Horoscope Today: ఏప్రిల్ 27 రాశిఫలాలు. ఓ రాశివారికి చెందిన వారు ఈ రోజు వ్యాపార అవకాశాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. కొందరు ఉద్యోగ పనిమీద ప్రయాణాలు చేపడతారు. చాలా కాలంగా మిస్టరీగా ఉన్న అంశం ఈ రోజు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొందరు అకస్మాత్తుగా కీర్తిని పొందుతారు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్ 27 బుధవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
* మేషం (Aries):
త్వరలో ఎమోషనల్‌గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది. మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. మీరు ఊహించని ఓ ఘటన జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో జరిగే ఓ పనితో ఇంకా ముందు ముందు ఎలాంటివి జరగబోతున్నాయని ఆలోచిస్తారు.
లక్కీ సైన్- మందార పువ్వు
* వృషభం (Taurus):
పరిస్థితుల పర్యవసానంగా మీ ఎఫర్ట్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చాలా సమయం ఆలోచిస్తూ గడిపేస్తున్నారు. మీ జీవిత భాగస్వామి నుండి కొద్దిగా మద్దతు లభించే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- మ్యారిగోల్డ్
* మిథునం(Gemini):
ఇది న్యూ ప్రామిసస్‌తో కూడిన కొత్త రోజు. మీకోసం మీరు నిర్ణయించుకొన్న విధంగా ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి ఎక్కువ కాలం స్థిరంగా ఉంటుందని మీరు ఆశించవచ్చు. మీరు అప్రమత్తంగా లేకుంటే వ్యాపార అవకాశాన్ని కోల్పోతారు.
లక్కీ సైన్- నియాన్ సైన్‌బోర్డ్
ఆరోజు రాశి చక్రం ప్రకారం ఈ వస్తువులను కొనుగోలు చేస్తే.. అదృష్టం, ఆనందం రెండూ డబుల్..
* కర్కాటకం (Cancer):
మీకు దక్కిన ఓ అవకాశంతో అకస్మాత్తుగా కీర్తి లేదా ప్రజాదరణ పొందవచ్చు. ఉద్యోగానికి సంబంధించి ఆకస్మిక ప్రయాణానికి అవకాశం ఉంది. చుట్టుపక్కల పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నా మీ మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది.
లక్కీ సైన్- సన్‌ఫ్లవర్
* సింహం (Leo):
చాలా కాలంగా ఏదైనా మిస్టరీగా భావిస్తుంటూ.. అది ఇప్పుడు వెలుగులోకి వచ్చే సూచనలు ఉన్నాయి. జరుగుతున్న మీ పనికి సీనియర్ హోదాలో ఉన్న ఒక మహిళ అడ్డంకిని సృష్టించవచ్చు. పనిలో పురోగతి సాధ్యమవుతుంది.
లక్కీ సైన్- బుద్ధుడి విగ్రహం
* కన్య (Virgo):
మధ్యస్థమైన విధానం లేదా నిరాడంబరమైన వైఖరి మీకు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్న వ్యక్తిని మీరు కలుసుకొనే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల ఎదురైన ఓ అనుభవం మళ్లీ పునరావృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
లక్కీ సైన్- మ్యాగ్నెట్
* తుల (Libra):
మీ ఇన్‌సైడ్ చాలా అందమైంది. దీనిని గుర్తించిన వారిలో ఎవరైనా మీకు త్వరలో అదే విషయాన్ని తెలియజేస్తారు. విదేశాలకు వెళ్లే ప్రణాళిక త్వరలో ప్రారంభం అవుతుంది. మీరు మీ కోసం సరికొత్త జీవనవిధానాన్ని ప్లాన్ చేసుకొని ఉండవచ్చు.
లక్కీ సైన్- కొయ్య
* వృశ్ఛికం
మీకు అన్ని సమాధానాలు తెలియకపోవచ్చు, కాబట్టి మీరు ప్రతిదానిని ఫేస్ వ్యాల్యూ ఆధారంగా అంచనా వేసే అవకాశం ఉంది. మీ నక్షత్రాల గమనం ఆధారంగా ప్రస్తుతం డల్ పీరియడ్ నడుస్తోంది. మీరు చాలా సార్లు మీకు మీరే సర్దిచెప్పుకొని ఉంటారు.
లక్కీ సైన్- ఎల్లో రోజ్
Solar eclipse 2022: సూర్యగ్రహణం ఈ 3 రాశులకు ప్రమాదం.. అత్యంత జాగ్రత్తగా ఉండాలి..! ఎందుకంటే
* ధనస్సు (Sagittarius):
ఆకస్మిక ప్రణాళికలు రోజంతా ఎదురవుతాయి. దీంతో కొంత ఎంటర్‌ట్రైన్‌మెంట్ కలుగుతుంది. యాదృచ్ఛిక సంభాషణలు గొప్ప మానసిక సాంత్వనను తీసుకురావచ్చు. ఓ మంచి పనికి విరాళం ఇచ్చే అవకాశం ఉంది.
లక్కీ సైన్- స్టార్
* మకరం (Capricorn):
మీరు మీ పనులకు ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఆకస్మిక భారాన్ని అనుభవించే అవకాశం ఉంది. బంధువులు మిమ్మల్ని చూడటానికి వచ్చేందుకు ప్లాన్ చేసుకొన్నారు. మీ పిల్లల కోపాలను పరిష్కరించడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టవచ్చు.
లక్కీ సైన్- వాటర్ లిల్లీస్
* కుంభం (Aquarius):
మీకు శక్తి తోడవడంతో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తోంది. మీరున్న కొత్త ప్రదేశాలు కూడా కారణం కావచ్చు. మీకు సహాయం అవసరమైతే, అది త్వరలోనే అందే అవకాశం ఉంది.
లక్కీ సైన్- లష్ గ్రీన్ గ్రాస్
Astro Vastu Tips: ఈ ఒక్కటీ మీ ఇంట్లో ఉంటే.. డబ్బు కష్టాలు దూరం.. వాస్తు దోష నివారణ కూడా..
* మీనం (Pisces):
మీకు కొన్ని సమయాల్లో మానసికంగా అలసిపోయినట్లు లేదా ఆసక్తి లేకుండా అనిపించవచ్చు. మీరు ఇప్పటికీ ప్రస్తుత పరిస్థితి గురించి అనిశ్చితంగా భావించవచ్చు, కానీ విషయాలు ఇప్పుడు సర్దుకున్నాయి. ఒకప్పటి స్నేహితుడు మళ్లీ కలిసే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- మర్రిచెట్టు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Future Prediction, Horoscope, Zodiac signs