Home /News /astrology /

RASHI PHALALU TELUGU ASTROLOGY HERE IS TODAY HOROSCOPE FOR ALL 12 ZODIAC SIGNS CHECK YOURS HERE PJC GH SK

Rashi Phalalu: ఈ రాశుల వారు దూకుడును తగ్గించుకోవాలి..మీకే మంచిది.. మే 14 రాశి ఫలాలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Rashi Phalalu Today: మేషం నుంచి మీనం వరకు.. మే 14, శనివారం నాడు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఇవాళ్టి దిన ఫలాల్లో తెలుసుకుందాం.

Horoscope: మే 14 రాశిఫలాలు. జ్యోతిష్యం ప్రకారం వ్యక్తులకు ప్రతిరోజు ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయవచ్చు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా జ్యోతిష్య నిపుణులు భవిష్యత్తును అంచనా వేయగలరు. ఇలా మేషం నుంచి మీనం వరకు.. మే 14, శనివారం నాడు ఎవరెవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

* మేషం (Aries):
ఎక్కువ పని, ముందస్తు కమిట్‌మెంట్స్ వల్ల మీకు ఈరోజు కొంచెం అలసటగా అనిపించవచ్చు. క్యాలిక్యులేటెడ్ అప్రోచ్, కొంత సహాయం వంటివి ఈ సమస్యను పరిష్కరించవచ్చు. త్వరలో జరిగే వేడుక కోసం సిద్ధంగా ఉండండి.

లక్కీ సైన్- బ్లాక్ టూర్మాలిన్

* వృషభం (Taurus):
మీరు ఏదైనా చేయాలనుకుంటే, దాని పరిస్థితిని ముందే ఊహించవద్దు. మల్టీ టాస్కింగ్ కారణంగా మీ మనసు అస్తవ్యస్తంగా అనిపించవచ్చు. మీ ఆరోగ్యం, దినచర్యను జాగ్రత్తగా చూసుకోవడం మంచిది.

లక్కీ సైన్- ఇటుక గోడ

ఉదయం 4 నుంచి 6 మధ్యలో నిద్ర ఎందుకు లేవాలి? ఆ సమయంలోనే పెళ్లిళ్లు ఎందుకు ఎక్కువ చేస్తారు?

* మిథునం (Gemini):
మీ కోసం కొత్త నిబద్ధతను ఏర్పరచుకోండి. గడువులను సెట్ చేయండి. శక్తులు అన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. విదేశాల నుంచి పాజిటివ్ న్యూస్ లేదా కన్వర్జేషన్ మీ మానసిక స్థితిని సరిగ్గా సెట్ చేయవచ్చు.

లక్కీ సైన్- జనపనార సంచి

* కర్కాటకం (Cancer):
మధ్యాహ్నానికి ఒక వాదన మీకు అంతరాయాన్ని సృష్టించవచ్చు. మీ రిలేషన్‌షిప్ క్రమంగా బలపడుతుంది. ఇరుక్కుపోయినట్లు కనిపించే విషయాలలో ప్రొఫెషనల్‌ని సంప్రదించే అవకాశం ఉంది.

లక్కీ సైన్ - ఒక గిఫ్ట్

* సింహం (Leo):
కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలు గడుపుతారు. కొంత సమయం వరకు మీ పని పూర్తి కాకుండా, వెనుకబడి పోవచ్చు. పెండింగ్‌లో ఉన్న కొన్ని చట్టపరమైన విషయాలు ఇప్పుడు ఊపందుకోనున్నాయి.

లక్కీ సైన్ - అలంకరించిన దుకాణం

ఈ ఏడు గుర్రాల బొమ్మ ఉన్న ఇల్లు పేదరికంలో కూరుకుపోతుంది.. ప్రతి పైసాకు ఇబ్బంది తప్పదట...

* కన్య (Virgo):
పనిలో ఆకస్మిక అభివృద్ధి మీ రోజును ఆహ్లాదకరంగా చేస్తుంది. మీ జీర్ణక్రియను జాగ్రత్తగా చూసుకోండి. మీ వేగాన్ని నెమ్మదించడం వల్ల ప్రయోజనం తర్వాత చేకూరుతుంది. ఏదైనా ప్లాన్‌ను ప్రారంభించవచ్చు.

లక్కీ సైన్- ఒక దీపం

* తుల (Libra):
మీరు కుటుంబం, స్నేహితుల వద్ద ఇమేజ్ బూస్ట్ పొందే అవకాశం ఉంది. ఏదైనా కన్వర్జేషన్‌ను వాయిదా వేస్తుంటే.. ఇప్పుడు దాని విషయంలో ముందుకు వెళ్లవచ్చు. రోజు ముగిసే సమయానికి మీరు మరింత రిలాక్స్‌గా ఉంటారు.

లక్కీ సైన్- స్పష్టమైన ఆకాశం

* వృశ్చికం (Scorpio):
కొంతమంది తెలిసిన వ్యక్తులు మీ గురించి గాసిప్ చేయవచ్చు. మీరు ఈరోజు స్వయం సమృద్ధిగా ఉంటారు. వర్క్‌లో కొత్త రోల్ కోసం మిమ్మల్ని తీసుకునే అంశంపై చర్చించవచ్చు. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా హెల్ప్‌ఫుల్‌గా మారవచ్చు.

లక్కీ సైన్ - గొడుగు

Astrology | Shani Graha 2022: శని గమనంలో మార్పు.. జాగ్రత్తగా ఉండాల్సిన రాశుల వారు వీరే..

* ధనుస్సు (Sagittarius):
గతంలో మరచిపోయిన జ్ఞాపకాన్ని పాత ఫోటోలు గుర్తు చేస్తాయి. కొన్ని ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండవచ్చు. పెండింగ్‌లో ఉన్న విషయాలను పరిష్కరించడానికి స్పష్టమైన మానసిక స్థితి సహాయపడుతుంది. సంబంధిత మెసేజ్‌ను మీరు అందుకోవచ్చు.

లక్కీ సైన్- పావురం ఈక

* మకరం (Capricorn):
క్లిష్టమైన విషయాలపై మీ ఆలోచనా విధానాన్ని సులభతరంగా మార్చుకోండి. పరిష్కారం లభించని వాటి గురించి మళ్లీ ఆలోచన చేయకండి. ఈ రోజు మీకు శక్తివంతమైన ఆలోచనా విధానం మేలు చేస్తుంది. ధ్యానం చేయడం మంచిది.

లక్కీ సైన్- కాఫీ మగ్

* కుంభం (Aquarius):
స్నేహితుడి నుంచి అందే సంజ్ఞలు మీ రోజును మార్చగలవు. ఈరోజు షాపింగ్ చేసే అవకాశం ఉంది. మీరు ఆనందించే ఆహ్లాదకరమైన రోజు ఇది. బయట తినడం తగ్గించండి. మరింత ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండేందుకు ప్రయత్నించండి.

లక్కీ సైన్- సిరామిక్ గిన్నె

* మీనం (Pisces):
కొత్త రిలేషన్‌షిప్‌కు అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఓపికగా ఉండాలి. కొత్తగా కమ్యూనికేషన్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు. మీరు చేయలేని పనులకు అతిగా కట్టుబడి ఉండకండి. మీ దూకుడును అదుపులో ఉంచుకోండి.

లక్కీ సైన్- పురాతన గడియారం
Published by:Shiva Kumar Addula
First published:

Tags: Astrology, Horoscope, Rashifal, Zodiac signs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు