Horoscope Today: మే 6 రాశి ఫలాలు. ఓ రాశివారికి లభించే చిన్న అవకాశం ద్వారానే పెద్ద మేలు జరుగుతుంది. కొందరు ప్రణాళిక బద్ధంగా చేసే పనులు లక్ష్యం వైపు తీసుకెళ్తాయి. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 6వ తేదీ శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
* మేషం (Aries):
ఒక చిన్న అసైన్‌మెంట్ ఇప్పుడు మీకు క్లుప్తంగా రావచ్చు కానీ పెద్ద అవకాశాలను కల్పించే అవకాశం ఉంది. మంచి పనితీరు కనబరచాలనే ఒత్తిడి మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురి చేస్తుంది. వారం చివరిలో చేతికందే నగదుతో కొంత ఉపశమనం పొందవచ్చు.
లక్కీ సైన్- కానోపి
* వృషభం (Taurus):
మీరు ప్రధానంగా దేనితోనైనా ఏకీభవించనట్లయితే, దానిని ప్రయత్నించవద్దు. ప్రణాళికాబద్ధంగా అమలు చేసే అసైన్‌మెంట్ మిమ్మల్ని మీ మిషన్‌కి దగ్గరగా తీసుకువెళుతుంది. పనికి సంబంధించి ఓ చిన్న పర్యటన చేపట్టే అవకాశం ఉంది.
లక్కీ సైన్- జేడ్ ప్లాంట్
Astrology| Godess Lakshmi: మే నెలలో ఈ 5 రాశులపై లక్ష్మీ దేవి అనుగ్రహం.. మీరున్నారో చూడండి
* మిథునం (Gemini):
మీకు మంచి అభిప్రాయం కలిగించే ఆసక్తికరమైన వ్యక్తిని కలిసే అవకాశం ఉంది. ఎప్పుడూ లేనంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీరు విలువైన వస్తువును కోల్పోవచ్చు.
లక్కీ సైన్- ఐరన్ టవర్
* కర్కాటకం (Cancer):
అంతర్జాతీయ అవకాశం లేదా క్లయింట్ నుంచి శుభవార్త అందే అవకాశం ఉంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న అసైన్‌మెంట్‌కు ఆమోదం లభించవచ్చు. ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
లక్కీ సైన్- కుషన్
* సింహం (Leo):
మీరు వాయిదా వేస్తున్న దానిని ఆపేయండి. ముందుగానే చేయడానికి ప్రయత్నించండి. కుటుంబానికి సంబంధించిన వ్యవహారాల్లో మీ శ్రద్ధ అవసరం. మీరు సన్నిహితుల నుండి సానుకూల వార్తలను అందుకోవచ్చు.
లక్కీ సైన్- స్ట్రైప్స్
Shani Dev : శనిదేవుణ్ని ఇలా పిలవకూడదట.. అలా స్మరిస్తేనే మీకు లక్ష్మీ కటాక్షం..
* కన్య (Virgo):
చాలా అడ్డంకులు మీ పని వేగానికి ఆటంకం కలిగించి ఉండవచ్చు. మీరు సాధారణం కంటే కొంచెం ఎక్కువగా విషయాలపై దృష్టి పెట్టాలి. ఈ రోజు నిలిచిపోయిన చెల్లింపు వచ్చే అవకాశం ఉంది.
లక్కీ సైన్- కాఫీ ఔటింగ్
* తుల (Libra):
కొత్త పరిచయస్తులు మీ దృష్టిని మరల్చే అవకాశం ఉంది. అయినప్పటికీ ఇది తాత్కాలికమే అని గుర్తించాలి. ఆన్‌లైన్ కోర్సు లేదా ట్యుటోరియల్ ప్రయత్నించడం మీకు ఆసక్తికరంగా అనిపించవచ్చు. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ప్రేరేపించే అవకాశం ఉంది.
లక్కీ సైన్- కుందేలు
* వృశ్ఛికం (Scorpio):
పెట్టుబడి ఆందోళన కలిగిస్తుంది. పనిలో ఉన్న మీ బృందం మీ అంచనాలకు మించి పని చేసే అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా సలహా కోసం మీ వద్దకు వస్తే, మీరు దానిని సీరియన్‌గా తీసుకోవాలి. సాయం చేసేందుకు ప్రయత్నించాలి.
లక్కీ సైన్- ఫుట్‌బాల్ మ్యాచ్
* ధనస్సు (Sagittarius):
పని అవకాశం కారణంగా మీరు ప్రయాణించాల్సి వస్తుంది. ఈరోజు ఇంట్లో మీరు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. రొటీన్ నుంచి ఎంతో అవసరమైన విశ్రాంతిని విహారయాత్ర తీసుకురావచ్చు.
లక్కీ సైన్- సోలార్ ప్యానల్
* మకరం (Capricorn):
మీ సన్నాహాలు సరిపోకపోవచ్చు. ఈ విషయం మిమ్మల్ని కొద్దిగా చికాకు పెట్టవచ్చు. మీరు మీ స్తోమతకు మించి ఏదైనా లక్ష్యంగా పెట్టుకొనే అవకాశం ఉంది. మీ పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ మీకు గుర్తుంచుకోవాల్సిన సలహా ఇవ్వవచ్చు.
లక్కీ సైన్- పూల కూజా
* కుంభం (Aquarius):
చికాకు కలిగించే కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండటమే మీ లక్ష్యం అయితే, మీరు దానిని పాటిస్తున్నారని నిర్ధారించుకోండి. మిమ్మల్ని డిస్టర్బ్ చేసేలా కొందరు వెనక నుంచి మాట్లాడవచ్చు. మీ మనసు చెప్పే సూచనలను పాటించడం మేలు.
లక్కీ సైన్- తేనెటీగ
* మీనం (Pisces):
ఎవరైనా మిమ్మల్ని దూరం నుండి రొమాంటిక్ కోణంలో ఇష్టపడుతూ ఉండవచ్చు. కొత్త దృక్పథం, దారి మీ పనిని విస్తరించడంలో మీకు సహాయపడవచ్చు. మీకు త్వరలో సహకారం లభించే అవకాశం ఉంది.
లక్కీ సైన్- టర్‌క్వాయిస్ పాటరీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rashifal, Zodiac signs