Horoscope Today: మే 5 రాశి ఫలాలు. ఓ రాశివారికి చెందిన వారికి ఈ రోజు మిత్రుడి గురించి సానుకూల వార్త అందుతుంది. మరో రాశికి చెందిన వారు ఎదురుచూస్తున్న సమాధానాలు దొరుకుతాయి. కొందరికి పని ఒత్తిడి పెరుగుతుంది. మరి కొందరు ఆరోగ్యం, జీవనశైలిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కొందరు పాత అలవాట్లను విజయవంతంగా వదులుకోగలరు. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 5వ తేదీ గురువారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
* మేషం (Aries):
మీరు క్షమించమని అడిగితే కొన్ని అవకాశాలు అయినా మిగులుతాయి. కాబట్టి మీరు వెంటనే దీన్ని నిర్ధారించుకోండి. మీకు మానసిక చికిత్స అవసరం. మీకు అంతర్గత స్థాయిలో వైద్యం అవసరం కావచ్చు. అంగీకారం మీకు అవసరం. మీరు దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే దరఖాస్తు చేసుకోండి.
లక్కీ సైన్- స్టిల్ ఇమేజ్
* వృషభం (Taurus):
ఈ రోజు చాలా తీరిక లేకుండా ఉంటారు. కానీ మీరు నియంత్రణలో ఉంటే దాదాపు అన్ని పనులను పూర్తి చేసే అవకాశం ఉంది. పని భారం కారణంగా బిజీగా ఉంటారు. సన్నిహిత మిత్రుని గురించిన సానుకూల వార్త ఓదార్పునిస్తుంది.
లక్కీ సైన్- సిల్వర్ వైర్
* మిథునం (Gemini):
మీరు ఇప్పుడు మీ రాబోయే నెలల కోసం కొన్ని కొత్త ఆలోచనలు చేయాల్సిన అవసరం రావచ్చు. మీరు ఎక్కువ ప్రాజెక్ట్‌లలో పని చేస్తుంటే, పరిమితమైన వాటిపై దృష్టి పెట్టడానికి ఇప్పుడు మంచి సమయం. రియల్ ఎస్టేట్‌లోని వ్యక్తులు స్థిరమైన వృద్ధిని అనుభవిస్తారు.
లక్కీ సైన్- రెండు గాలి పటాలు
Numerology Today: మీరు ఈ తేదీల్లోనే పుట్టారా? మీకో శుభవార్త.. నేడు ధనలాభ సూచనలు
* కర్కాటకం (Cancer):
మీ అంతర్గత ప్రతిభను ప్రదర్శించడానికి కొత్త మార్గాలు తెరుచుకొనే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీ విశ్వాసం ఇతరులకు అసూయగా మారవచ్చు. చుట్టూ ఉన్న కొందరు వ్యక్తులు మీ సామర్థ్యానికి వ్యతిరేకంగా మీ విజయాల గురించి గాసిప్ చేయవచ్చు. జాగ్రత్తగా ఉండండి.
లక్కీ సైన్- గిటార్
* సింహం (Leo):
రోజు ప్రారంభంలో కొంత ఆందోళన సంకేతాలు కనిపించవచ్చు. కానీ మీరు త్వరలో దాన్ని పరిష్కరించడంలో విజయం సాధించవచ్చు. అనుకోని కొన్ని ఘటనలు చూడటం ద్వారా ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. పాత సహోద్యోగి అనుకోకుండా కనిపించవచ్చు.
లక్కీ సైన్- జంతువు నీడ
* కన్య (Virgo):
వినోద కార్యక్రమాలు, స్నేహితులతో విహారయాత్రలు నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి. రోజు చివరి భాగంలో మీ మనస్సు మరింత కేంద్రీకృతమై ఉండవచ్చు. మీరు కోరుకునే సమాధానాలను గతంలో మీకు పరిచయమైన ఎవరైనా మీకు అందించవచ్చు.
లక్కీ సైన్- కార్టూన్
* తుల(Libra):
ఎదురుచూస్తున్న అసైన్‌మెంట్‌కు సంబంధించిన అప్‌డేట్స్ ద్వారా కొంత ఉపశమనం కలగవచ్చు. అనుకోకుండా హఠాత్తుగా ప్లాన్ చేసే యాత్రతో అవసరమైన ఉత్సాహం కలుగుతుంది. ఎవరైనా మీ నుంచి అందుకోవడానికి ఎదురుచూస్తున్నట్లయితే రిమైండర్‌లను ఉంచుకోవడం మంచిది.
లక్కీ సైన్- రెడ్ స్టోన్
ఈ రాశులవారు పెళ్లి తర్వాత జీవితాంతం ప్రేమను వ్యక్తం చేస్తారు.. మీ రాశి ఉందేమో చూడండి..
* వృశ్ఛికం (Scorpio):
మీ రహస్యం ఇప్పుడు ఎవరికైనా తెలిసే అవకాశం ఉంది. మీరు ఇంకా పూర్తి చేయాల్సిన హామీలు కొన్ని ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిపై తక్షణం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. మందులు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి.
లక్కీ సైన్- బాక్స్
* ధనస్సు (Sagittarius):
మీరు ఈరోజు సాధారణం కంటే ప్రశాంతంగా ఉండవచ్చు. కొన్ని రోజుల నుండి ఇది సాధ్యం కావడం లేదు. ఆఫీసులో కొత్త పని మిమ్మల్ని వ్యూహరచన చేసేలా చేస్తుంది. సమర్ధవంతమైన సబార్డినేట్ పనిలో మీకు సహాయపడవచ్చు.
లక్కీ సైన్- కాన్‌స్టలేషన్
* మకరం (Capricorn):
ఈ కొనసాగుతున్న గందరగోళం మధ్య విశ్రాంతి తీసుకోవడానికి వర్క్ ట్రిప్ కూడా మంచి పరిష్కారం కావచ్చు. మీరు విశ్వసించే స్నేహితుడు ఇప్పుడు సహాయకరంగా ఉండవచ్చు. మీ నగరంలో ప్రయాణిస్తున్న బంధువు మీ సహాయం కోరే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- నది
* కుంభం (Aquarius):
మీతో మీరు మాట్లాడుకోవడం మంచి పని కావచ్చు. ఈ రోజు చిన్న చిన్న సంతోషాలు సరిపోతాయి. మీరు ఈరోజు కూడా చిరాకుగా అనిపించవచ్చు. మధ్యాహ్నానికి ఎక్కువగా శక్తి ఉంటుంది. మీ ఆరోగ్యం, దినచర్యపై శ్రద్ధ పెట్టాలి.
లక్కీ సైన్- పెద్ద హోర్డింగ్
Grumpiest Zodiac Sign: ప్రతి చిన్న విషయానికీ చిరాకే.. ఎక్కువగా చిరాకు పడే లక్షణాలు ఉన్న..
* మీనం (Pisces):
ఎవరైనా మీ పనిని మెచ్చుకున్నట్లయితే మీరు దానిని సీరియస్‌గా తీసుకోకపోవచ్చు, ఎందుకంటే వారి ఉద్దేశం అది కాకపోయి ఉండవచ్చు. మీలో ఏవైనా లోపాలు ఉంటే మీరే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్న పాత అలవాటును విజయవంతంగా దూరం చేసుకుంటారు.
లక్కీ సైన్- సిల్క్ స్కార్ఫ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Future Prediction, Rashi Phalalu, Zodiac signs