Horoscope Today: ఏప్రిల్ 22 రాశిఫలాలు. ఇవాళ ఓ రాశివారు ఎమోషనల్‌గా కంట్రోల్ చేసుకోవడానికి పాతస్నేహితులతో మాట్లాడుతారు. మరికొందరు సక్రమంగా ఎదుటివారికి విషయాలను చెప్పలేకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. నక్షత్రాల గమనం ఆధారంగా వీటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. ఏప్రిల్ 22 శుక్రవారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి.
* మేషం (Aries):
ఈ రోజు మీకున్న భయాలను ఎదుర్కోవాలి. ముఖ్యంగా పబ్లిక్ స్పీకింగ్, లార్జ్ ఆడియన్స్ ముందు మాట్లాడటంలో భయాలు ఉంటే ఎదుర్కొంటే మేలు. మీ మనసు చేసే సూచనలు నమ్మాలి. మీలోని ప్రతిభను భయటపెట్టాలి.
లక్కీ సైన్- మ్యాగ్నెట్
* వృషభం(Taurus):
మీరు ఎమోషనల్ కాకుండా కంట్రోల్ చేసుకోవడానికి పాత స్నేహితులతో మాట్లాడతారు. పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకొంటూ బయటపడాలని చూస్తారు. కెరీర్‌లో ముందుకెళ్లే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- టర్టుల్
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ ఎప్పుడు? ఈ రోజు ప్రాముఖ్యత ఏంటో మీకు తెలుసా?
* మిథునం (Gemini):
ఈ రోజు నిజాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎలాంటి వాస్తవాలను దాచకూడదు. ఈ పని చేయకూడదని గతంలో మీపై ఒత్తిడి ఉండి ఉండచ్చు. ఇంకా కొనసాగించకూడదు. ఏదైనా లావాదేవీకి సంబంధించిన వ్యవహారంలో మీ అనుమతి ఆలస్యం కావచ్చు.
లక్కీ సైన్- ఫెంగ్‌షూయి క్యామెల్
* కర్కాటకం (Cancer):
కొత్తదాన్ని ఏదైనా ప్రదర్శించే ముందు ప్రాక్టీస్ చేయడం మేలు. అలా చేయకపోతే త్వరలోనే రియాలిటీని తెలుసుకొంటారు. మీ ప్రోగ్రెసివ్ యాట్టిట్యూడ్‌ను అందరూ ఇష్టపడకపోవచ్చు.
లక్కీ సైన్- డైమండ్
* సింహం (Leo):
ఉన్నత చదువులు చదవాలని అనుకొంటున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. మీకు గతంలో తెలియని అవకాశాలు కూడా ఇప్పుడు ఎదురవుతాయి. ఇప్పటి నుంచి ఇతరులపై ఆధారపడటం తగ్గించాలి. మీ అంతట మీరే వాస్తవాలను తెలుసుకోవాలి.
లక్కీ సైన్- పెయింటెడ్ గ్లాస్
* కన్య (Virgo):
హఠాత్తుగా ఓ అవకాశం లభిస్తుంది. ఎక్కువ ఆదాయం కూడా అందుతుంది. ఆ అవకాశాన్ని అంగీకరించే ముందు ఎక్కువగా ఆలోచించకపోవడం మేలు. మీ క్లోజ్‌ఫ్రెండ్ అసూయ చెందే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- రివర్‌సైడ్ పెబుల్స్
Astrology| Budh: రాశి మారనున్న బుధుడు.. ఈ 3 రాశుల వారికి అన్నీ శుభాలే.. ఆ రోజు నుంచే..
* తుల(Libra):
ఈ రోజు మీ సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. సరైన కారణాలతో గుర్తింపు తెచ్చుకోవాలి. ఎవరి అనుమతి కోసమైనా ఎదురుచూస్తుంటే ఇప్పుడు లభిస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలు అందుకొంటారు.
లక్కీ సైన్- క్రాస్‌వర్డ్
* వృశ్ఛికం (Scorpio):
గతానికి సంబంధించిన ఓ విషయం పరిష్కారమవుతుంది. మీకు నచ్చిన రెండు అంశాల్లో ఒకదానికి ఎంచుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆరోగ్యానికి సంబంధించి అప్రమత్తంగా ఉండటం అవసరం.
లక్కీ సైన్- ఆక్వేరియం
* ధనస్సు (Sagittarius):
ఇప్పటి వరకు సమస్యలను మీరు సక్రమంగా ఎదుర్కొన్నారు. ఇతరులు మీలోని ఆ ప్రతిభను తేలికగా భావిస్తారు. రెండు అడుగులు వెనక్కి వెళ్లి పరిస్థితులను గమనించాలి. మీకు అవసరమైన సహాయం సమయానికి దొరకదు.
లక్కీ సైన్- రూబీ
* మకరం(Capricorn):
ఈ రోజు క్లోజ్ ఫ్రెండ్స్ లేదా సోదరి, సోదరులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో నిమగ్నమవుతారు. వృత్తిపరంగా అడ్డంకులు ఎదురవుతాయి. వారం చివరికి డబ్బు రాక పెరిగే సూచనలు ఉన్నాయి.
లక్కీ సైన్- రౌండ్ టేబుల్
* కుంభం (Aquarius):
ఇటీవల మీరు చేసిన పని ఎటువంటి ఫలితాలను ఇవ్వదు.. అయితే త్వరలోనే దాని ప్రయోజనాలను అందుకొంటారు. ఓ కొత్త ఆలోచనతో మీరున్న పరిస్థితి మెరుగవుతుంది. మీ భావాలను స్పష్టం తెలియజేయండి, ఎక్కువగా పరిశీలించండి.
లక్కీ సైన్- గిటార్
Rare Occurrence: ఆకాశంలో అద్భుతం.. ఒకే సరళరేఖపై కనిపించనున్న నాలుగు గ్రహాలు.. ఎలా చూడాలంటే..
* మీనం (Pisces):
కొందరు విద్యావేత్తలకు అనుకోకుండా సమస్యలు ఎదురవుతాయి. ఏదైనా కొత్త అభిప్రాయాన్ని వెల్లడించే సమయంలో రీసెర్చ్ చేయడం మేలు. మీరు వదిలేసిన అంశంలో తల్లిదండ్రుల మళ్లీ కనెక్ట్ అవుతారు.
లక్కీ సైన్- రోస్ గోల్డ్ వాచ్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Horoscope Today, Rasi phalalu, Zodiac signs