2023 కొత్త సంవత్సరంలో ప్రమోషన్లు:
ఉద్యోగం రావడం ఒక ఎత్తయితే, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం, అధికార యోగం పట్టడం, కనీస౦ టీమ్ లీడర్ కావడం మరో ఎత్తు. చాలా కాలం క్రితమే ఉద్యోగంలో చేరి ప్రమోషన్ల కోసం, ఆఫీసర్ పదవి కోసం ఎదురు చూస్తున్నవారికి కొత్త సంవత్సరం ఏ విధంగా మంచి సంవత్సరంగా ఉంటుందో గమనించాల్సి ఉంది. వృత్తి ఉద్యోగాల విషయంలో పైపైకి ఎదగడానికి సంబంధించి ఇప్పటికే కలలు
కంటున్నవారుంటారు. కొత్త సంవత్సరం మీద ఈ విషయంలో ఎన్నో అశలు పెట్టుకుని ఉంటారు. ఇ౦దుకు సంబంధించిన కీలక గ్రహాలైన శని, గురువు, రాహువు, కేతువులు ఈ ఏడాది రాశులు మారుతున్నందువల్ల, కొన్ని రాశుల వారు తప్పకుండా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉంది. ఇందులో ఫస్ట్ లిస్ట్ వరుసలో ఉన్న రాశులు మేష, మిథున, తుల, ధనుస్సు రాశులు. మిగిలినవారు ప్రమోషన్దు అందుకోవడం
జరుగుతుంది. అందులో అధికార యోగం ఉంటే ఉండవచ్చు.
మేష, మిథున, తుల, ధనుస్సు:
ఉద్యోగ, జీవన కారకుడైన శని ఈ ఏడాది మేష రాశివారికి లాభ స్థానమైన కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్న౦దువల్ల, గురువు మేష రాశిలోకి ప్రవేశిస్తున్నందువల్ల, వీరికి ఈ ఏడాది ఖాయంగా అధికార యోగం పడుతుంది. ఈ రాశివారికి ఈ నెల 18 తర్వాత తప్పకుండా అధికారం చేతికి అందే అవకాశం ఉంది. ఒక విదేశీ లేదా లేదా ప్రతిష్టాత్మక కంపెనీ నుంచి వీరికి ఆఫర్ అందే అవకాశం ఉంది. మిథున రాశివారు ఏ పని చేసినా శ్రద్ధగా, ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. కష్టపడడానికి వెనుకాడరు. కష్టానికి తగిన ప్ర
తిఫలం అన్నట్టుగా ఈ రాశివారికి ఈ ఏడాది డబుల్ ప్రమోషన్ వచ్చినా ఆశ్చర్యపోనక్కరలేదు. తుల రాశి వారు ఉద్యోగంలో బరువు బాధ్యతలకు భయపడరు. ఎంత కవ్టాన్నయినా భరించి, లక్ష్యాలను పూర్తి చేస్తుంటారు. గత కొద్ది కాలంగా వీరు నిర్లక్ష్యానికి గురవుతూ వస్తున్నారు. ఈ ఏడాది మాత్రం వీరు ఈ ఏడాది తప్పనిసరిగా అధికార యోగం చేపట్టబోతున్నారు. వీరికి గురు, శనులు వీలైనంతగా తోడ్పడతారు. సాధారణంగా ధనూ రాశివారికి యాంబిషన్ ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వీరి దృష్టంతా అధికారం మీదే ఉంటుంది. ఈ ఏడాది వీరికి ఏలిన్నాటి శని తొలగిపోవడం, వీరి రాశి నాథుడు పంచమ స్థానంలోకి మారడం వంటి శుభ పరిణామాల వల్ల వీరి మనసులోని ధీర్ఘ కాలిక కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది. వీరికి జనవరి 18 తర్వాత అధికార యోగం పట్టడం, భారీ జీతభత్యాలు అందుకోవడం ఖాయమని చెప్పవచ్చు.
జాబ్ చేసే ప్లేస్ మారినా ప్రమోషన్ వచ్చే ఛాన్స్:
పూర్తిగా కాకపోయినా కొంత వరకైనా అధికార యోగం పట్టబోతున్నవారిలో మకర రాశివారు కూడా ఉన్నారు. ప్రస్తుతం తాము ఉద్యోగం చేస్తున్న కంపెనీలో అయినా లేక కొత్త కంపెనీలో అయినా వీరికి మంచి ప్రమోషన్, భారీగా జీతభత్యాలు దక్కే అవకాశం ఉంది. ఈ రాశివారు మరిన్ని బాధ్యతలను నిర్వహించడానికి వీలైన కంపెనీకి మారే అవకాశం ఉంది. లేదా ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీలోనే ఉన్నత స్థాయికి వెళ్లడం జరుగుతుంది. ఫిబ్రవరి, మే నెలల మధ్య ఈ రాశివారు అధికారం చేపట్టే సూచనలున్నాయి. గహ గతులను బట్టి చూస్తే వృత్తి, ఉద్యోగాల పరంగా వృషభం, కర్కాటకం, సింహం, కన్య, వృశ్చికం, కుంభం, మీన రాశుల వారికి కూడా ఇది అనుకూల సమయమే కానీ, ఈ ఏడాది ఈ రాశుల వారి దృష్టంతా వృత్తి ఉద్యోగాల మీద కాకుండా కుటుంబ వ్యవహారాల మీద, గృహ, వాహన
యోగాల మీదా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.