే ఇది మీకు మంచి ప్రారంభం అయ్యే అవకాశముంది. ఏదైనా కొత్త దానికి దరఖాస్తు చేసుకునే వారికి స్పల్ప అడ్డంకలు ఎదురయ్యే సూచనలున్నాయి.
లక్కీ సైన్- ఒక స్కీమ్
ధనుస్సు (Sagittarius):
వాయిదాల వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.అందుకే ఏ పనిని వాయిదా వేయకండి. మీరు చట్టపరమైన విషయాలలో జాప్యం జరుగుతుంది. ఎవరితోనైనా కలిసి పనిచేయాలని మీరు భావిస్తుంటే.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. వారితో మీకు విభేదాలు తలెత్తే అవకాశముంది.
లక్కీ సైన్ - రూబీ రెడ్ స్టోన్
మకరం (Capricorn):
మీరు నిజంగా కోరుకున్నదాన్ని మీ తల్లిదండ్రులు తిరస్కరించి ఉండవచ్చు. దానికి గల కారణం గురించి మీకు తర్వాత అర్ధమవుతుంది. కానీ ముందు మీరు మీ తల్లిదండ్రులు చెప్పిందే చేయండి. మీకు దగ్గరగా ఉన్న ఎవరైనా మీ అంచనాలకు అనుగుణంగా ఉండకపోవచ్చు.
లక్కీ సైన్- ఒక సాలిటైర్
కుంభం (Aquarius):
మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి గురించి మీరు తీసుకుంటున్న శ్రద్ధ సరిపోదు. ఇంకాస్త దృష్టి సారించాలి. అసంతృప్తితో కూడిన ఆలోచనలు మీకు మరింత చికాకులు కలిగిస్తాయి. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలన్న విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు.
లక్కీ సైన్- ఒక పైకప్పు
Dream meaning: మీరు కలలో ఈ జీవిని చూశారా? అది మీరు తప్పక ధనవంతులవుతారనే సంకేతమేనట...
మీనం (Pisces):
మీ పరిణతి చెందిన నిర్ణయాలను అవతలి వారు అదే విధంగా స్వీకరించకపోవచ్చు. మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో.. ఎందుకోసం చేస్తున్నారోనని కొందరు నిశితంగా గమనిస్తారు. తర్వాత అర్థం చేసుకుంటారు. మీకు అధికారం ఉన్నట్లయితే.. మీ సలహాదారుని విషయంలో పునఃపరిశీలన చేయండి.
లక్కీ సైన్ - ఒక రాగి కూజా
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Rashifal, Zodiac signs