జ్యోతిష్య శాస్త్రంలో రాహు-కేతువుల (Rahu-Ketu Effect)కు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రెండింటినీ ఛాయా గ్రహాలుగా పరిగణిస్తారు. ఐతే ఎవరి జాతకంలో రాహువు, కేతువు దోషం ఉంటుందో.. వారికి అష్టకష్టాలు వస్తాయట. జీవితం నరకంలా మారుతుందని నమ్ముతారు. రాహు-కేతువుల నీడ ఉంటే... ఆ వ్యక్తి ఏ పని చేసినా... అందులో విజయం సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయట. రాహు-కేతువులు కూడా కొన్నిసార్లు శుభప్రదంగా ఉన్నప్పటికీ... ఎక్కువగా మాత్రం రాహు-కేతు దశ కష్టాలు తెస్తుందని విశ్వసిస్తారు. అందుకే రాహు-కేతువుల అశుభ ప్రభావమంటే చాలా మంది భయపడిపోతుంటారు. తమ జాతకంలో రాహు, కేతు దోషముందని తెలియగానే.. వాటి పరిహారం కోసం పూజలు చేస్తుంటారు. శ్రీకాళహస్తి వంటి ఆలయాలకు వెళ్తుంటారు. రాహు కేతువుల దోషాల నుంచి బయటపడేందుకు కొన్ని పరిహారాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Vastu Tips: మీ పేదరికానికి ఈ మొక్కలు కారణం కావచ్చు.. ఇంట్లో ఉంటే వెంటనే తీసేయండి
రాహు-కేతు పరిహారాలు:
జ్యోతిశాస్త్రం, మత విశ్వాసాల ప్రకారం.. దుర్గామాతను పూజించడం వల్ల రాహు-కేతువుల దోషాలు తొలగిపోతాయి. దుర్గా సప్తశతిలో దర్గామాతను నీడ అస్తిత్వంగా పరిగణిస్తారు. రాహు-కేతువులు కూడా ఛాయా గ్రహాలు. అందువల్ల దుర్గను పూజించడం ద్వారా రాహు-కేతువుల అశుభ ప్రభావాలు తొలగిపోతాయట.
శేషనాగుపై శ్రీ కృష్ణుడు నృత్యం చేస్తున్న చిత్రాన్ని ఇంట్లో ఉంచి.. నిత్యం పూజించాలి. పూజా సమయంలో 'ఓం నమో భగవతే వాసుదేవాయ నమః' అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
రాహు-కేతుకి సంబంధించిన బీజ మంత్రాలను కూడా పఠించడం వల్ల దోషాలు తొలగిపోతాయి. అందువల్ల ఎవరి జాతకంలో అయితే రాహు-కేతువుల దోషాలు ఉంటాయో.. వారు తప్పనిసరిగా బీజ మంత్రాలను జపించాలి. ఇలా చేస్తే దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.
ఈ రాశుల వారు చిరంజీవులు.. అనారోగ్యం వీరి దరి చేరదు.. మీరున్నారో లేదో చూసుకున్నారా?
పేద అమ్మాయికి పెళ్లి చేయడం లేదా పెళ్లికి సహాయం చేయడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఇలా చేయడం వల్ల రాహు-కేతువుల అశుభాలు క్రమంగా తగ్గుముఖం పడతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఆదివారం రోజు ఆడపిల్లలకు పెరుగు, పాయసం తినిపిస్తే కేతువు దోషాలు తొలగిపోతాయట. దానివల్ల జీవితంలో సమస్యలన్నీ వెళ్లిపోయి.. మంచి రోజులు వస్తాయని విశ్వసిస్తారు.
ఒక వ్యక్తి జాతకంలో కేతువు దోషపూరితంగా ఉంటే.. ఆ వ్యక్తి తన వద్ద ఎప్పుడూ ఆకుపచ్చ రుమాలు ఉంచకోవాలి. గ్రీన్ కలర్ కర్చీఫ్ని వాడడం వల్ల కేతువుల దోషం తొలగిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.
రత్న శాస్త్రం ప్రకారం.. రాహు దోషం నివారణకు గోమేధిక రాయిని ధరించడం మంచిది. జ్యోతిష్యులు కూడా ఇది సరైనదిగా భావిస్తారు. రాహువును శాంతింపజేసేందుకు గోమేథిక రత్నాన్ని శనివారం నాడు ధరించాలి. మీకు మీరుగా కాకుండా.. జ్యోతిష్యుల సూచనల ప్రకారం ధరిస్తే.. మంచి జరుగుతుందట. ఇలా చేయడం వల్ల రాహుదోషం తొలగిపోతుందట.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Horoscope, Rahu-Ketu Effect, Zodiac signs