హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Rashi Phalalu Today: ఏప్రిల్ 24 రాశిఫలాలు.. వీరు భయాన్ని వీడాలి.. లేదంటే అదే జరుగుతుంది..

Rashi Phalalu Today: ఏప్రిల్ 24 రాశిఫలాలు.. వీరు భయాన్ని వీడాలి.. లేదంటే అదే జరుగుతుంది..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Today Astrology: ఇవాళ్టి దిన ఫలాలు. నేడు పలు రాశుల వారికి బాగుంది. అనుకున్న పనులు జరుగుతాయి. మరికొందరికి మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 24న ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇక్కడ చూద్దాం.

ఇంకా చదవండి ...

Horoscope: ఏప్రిల్ 24 రాశిఫలాలు. జ్యోతిష్య పండితులు ప్రతి రోజూ రాశి ఫలాలు చెబుతుంటారు. గ్రహాల సంచారం, తిథి, నక్షత్రం ఆధారంగా ఎవరికి ఎలా ఉంది? ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది? ఏ రాశుల వారికి ఇబ్బందులు ఎదరువుతాయో అంచనా వేస్తారు. మరి ఇవాళ్టి దిన ఫలాల ప్రకారం..  ఏప్రిల్ 24న ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూద్దాం.

* మేషం (Aries):

మీరు కొన్ని విషయాల గురించి చాలా సాంప్రదాయికంగా ఉండవచ్చు. మీ దృక్కోణం కూడా ఇతరుల దృష్టిని ఆకర్షించవచ్చు. సింపుల్ అప్రోచ్ అనేది త్వరలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడంలో మీకు సహాయపడవచ్చు. కాంప్లికేషన్స్ దూరం చేసుకోండి. మీరు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులను కలుసుకునే అవకాశం ఉంది. వారితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది. సుదూర దేశం నుంచి ఎవరైనా మీకు గిఫ్ట్ అందజేయవచ్చు.

లక్కీ సైన్‌ - ఇంద్రధనస్సు

* వృషభం (Taurus):

ఇతర ఉద్దేశాలు గుర్తించడం కష్టంగా ఉండవచ్చు కానీ మీరు ఇప్పటికీ రిస్క్ తీసుకోవచ్చు. ఇతరులను నమ్మే ముందు కొంత టైమ్ తీసుకోవడం మంచిది. ప్రస్తుత ప్లాన్‌కు బ్యాకప్ ఉండాలి. త్వరలో ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. మీ స్నేహితులను తెలివిగా ఎంచుకోండి.

లక్కీ సైన్‌ - పొద్దుతిరుగుడు

ఈ రాశుల వారు డైమండ్ ధరిస్తే సుడి తిరిగినట్టే.. కానీ, వీరికి మాత్రం అశుభం

* మిథునం (Gemini):

కొందరు వ్యక్తులపై మంచి అభిప్రాయం కలగవచ్చు. మిమ్మల్ని గమనిస్తున్న ఎవరైనా ఇప్పుడు మిమ్మల్ని సంప్రదించవచ్చు. మీపై మీకున్న నమ్మకం అనేక విధాలుగా మీకు సాయం చేస్తుంది. మీ అంతర్గత సామర్థ్యంతో సాధించిన గత విజయాలు తిరిగి వస్తాయి. మీరు ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే, అవి వృద్ధి చెందడం ప్రారంభించవచ్చు. మీ ప్రస్తుత రిలేషన్‌షిప్‌లో తాజాదనాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నించండి.

లక్కీ సైన్‌ - ఒక సిరామిక్ కుండ

* కర్కాటకం (Cancer):

మీ మనసుకు ప్రశాంతత అవసరం కాబట్టి ఇంద్రియాలను విలాసపరచుకోండి. ఏ రకమైన సడలింపు అయినా మీ భవిష్యత్తును బాగా ప్లాన్ చేసుకోవడంలో సహాయపడవచ్చు. ఆకర్షణీయంగా లేని ఎవరైనా ఆసక్తికరంగా కనిపించవచ్చు. మీరు ఇప్పుడు మీ స్నేహితులతో సమయం గడపాలని అనుకోవచ్చు. మీపై భారంగా ఉన్న ఒక నిర్దిష్ట కుటుంబ ఒత్తిడి పరిష్కారం అవుతుంది. అప్పులు అడగడం మానుకోండి.

లక్కీ సైన్‌ - గులాబీ బంచ్

* సింహం (Leo):

పబ్లిక్‌గా ప్రైవేట్ సంభాషణలు చేయడం మానుకోండి. మీకు తెలియకుండానే ఏదో ఒక విషయంలో మీరు జోక్యం చేసుకునే అవకాశం ఉంది. ఇది మిశ్రమ భావాలు, భావోద్వేగాలతో కూడిన రోజు. మీ పట్ల ఆకర్షితులైన ఎవరైనా మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నించవచ్చు. మీరు మానసికంగా కూడా బలహీనంగా ఉండవచ్చు. తొందరపాటు లేదా త్వరిత నిర్ణయాలు తీసుకోకుండా ప్రయత్నించండి. మీరు గందరగోళంగా ఉన్నట్లయితే, లోతైన శ్వాస వ్యాయామాలు ప్రయత్నించండి.

లక్కీ సైన్‌ - పచ్చ

* కన్య(Virgo):

మీరు ఒక ప్రణాళికను రూపొందించి ఉండవచ్చు కానీ అమలు చేయడం కష్టంగా ఉండవచ్చు. సాధారణ రోజువారీ పనులతో బిజీగా ఉండవచ్చు. మీరు గతంలో చేసిన వాటికి ప్రతిఫలాన్ని పొందవచ్చు. చాలా విషయాల గురించి ఆలోచిస్తూ గందరగోళం, అనవసరమైన ఒత్తిడికి గురి కావచ్చు. కాబట్టి ఒక సమయంలో ఒక పనే చేయాలి. కొంచెం బ్రేక్ ప్లాన్ చేసుకోవచ్చు.

లక్కీ సైన్‌ - ఒక క్యాంప్

Astrology: గురు శుక్ర గ్రహాల సంయోగం.. ఈ మూడు రాశుల వారికి విశేష ప్రయోజనాలు

* తుల (Libra)

ఎవరైనా ఉద్దేశపూర్వకంగా మీతో గొడవ పెట్టుకోవాలని అనుకోవచ్చు. మీరు దానిని ప్రతిఘటించాలి. టెంపర్‌మెంట్ ఒక సమస్య కావచ్చు, కానీ రోజులో సగం గడిచాక మీరు దాన్ని శాంతపరచడానికి మార్గాలను కనుగొనవచ్చు. ఇతరులు పని, ఒత్తిడితో మీపై భారం వేయడానికి ప్రయత్నించవచ్చు. మీ మనసు గందరగోళంగా ఉండవచ్చు, ప్రతిదాని గురించి మాట్లాడటం ముఖ్యం కాదు.

లక్కీ సైన్‌ - ఒక మట్టి కుండ

* వృశ్చికం (Scorpio):

మీకు ముఖ్యమైన వారితో అపాయింట్‌మెంట్ ఉంటే, వారి సమయాన్ని, మానసిక స్థితిని గౌరవించండి. మీరు అమలు చేయలేని ఆలోచనల గురించి మాట్లాడకండి. కొంత కాలంగా ఆర్థిక సంక్షోభం ఉండవచ్చు కానీ మీరు దాన్ని త్వరలో అధిగమించవచ్చు. సీనియర్లు మీ గురించి చాలా మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. వారిని నిరాశపరచకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఒక మహిళ సహాయం కోసం మీ కోసం ఎదురుచూస్తూ ఉండవచ్చు. తల్లిదండ్రులు ట్రిప్‌ని ప్లాన్ చేసుకుంటూ ఉండవచ్చు. దాని గురించి మీ అభిప్రాయం అవసరం.

లక్కీ సైన్‌ - లైట్లు

* ధనుస్సు (Sagittarius):

ఏదైనా జరుగుతుందని మీరు ఊహించుకుంటే, మీరు భయపడే అవకాశాలు నిజమయ్యే అవకాశం ఉంది. దీన్ని నివారించడానికి.. ఆలోచనలకు శక్తిని ఇవ్వడం ఆపేయండి. శక్తులు క్రమశిక్షణతో కూడిన రోజును సూచిస్తున్నాయి. మీ స్నేహితులు ఒకరిద్దరు మిమ్మల్ని సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మీరు కలవడానికి ఇష్టపడకపోవచ్చు. మీకు కొత్త రిలేషన్‌షిప్ ఆలోచన ఉంటే, మీ భాగస్వామిని జాగ్రత్తగా ఎంచుకోవాలి.

లక్కీ సైన్- ఒక చిలుక

Astrology: ఈ రాశుల వారిపై బృహస్పతి అనుగ్రహం.. డిసెంబరు వరకు ఎంతో శుభప్రదం

* మకరం (Capricorn):

విశ్వం ప్రస్తుతం మీ అవసరాలు, కోరికలను సరిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. అది జరిగిన తర్వాత మీరు కృతజ్ఞతతో నిండి ఉండవచ్చు. ఒక చిన్న సమస్యపై చిన్న గొడవ లేదా అసమ్మతి ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామికి మీతో సమన్వయం లోపించవచ్చు. మీకు కొంత సమయం కేటాయించాలని లేదా ఎక్కువ స్పేస్ ఉండాలని మీరు భావించవచ్చు. ఆధ్యాత్మిక ప్రయాణం ఉపయోగకరంగా ఉండవచ్చు.

లక్కీ సైన్‌ - సూర్యోదయం

* కుంభం (Aquarius):

జీవితం బోరింగ్‌గా మారవచ్చు. మీరు ఉన్నతంగా ఉండాలని కోరుకోవచ్చు. ఒక పాత బాస్ కొన్ని పని కోసం మిమ్మల్ని సంప్రదించవచ్చు. అణచివేసుకున్న భావోద్వేగాలు బహిరంగంగా బయటపడవచ్చు. ఇతరుల దృష్టిని మరల్చవచ్చు. గతంలో జరిగిన ఆర్థిక పురోగతి కొంత కాలానికి స్థిరంగా మారవచ్చు. మీ అభిరుచిని మళ్లీ అలవర్చుకోండి.

లక్కీ సైన్‌ - ఒక పిచ్చుక

* మీనం (Pisces):

మీరు ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువ లాభం పొందుతారు. మీరు దీన్ని అనుసరిస్తున్నట్లయితే, ఎటువంటి ప్రతిఘటన లేకుండానే పనులు పూర్తవుతాయి. ఈ వారం ఆనందానికి మీ తల్లి ప్రధాన మూలం కావచ్చు. వాయిదా పడుతూ వచ్చిన ఫ్యామిలీ గెట్ టు గెదర్ జరగవచ్చు. మీరు ప్రస్తుతానికి మీ పనికి కొద్దిగా విరామం ఇవ్వవచ్చు. ఇతర బాధ్యతలకు హాజరు కావచ్చు. ధన ప్రవాహం బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ముందు అనుకూలమైన రోజులు ఉండవచ్చు. వీలైతే నీలం రంగుకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.

లక్కీ సైన్‌ - ఒక వెండి చెంచా

First published:

Tags: Astrology, Horoscope, Rasi phalalu, Zodiac signs

ఉత్తమ కథలు