• HOME
  • »
  • NEWS
  • »
  • ASTROLOGY
  • »
  • PEOPLE WITH THESE ZODIAC SIGNS PREFER ONLY ARRANGED MARRIAGES BA GH

ప్రేమ దోమ కుదరదు.. ఈ రాశుల వారికి పెద్దలు కుదిర్చిన పెళ్లంటేనే ఇష్టమట..

ప్రేమ దోమ కుదరదు.. ఈ రాశుల వారికి పెద్దలు కుదిర్చిన పెళ్లంటేనే ఇష్టమట..

ప్రతీకాత్మక చిత్రం

భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే, భాగస్వామి ఎంపికలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. పెళ్లి విషయంలో అనేక కట్టుబాట్లు, ఆచార వ్యవహాలను పాటిస్తారు.

  • Share this:
భారతీయ సాంప్రదాయంలో వివాహ బంధానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే, భాగస్వామి ఎంపికలో అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలని పెద్దలు చెబుతుంటారు. పెళ్లి విషయంలో అనేక కట్టుబాట్లు, ఆచార వ్యవహాలను పాటిస్తారు. అయితే, మారుతున్న కాలంతో పాటు యువత ఆలోచనల్లో కూడా మార్పులు వస్తున్నాయి. అందుకే, ప్రేమ వివాహాలు చేసుకునే భారతీయుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఏదేమైనా, ఇప్పటికీ మన దేశంలో ఎక్కువ మంది పెద్దలు కుదిర్చిన వివాహాలనే చేసుకుంటున్నారు. దీనికి అనేక కారణాలున్నప్పటికీ, వారి రాశులు కూడా దీనికి దోహదం చేస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పెద్దలు కుదిర్చిన వివాహానికే ఓటేసే రాశుల వారు ఎవరంటే..

వృషభ రాశి
వృషభ రాశి వారు మృదువైన, ఆచరణాత్మక స్వభావం గలవారు. వీరు ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన వివాహమా అనే విషయాలను పెద్దగా పట్టించుకోరు. ఏ వివాహమైనప్పటికీ తమ భాగస్వామితో త్వరగా కలిపోతారు. వివాహం తర్వాత భాగస్వామిని ఎంతో ప్రేమగా చూసుకుంటారు. తద్వారా, ఎటువంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా తమ బంధాన్ని పటిష్టం చేసుకుంటారు.

కర్కాటక రాశి
అన్ని రాశుల్లో కల్లా ఈ రాశికి చెందిన వారు చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. వీరు ప్రేమకు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. అయితే, ఆ ప్రేమ అనేది జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా పుట్టవచ్చని నమ్ముతారు. అందువల్లే, పెద్దలు కుదిర్చిన వివాహానికి వీరు ప్రాధాన్యతనిస్తారు. పెళ్లి తర్వాత తమ భాగస్వామిని ప్రేమించేందుకు వీరు ఆసక్తి చూపిస్తారు.

సింహ రాశి
ఈ రాశి వారు ఎవరితోనైనా ఇట్టే కలిసిపోగలరు. ప్రత్యేకంగా, ఒకరి ద్వారానే ప్రేమ పొందగలం అని వీరు నమ్మరు. అందుకే, ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. వీటి ద్వారానే నిజమైన ప్రేమ పొందగలమని విశ్వసిస్తారు.

కన్యా రాశి
ఈ రాశి వారు కొంత వారికి నచ్చిన విధంగా జీవించాలనుకుంటారు. తమ ప్రియమైన వారు కూడా తమలాగే ఉండాలనుకుంటారు. తద్వారా, వీరి జీవితంలో ప్రేమకు చోటు చాలా తక్కువ. అందుకే, ప్రేమ వివాహాలకు వీరు సరిపడరు.

తుల రాశి
వీరు ప్రతి విషయంలో సమతుల్యతను కోరుకుంటారు. ప్రేమకు, కుటుంబానికి మధ్య తేడాపై వీరు స్పష్టమైన అవగాహనతో ఉంటారు. ఒకవేళ, ప్రేమ, కుటుంబం రెండిట్లో ఏది ముఖ్యమో తేల్చుకునే సందిగ్థంలో ఉంటే, కుటుంబం వైపే మొగ్గుచూపుతారు. అందుకే, పెద్దలు కుదిర్చిన వివాహానికే ప్రాధాన్యతనిస్తారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు బయటికి ప్రమాదకమైన, భయానక వ్యక్తులుగా కనిపిస్తారు. కానీ, వీరు మృదు స్వభావాన్ని కలిగి ఉంటారు. వారు తమ భాగస్వామి, కుటుంబం అందరితో కలిసి ఉండాలని కోరుకుంటారు. అందువల్ల, సహజంగానే పెద్దలు కుదిర్చిన వివాహానికే మొగ్గుచూపుతారు.

కుంభ రాశి
ఈ రాశి వారు అత్యంత సృజనాత్మక కలిగిన, తెలివైన వారు. తమ భాగస్వామిని ఎలా సంతోష పెట్టాలో వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా వీరు సులభంగా ఎదుర్కోగలరు. వీరి ప్రేమ ఆప్యాయతతో భాగస్వామిని సులభంగా ఆకట్టుకుంటారు. అందుకే వీరికి ప్రేమ వివాహాల కంటే పెద్దలు కుదిర్చిన వివాహాలే సరిపడతాయి.

మీన రాశి
వీరు మృదువైన స్వభావం, ఆధ్యాత్మిక ఆలోచనలు గలవారు. ఇతరులపై ప్రేమ చూపించడంలో నైపుణ్యం గలవారు. అందుకే వారికి ప్రేమ వివాహం అయినా, పెద్దలు కుదిర్చిన వివాహం అయినా ఒక్కటే. ఏదైనా వీరికి సౌకర్యవంతంగా ఉంటుంది.
First published:

అగ్ర కథనాలు