హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rashi Phalalu Today: ఈ రాశుల వారిపై నిందలు.. సీరియస్‌గా తీసుకోవద్దు.. ఏప్రిల్‌ 30 రాశిఫలాలు

Rashi Phalalu Today: ఈ రాశుల వారిపై నిందలు.. సీరియస్‌గా తీసుకోవద్దు.. ఏప్రిల్‌ 30 రాశిఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Astrology Today: ఏప్రిల్‌ 30 శనివారం నాడు ఏయే రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో.. జ్యోతిష్య పండితులు ఏం చెబుతున్నారో.. ఇక్కడ తెలుసుకుందాం.

Horoscope Today: ఏప్రిల్‌ 30 రాశిఫలాలు. ఓ రాశివారికి చెందిన వారు ఈ రోజు చాలా కాలం తర్వాత పాత స్నేహితుడిని కలుస్తారు. మరో రాశికి చెందిన వారి లాంగ్‌ డిస్టేన్స్‌ రిలేషన్‌షిప్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొందరు తమ చుట్టూ ఉన్న వారికి నో చెప్పడం నేర్చుకోవాలి. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్‌ 30 శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూద్దాం.

* మేషం (Aries):

మీరు పెట్టిన పెట్టుబడులపై త్వరలో రాబడులు అందుకొంటారు. ఎమోషన్స్‌ అయినా, ఆర్థికపరమైన అంశాలైనా కావచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు నో చెప్పడం మీరు నేర్చుకోవాలి లేదా వారు ప్రయోజనం పొందవచ్చు. ఎవరైనా మీపై నిందలు వేస్తే, దానిని సీరియస్‌గా తీసుకోవద్దని సలహా.

లక్కీ సైన్- మట్టి కుండ

Numerology Today: వీరికి అదృష్టం కలిసి వస్తుంది.. అక్కడ పెట్టుబడి పెడితే భారీగా లాభాలు..

* వృషభం (Taurus):

మీరు ఇటీవల బయటి విషయాలు పెద్దగా పట్టించుకోకుండా మీరే మీ లోకంగా ఉంటున్నారు. మీ చుట్టూ ఉన్న పరిణామాలతో మీరు డిస్‌కనెక్ట్ అవడానికి దారితీయవచ్చు. మీకు సక్రమంగా అనిపించే ఆఫర్‌ను అందుకోవచ్చు. పిల్లలు ఒత్తిడికి కొత్త కారణం కావచ్చు కానీ అది తాత్కాలికమే.

లక్కీ సైన్- ఎల్లో క్రిస్టల్‌

* మిథునం (Gemini):

మీరు అధ్వాన పరిస్థితులను ఎదుర్కొనేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకొన్నారు. అయితే మీరు ఫలితాలను చూసి ఆశ్చర్యానికి లోనవుతారు. ఆర్థిక రంగంలో పనిచేసే వ్యక్తులు ఒత్తిడికి గురవుతారు. విద్యావేత్తలకు బిజీగా ఉంటారు. వినోద వ్యాపారంలో ఉన్నవారికి ఇది మంచి సమయం.

లక్కీ సైన్- రెయిన్‌బో క్రిస్టల్‌

* కర్కాటకం (Cancer):

పాత నమూనాలు నెమ్మదిగా మారుతున్నాయి. ఇచ్చిన పనిలో కొత్త ఉత్సాహాన్ని గమనించవచ్చు. ఈ కాలం మీకు నైపుణ్యం ఉన్న ప్రాంతంలో కీర్తిని పొందే అవకాశం ఉంది. అంశాలను పట్టుకు కూర్చోవడం వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. పరిస్థితులకు అనుగుణంగా మార్పు అవసరం.

లక్కీ సైన్- మూన్‌స్టోన్‌

* సింహం (Leo):

చిన్న సంఘర్షణ వేరే రూపాన్ని తీసుకోవచ్చు. వీలైనంత త్వరగా విషయాన్ని ముగించడానికి ప్రయత్నించండి. కళారంగంలోని వ్యక్తులకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. రిటైల్ వ్యాపారంలో ఉన్నవారికి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంది.

లక్కీ సైన్- గూస్‌బెర్రీ

సూర్యగ్రహణం నుంచి నక్కతోక తొక్కి కుబేరులు కాబోతున్న 2 రాశులవారు వీరే

* కన్య (Virgo):

కనీసం అస్సలు ఊహించిన ప్రదేశాల నుంచి వ్యాపార అవకాశాలు లభిస్తాయి. పనిలో లేదా ఇంట్లో ఎవరైనా మీ పై ఆధిపత్యం చెలాయిస్తున్నట్లు అనిపిస్తే, త్వరలో వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆహ్లాదకరమైన గెట్‌ టుగెదర్‌కు హాజరయ్యే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- క్యాష్‌ బాక్స్‌

* తుల (Libra):

మీరు థియేటర్, డ్రామాటిక్స్, నటన రంగంలో ఉన్నట్లయితే మీ కోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి. మీరు జనాదరణ పొందిన స్థలం నుండి ఆహ్వానం అందితే దానిని తప్పనిసరిగా పరిగణించాలి. ప్రేమలో విడిపోయే సూచనలు ఉన్నాయి. మానసికంగా బలంగా ఉండాలి.

లక్కీ సైన్- సీతాకోక చిలుక

* వృశ్ఛికం (Scorpio):

ఇద్దరు స్నేహితులు చాలా కాలం తర్వాత కలుసుకున్నప్పుడు అది నిజంగా మ్యాజికల్‌గా ఉంటుంది. అలాంటి అనుభూతిని పొందే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో ఏదైనా బాధకు గురైనట్లయితే, దానిని వ్యక్తీకరించడానికి ఇది సమయం. మీరు గొప్ప ఉపశమనాన్ని అనుభవిస్తారు.

లక్కీ సైన్- లార్జ్‌ పార్క్‌

Shani Amavasya: శనిఅమావాస్యనాడు ఆడవారు పొరపాటున కూడా ఈ 6 తప్పులు చేస్తే సర్వనాశనమేనట..

* ధనస్సు (Sagittarius):

ఇది ప్రకాశవంతమైన రోజు, పరిస్థితులు మీకు అనుగుణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు, చాలా కాలంగా పక్కనపెట్టేసిన పనులు అన్నీ పూర్తవుతాయి. ఇంటి బాధ్యతలకు ఈరోజు ప్రాధాన్యం ఇవ్వకపోయినా ఫరవాలేదు.

లక్కీ సైన్- మ్యారిగోల్డ్‌ ఫ్లవర్‌

* మకరం (Capricorn):

ఆఫీసులో ఉన్న ఒక జూనియర్ వారి ఆందోళనను మీ దృష్టికి తీసుకువస్తే, సమస్యలను పరిష్కరించడానికి సహాయం చేయండి. మీరు స్టాక్ మార్కెట్‌లో చురుకుగా వ్యవహరిస్తుంటే, మీరు కొంత త్వరగా డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి.

లక్కీ సైన్- నియాన్‌ లైట్‌

* కుంభం (Aquarius):

లాంగ్‌ డిస్టేన్స్‌ రిలేషన్‌షిప్‌లో చిన్న సమస్యలు రావచ్చు. అయితే ఇది చాలా తాత్కాలిక దశ. పనిలో ఒత్తిడి సాధారణం కంటే ఎక్కువగా ఉండవచ్చు. మీకు సంగీతం మంచి థెరపీ.

లక్కీ సైన్- రెట్రో మ్యూజిక్‌

* మీనం (Pisces):

గ్రూప్‌గా మీరు ఏదైనా ప్లాన్ చేస్తుంటే, అది ఇప్పుడు రూపుదిద్దుకునే అవకాశం ఉంది. చాలా కాలంగా వాయిదా పడుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. మీరు సరదాగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి సవ్యంగా ఉండే సూచనలు ఉన్నాయి.

లక్కీ సైన్- గ్లాస్‌ డోర్‌

Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు