Horoscope Today: ఏప్రిల్ 23 రాశిఫలాలు. ఓ రాశివారికి చెందిన కుటుంబంలో త్వరలో వేడుక జరగనుంది. కొందరు పార్టీని నిర్వహించే సూచనలు ఉన్నాయి. మరి కొందరు సామాజిక కార్యక్రమాల్లో గుర్తింపు పొందుతారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్ 23 శనివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
మేషం (Aries):
అంతా సజావుగానే ఉందని ఫీల్ అవ్వాల్సిన సరిస్థితి. అనవసరమైన అంశాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. కుటుంబంలో త్వరలో ఓ వేడుక జరగబోయే అవకాశం ఉంది. ఎదురుచూస్తున్న అనుమతి లభిస్తుంది.
లక్కీ సైన్- కాన్‌స్టలేషన్
వృషభం (Taurus):
ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి సంకోచిస్తారు. మీకు లోపల, బయట నుంచి లభించే సూచనలు అభినందించదగినవి. పొట్టకు సంబంధించిన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండటం మేలు.
లక్కీ సైన్- హోర్డింగ్
మిథునం (Gemini):
కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. మీరు ఎదురు చూడకపోయినా ఎంచుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబానికి సంబంధించి పరిష్కరించాల్సిన చిన్న సమస్య ఉంది.
లక్కీ సైన్- కుందేలు
కర్కాటకం (Cancer):
ఏదైనా ఈవెంట్ లేదా పార్టీని నిర్వహించే సూచనలు ఉన్నాయి. ఖర్చు చేసేందుకు ప్రాస్ఫరస్‌గా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా సామాజిక కార్యక్రమాల్లో భాగమై ఉంటే.. మీకు గుర్తింపు లభిస్తుంది.
లక్కీ సైన్- పార్శిల్
Astrology: శని దేవుడి చల్లని చూపులు.. ఈ రాశుల వారి జీవితాల్లో అనూహ్య మార్పులు
సింహం(Leo):
మీ ప్రయాణాన్ని మీరు నిర్ధేశించుకోవాల్సిన రోజులు ఉన్నాయి. ఇది అలాంటి రోజుల్లో ఒకటి. మీరు అనుకుంటున్న పనిని పూర్తి చేసి ప్రయోజనాలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనులను ఒకరు చాలా దగ్గరగా గమనిస్తున్నారు.
లక్కీ సైన్- సిలికాన్ మౌల్డ్
కన్య (Virgo):
పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని సూచనలు మనసు చేస్తున్నా.. ఆతృత పెరుగుతుంది. మీడియా, మార్కెటింగ్‌లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. మీ వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి.
లక్కీ సైన్- మామిడి చెట్టు
తుల (Libra):
ఉన్న సమయంలో పూర్తి చేయగలిగిన పనికి మించి చేయాలనే మీ ఆలోచనతో అలసిపోతారు. ఇలాంటి పనులతో త్వరలోనే బోర్‌గా ఫీల్ అవుతారు. పని నుంచి కొంత బ్రేక్ తీసుకొని కొత్త ఉత్సాహంతో తిరిగి రండి.
లక్కీ సైన్- వాల్ మిర్రర్
Astrology: ఈ రాశుల వారికి సూర్య భగవానుడి ఆశీస్సులు.. మే 14 వరకు శుభ ఫలితాలు
వృశ్ఛికం (Scorpio):
డబ్బు సంపాధించాలనే మీ ప్రధాన లక్షం విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని వ్యక్తుల నుంచి లభించే సహకారంతో ఈ రోజు బయటపడతారు. మీ పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్‌ను పరీక్షించాల్సిన అవసరం ఉంది.
లక్కీ సైన్- ఇండోర్ ప్లాంట్
ధనస్సు (Sagittarius):
రెండు విభిన్న దృక్పథాలను కలిపేందుకు గతంలో మీరు చేసిన కృషికి సంబంధించిన ఫలితాలను అందుకొనే సమయం. కుటుంబంలో ఆలోచనలకు సంబంధించిన విభేదాలు తలెత్తే అవకాశం ఉంది.
లక్కీ సైన్- అంబెర్ స్టోన్
మకరం (Capricorn):
చిన్న వ్యతిరేకత సీరియస్ వాగ్వాదంగా మారే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోండి. బృందంతో కలిసి పని చేయడం తోనే మేలు జరుగుతుంది. రాతపూర్వక సంప్రదింపులు ఒకటికి రెండుసార్లు సరి చేసుకోండి.
లక్కీ సైన్- మల్లెపూవు
కుంభం (Aquarius):
మీరు అనుకొన్న పనిని పూర్తి చేసేందుకు కొంత దూరంలోనే ఉన్నారు. కాస్త రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. ఆర్థిక పరిస్థితుల్లో కదలిక కనిపించే అవకాశం ఉంది. కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలి.
లక్కీ సైన్- నోట్‌బుక్
మీనం (Pisces):
మీ ఆలోచనలు, పనులకు సంబంధించి రియలిస్టిక్, ఆబ్జెక్టివ్‌గా ఉండాలి. పెద్దవారు ఇచ్చే సలహా మీరు ఉపయోగపడుతుంది. మీకు విషయాలను రొమాంటిసైజ్ చేయడం ఇష్టం. దీంతో చిక్కుకుపోయిన పరిస్థితులను ఎదుర్కొంటారు.
లక్కీ సైన్- గోల్డెన్ వాచ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs