Head bath: స్త్రీలు మంగళవారం తలస్నానం అందుకే చేయకూడదట!

అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తలస్నానం ఆచరించాలి అంటారు. అలా పాటించి ఇంటికి ఏ కొరత లేకుండా భగవంతుడి కృప ఎల్లవేళలా ఉంటుందని అంటారు.

అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తలస్నానం ఆచరించాలి అంటారు. అలా పాటించి ఇంటికి ఏ కొరత లేకుండా భగవంతుడి కృప ఎల్లవేళలా ఉంటుందని అంటారు.

  • Share this:
ఆడవాళ్లకు తలస్నానం Head bath చేయడాన్ని ప్రత్యేకంగా నిర్ధారించారు. స్త్రీల వెంట్రుకలు పొడవుగా ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి తలస్నానం చేస్తే సరిపోతుందని అంటారు. అయితే, వారి ఆరోగ్య Health  పరిస్థితిని అనుసరించి హెడ్‌ బాత్‌ చేసుకోవచ్చు. మన పెద్దలు కూడా స్త్రీలు ప్రతిరోజు తలస్నానం చేయాల్సిన అవసరం లేదని అంటారు. ఎందుకంటే స్త్రీలు పాపిట తిలకాన్ని ధరిస్తారు కాబట్టి వారు తలస్నానం నియమాలు రోజూ పాటించనవసరం లేదని చెప్పారు.

ప్రతి స్త్రీ పాపిట గంగాదేవి నెలవై ఉంటుంది. పాపిట తిలకం Kumkum పెట్టడం వల్ల ఏ దోషాలు ఉండవని అంటారు. అయితే, వారానికి ఒకసారి తలస్నానానికి కేటాయించాలి. ఏరోజు అయితే మంచిదో అనే సందేహం ఉండవచ్చు. ఈ తలస్నానం ఇంటిదైవం పై కూడా ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఇంటి దైవం శివుడు అయితే, సోమవారం తలస్నానం చేసుకుని పూజ చేసుకోవచ్చు. మరికొంత మందికి అమ్మవార్లు ఇంటి దైవంగా ఉంటారు. వారు శుక్రవారం తలస్నానం చేసుకోవచ్చు. అలాగే వేంకటేశ్వర స్వామి ఇంటి దైవం అయితే, శనివారం హెడ్‌బాత్‌ చేస్తే సరిపోతుంది. అయితే వారంలో ఏదో ఒక రోజు మాత్రమే తలస్నానం చేస్తే.. ఆరోగ్యం సంపూర్ణంగా బాగుంటుంది.

ఇంట్లో టీవీ ఇటువైపు పెట్టుకుంటే.. భార్యాభర్తల బంధం అన్యోన్యంగా ఉండదట!


పురుషుడు మాత్రం ప్రతిరోజు తలస్నానం చేయాలి. ఎందుకంటే అందరి ఇళ్లలో మొదట చేసే పూజ Pooja  పురుషుడే చేయాలి కాబట్టి ప్రతిరోజూ హెడ్‌ బాత్‌ చేసి పూజ చేయాలి. వారి కేశాలు కూడా పెద్దగా ఉండవు.. త్వరగా ఆరిపోతాయి. ఇక ఆడవారు నెలసరి సమయంలో Menstrual తప్పకుండా తలస్నానం ఆచరించాలి అంటారు. ఆ టైంలో వారి శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. ఆ వేడిని తగ్గించడానికి హెడ్‌బాత్‌ చేయాల్సి ఉంటుంది.

ఇక పండుగ సమయాల్లో తప్పకుండా తలస్నానం చేయాలి.  ఎందుకంటే నైవేధ్యం తయారు చేసి భగవంతుడికి పెడతాం కాబట్టి ఇంటిని, శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కొంతమంది సమయం కాని సమయంలో తలస్నానం చేస్తారు. ఆ ఇంటిలో దరిద్ర దేవత తిష్ట వేస్తుంది అంటారు. ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం సాయం సంధ్యవేళ స్త్రీ తలస్నానం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుంది.కాబట్టి సాయం కాలం తలస్నానం చేయడం నిషిద్ధం. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఉదయమే స్నానమ చరించాలి.
Published by:Renuka Godugu
First published: