Home /News /astrology /

RASHI PHALALU TODAY ON 24TH MAY 2022 THESE PEOPLE SHOULD BE CAREFUL ABOUT FINANCIAL MATTERS DONT GIVE MONEY TO ANYONE PJN GH SK

Rashi Phalalu Today: డబ్బు విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి.. ఎవరికీ రుణాలు ఇవ్వొద్దు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Astrology Today: మే 24వ తేదీ మంగళవారం నాడు.. ఏయే రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? జ్యోతిష్య పండితులు ఎలాంటి సలహాలు సూచనలు చేస్తున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

Horoscope Today: మే 24 రాశి ఫలాలు. ఇవాళ ఓ  రాశివారు మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. కొందరి నుంచి కుటుంబం ఎమోషనల్‌ సపోర్ట్‌ కోరుకుంటోంది. నిజంగా అవసరాల్లో ఉన్న సహోద్యోగి మీ సహాయం కోసం రావచ్చు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 24వ తేదీ మంగళవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.

* మేషం (Aries):
మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి, గత బకాయిలు చెల్లించడానికి మంచి రోజు. తేలికపాటి ఇన్‌ఫెక్షన్‌లు, తలనొప్పితో బాధపడే సూచనలు ఉన్నాయి. వాగ్వాదం జరిగినప్పుడు మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. భవిష్యత్తులో సహాయం చేస్తుంది.

లక్కీ సైన్- గార్డెన్‌

* వృషభం (Taurus):
రోజులోని శక్తులు మిమ్మల్ని కొన్ని కొత్త పనులను ప్రారంభించేలా చేస్తాయి. ఎవరైనా రుణం అడిగితే, మీరు సున్నితంగా తిరస్కరించవచ్చు. ఈ రోజు ఎక్కువగా నడవడం మేలు.

లక్కీ సైన్- రెండు ఈకలు

* మిథునం (Gemini):
మీరు లోపల నుండి బలంగా ఉన్నప్పటికీ ఇతరులు ఈరోజు మీ ఎమోషనల్‌ సైడ్‌ను చూసే అవకాశం ఉంది. సమతుల్యతను సాధించడానికి కొన్ని చర్చలు, వ్యూహాలు అవసరం. నిజమైన సమస్యల్లో ఉన్న సహోద్యోగి సహాయం కోసం అడగవచ్చు.

లక్కీ సైన్- పెబుల్స్‌

* కర్కాటకం (Cancer):
పాత పరిచయస్తుడిని కలవడం లేదా తిరిగి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఔట్‌డోర్‌ అపాయింట్‌మెంట్‌ ఉంటే అందుకు వాతావరణం సపోర్ట్‌ చేయకపోవచ్చు. మీరు ఏదైనా అంశానికి సపోర్ట్‌ చేయాలని భావిస్తుంటే.. ఆ అవకాశం ఇప్పుడు లభించవచ్చు.

లక్కీ సైన్- హ్యాండ్‌మేడ్‌ పేపర్‌

* సింహం (Leo):
అతిథులు చెప్పకుండా మిమ్మల్ని చూడటానికి రావచ్చు. ఇది తీపి వంటకాలతో నిండిన రోజు. కొన్ని పెండింగ్ బకాయిలు క్లియర్ కావచ్చు. మీ సహాయక సిబ్బంది ఫిర్యాదును తీసుకురావచ్చు, ప్రాధాన్యత పై దాన్ని పరిష్కరించండి.

లక్కీ సైన్- పెర్ల్స్‌

* కన్య (Virgo):
పని వద్ద వాతావరణం అనుకూలంగా కనిపిస్తుంది, మీరు సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను మాట్లాడేందుకు ఆసక్తి చూపుతారు. ఇంట్లో, కార్యాలయంలో రాతపనిని చేయండి. మీకు నిద్ర కరువైంది, ఈ రాత్రి కొంత నాణ్యమైన నిద్ర పొందేలా జాగ్రత్తలు తీసుకోండి.

లక్కీ సైన్- డోర్‌స్టెప్‌

* తుల (Libra):
శ్రద్ధగా ఉండటం మిమ్మల్ని బలహీనపరచదు. మీ బలమైన పాయింట్లను ముందుకు తీసుకురండి. కొత్త రెసిపీని ప్రయత్నించడానికి ఇది గొప్ప రోజు. మీ ఆరోగ్య పరిస్థితిపై అదనపు శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉంది.

లక్కీ సైన్- రెడ్‌ స్కార్ఫ్‌

* వృశ్ఛికం (Scorpio):
పీడకలలు లేదా చెడు కలలు కేవలం సబ్‌ కాన్సియస్‌నెస్‌ మైండ్‌లోని భయాలు. వాటిని తీవ్రంగా పరిగణించవద్దు. ఆపోజిట్‌ జెండర్‌కు చెందిన ఓ వ్యక్తి మీ దృష్టిని ఆకర్షించవచ్చు. పాత స్నేహితుడికి కాల్ చేయడం ద్వారా రోజును మరింత సంతోషంగా మార్చుకోండి.

లక్కీ సైన్- ఇటుకల గోడ

* ధనస్సు (Sagittarius):
కొందరు సన్నిహితులు మిమ్మల్ని మిస్‌ అవుతున్నారు. ఈరోజు మీ ప్రియమైన వారి కోసం సమయం కేటాయించండి. సాయంత్రం ఔటింగ్‌కు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. సాధారణ వైద్య పరీక్ష చేయించుకోవడం మేలు.

లక్కీ సైన్- నియాన్‌ సైన్‌

* మకరం (Capricorn):
పాత జ్ఞాపకాలు రోజును శాసించే అవకాశం ఉంది. వాస్తవాలను గమనించడం సహాయకరంగా ఉండవచ్చు. మీ తల్లితో మాట్లాడండి, ఆమె మీతో మాట్లాడటానికి ఎదురుచూస్తోంది. పాత విధానం కోసం కొత్త ప్రణాళికను రూపొందించండి.

లక్కీ సైన్- గ్లాస్‌

* కుంభం (Aquarius):
మీ భయాలు ఇప్పుడు అదుపులో ఉన్నాయి. చెడు కలలు లేవు, కాలం మారింది. ఇటీవలి నెలల్లో మీరు సాధించిన దానికి మీరు కృతజ్ఞతతో ఉన్నారు. మీరు అదనపు బాధ్యతను పొందే అవకాశం ఉంది.

లక్కీ సైన్- మర్రి చెట్టు

* మీనం (Pisces):
మీరు మీ కుటుంబానికి ఎమోషనల్‌ సపోర్ట్‌, వారికి మీ నుండి ఎక్కువ సమయం కావాలి. కొత్త ఒప్పందంపై సంతకాలు చేసే అవకాశం ఉంది. వైద్య నిపుణులు సాధారణం కంటే ఎక్కువ బిజీగా ఉంటారు. ప్రభుత్వ అధికారులు ఆటంకాలు ఎదుర్కొంటారు.

లక్కీ సైన్- జంట పక్షులు
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Horoscope Today, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు