Home /News /astrology /

RARE OCCURRENCE AWESOME IN THE SKY FOUR PLANETS THAT APPEAR ON THE SAME STRAIGHT LINE HOW TO SEE KNOW DETAILS HERE GH VB

Rare Occurrence: ఆకాశంలో అద్భుతం.. ఒకే సరళరేఖపై కనిపించనున్న నాలుగు గ్రహాలు.. ఎలా చూడాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ నెలలో సౌర వ్యవస్థ (Solar System)లో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఇది స్కైవాచర్లందరికీ ఒక అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నెలలో సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు (Four Planets) ఒకే లైన్‌లో రానున్నాయి.

ఏప్రిల్ నెలలో సౌర వ్యవస్థ (Solar System)లో ఒక అద్భుతం ఆవిష్కృతమవుతోంది. ఇది స్కైవాచర్లందరికీ ఒక అదిరిపోయే న్యూస్ అని చెప్పవచ్చు. ఈ నెలలో సౌర వ్యవస్థలోని నాలుగు గ్రహాలు (Four Planets) ఒకే లైన్‌లో రానున్నాయి. ఇలా ఆకాశంలో నాలుగు గ్రహాలు ఒకే అలైన్‌మెంట్‌లో కనిపించడం చాలా అరుదు. ఈ అపురూపమైన దృశ్యం ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆదివారం ఉదయం నుంచి సూర్యోదయానికి ముందు ఆగ్నేయ ఆకాశం (Southeastern Sky)లో అంగారక గ్రహం (Mars), శుక్రుడు (Venus), బృహస్పతి (Jupiter), శని (Saturn) గ్రహాలను వరుసగా చూసి ఎంజాయ్ చేయవచ్చు. అంతేకాదు, ఆకాశంలోని ఈ 4 గ్రహాలను నేరుగా కంటి (Naked Eye)తో చూసి అద్భుతమైన అనుభూతిని పొందవచ్చు.

"ఈ నెల ద్వితీయార్థం నాటికి, బృహస్పతి మార్నింగ్ అవర్ లో రైజ్ కావడం స్టార్ట్ చేస్తుంది. ఇది గ్రహాల చతుష్టయాన్ని లేదా నాలుగు గ్రహాల వరుసను సృష్టిస్తుంది. దీంతో గ్రహాలు ఉదయాన్నే ఆకాశంలో ఒక వరుసలో క్యూ కట్టినట్టుగా కనిపిస్తాయి." అని నాసా ఒక ప్రకటనలో తెలిపింది. ఈ దృశ్యాన్ని వీక్షించేందుకు ఉత్తరార్ధగోళం (Northern Hemisphere)లోని ప్రజలు సూర్యోదయ దిశలో సూర్యుడు ఉదయించడానికి దాదాపు ఒక గంట (Pre-Dawn Hour) ముందు బయటకు వెళ్లాలని నాసా సూచించింది. “ఏప్రిల్ నెల ప్రారంభంలో మార్స్, వీనస్, శని గ్రహాలు తెల్లవారుజామున ఒకే లైన్‌లో కనిపించాయి. ఇప్పుడు, ఈ మూడు గ్రహాలు బృహస్పతితో కలిసాయి. ఏప్రిల్‌లో మిగిలిన రోజుల్లో వరుసగా నాలుగు గ్రహాలను కంటితో చూడవచ్చు." అని ఒక నివేదికలో నాసా వెల్లడించింది.



ఈ అసాధారణ దృశ్యం ఏర్పడడానికి సూర్యుని చుట్టూ అన్ని గ్రహాల కక్ష్యలు వరుసలో ఉండటమేనని నాసా వెల్లడించింది. "ఆకాశంలో ఉన్న రెండు ప్రకాశవంతమైన గ్రహాలైన వీనస్, బృహస్పతి ఏప్రిల్ 30న వాటి ఓన్ అల్ట్రా-క్లోజ్ కంజంక్షన్ వైపు వెళ్తాయి. ఈ నెల ప్రారంభంలో అంగారక గ్రహం, శని గ్రహాల కలయిక వలె ఈ కంజంక్షన్ ఉంటుంది. నిజానికి ఆ రెండు గ్రహాలు దాదాపు అదే దూరానికి చేరుకుంటాయి. ఈ గ్రహాలు అంతరిక్షంలో చాలా దూరంగా ఉంటాయి కానీ సౌర వ్యవస్థ అంతటా వాటిపై భూమి నుంచి మన దృష్టి నెల నెలా మారుతుంది. అందుకే ఆకాశంలో దగ్గరగా లేదా దూరంగా కదులుతున్నట్లు ఇవి కనిపిస్తాయి" అని నాసా వివరించింది. ఏప్రిల్ 30న ఆకాశంలో దాదాపు పక్కపక్కనే కనిపించే వరకు వీనస్, బృహస్పతి ఒకదానికొకటి చేరుకోవడం కొనసాగుతుందని నాసా బృందం తెలిపింది.

నాసా ఆకాశంలోని విశేషాలు అన్నిటినీ జల్లెడ పడుతూ వాటి గురించి అందరికీ తెలియజేస్తుంది. కొద్ది రోజుల క్రితం నాసా హబుల్ టెలిస్కోప్ సాధారణ కామెట్ కంటే 50 రెట్లు పెద్ద న్యూక్లియస్‌తో కూడిన ఓ కామెట్ భూమి వైపు ఎగురుతున్నట్లు కనుగొన్నట్లు నాసా తెలిపింది. ఇది గంటకు 22,000 మైళ్లు లేదా దాదాపు 35,404 కి.మీ వేగంతో భూమి వైపు వస్తుందని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్ (UCLA)లో ప్లానెటరీ సైన్స్ అండ్ ఖగోళ శాస్త్ర ప్రొఫెసర్ డేవిడ్ జ్యూవిట్ అంచనా వేశారు.
Published by:Veera Babu
First published:

Tags: Astrology, NASA, Planets, Trending

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు