హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Kartika poornima 2021: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? పూజా విధానం!

Kartika poornima 2021: కార్తీక పౌర్ణమి ఎప్పుడు? పూజా విధానం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Kartika poornima 2021: కార్తీక పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదిలో స్నానమాచరించి ఉపవాస వ్రతం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుడిని నెయ్యిదీపంతో పూజించాలి.

కార్తీక పౌర్ణమి 2021.. (kartika poornima 2021) పురాణాల ప్రకారం ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైంది. కార్తీక పౌర్ణమి రోజు దేవతలను ప్రసన్నం చేసుకునే రోజు. అందుకే ఈ రోజున ప్రజలు పవిత్ర గంగానదిలో (ganga)  స్నానం చేసి దానధర్మాలు, దక్షిణలు చేయడం ద్వారా పుణ్యం పొందుతారు. భక్తులు కార్తీక స్నానం ఆచరించడం ద్వారా అపార అదృష్టం పొందుతారు.

హిందూ గ్రంథాల్లో కార్తీక పౌర్ణమికు (kartika poornima 2021)  చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పౌర్ణమిని త్రిపురి పూర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజు శంకరుడు త్రిపురాసురుడిని సంహరించాడని నమ్ముతారు. అప్పటి నుంచి శంకరుడిని త్రిపురారి అని పిలుస్తారు. ఈసారి కార్తీక పౌర్ణమి పండుగ నవంబర్‌ 19 (శుక్రవారం) రానుంది. నిజానికి కార్తీక మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పూర్ణిమ పండుగ ఐదురోజులు జరుగుతుంది. ఏకదశి రోజున ప్రారంభమై పౌర్ణమి రోజున ముగుస్తుంది.

ఇది కూడా చదవండి:  ధన్‌తేరాస్‌ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!


కార్తీక పౌర్ణమి సమయం..

పూర్ణిమ తేదీ– నవంబర్‌ 18 (గురువారం) రాత్రి 11.55 నుంచి 19 శుక్రవారం మధ్యాహ్నం 02.25 కు తిథి ముగుస్తుంది.

కార్తీక పౌర్ణమి ఒక మతపరమైన వేడుకలను నిర్వహించడానికి అత్యంత పవిత్రమైన రోజులో ఒకటిగా పరిగణిస్తారు. పండుగలు ఈ రోజుతో ముగుస్తాయి. ఈ రోజున నిర్వహించే పవిత్రమైన వేడుకలు ఇంట్లో సంతోషాన్ని కలిగిస్తాయని నమ్ముతారు. ఈ రోజు నెయ్యి దానం చేయడం వల్ల సంపద పెరుగుతుందని గ్రహ యోగ బాధలు తొలగిపోతాయని నమ్మకం. కార్తీక పౌర్ణమి వ్రతం ఆచరించే వారికి పరమశివుని అనుగ్రహం లభిస్తుంది.

పూజా విధానం..

కార్తీక పూర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. వీలైతే పవిత్ర నదిలో స్నానమాచరించి ఉపవాస వ్రతం చేయాలి. ఆ తర్వాత లక్ష్మీనారాయణుడిని నెయ్యిదీపంతో పూజించాలి. ఈ రోజు సత్యనారాయణ వ్రతం చెప్పించుకోవడం వల్ల శ్రీమహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. ఈరోజు విష్ణువుకు పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఈరోజు లక్ష్మీనారాయణుని హారతి చేసి, తులసీ మాత దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. కార్తీక పూర్ణిమ రోజు ఇంట్లో కూడా దీపం వెలిగించాలి. వీలైతే ఈరోజు పేదలకు దానం చేయాలి. ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టాలి.

ఇది కూడా చదవండి: ధన్‌తేరాస్‌ గురించి మీకు తెలియని కథ!


కార్తీక పౌర్ణమి రోజు తులసీ మాత భూమిపైకి వచ్చిందని నమ్ముతారు. అందుకే ఈరోజు విష్ణుమూర్తిని తులసిని సమర్పించడం వల్ల మిగతా రోజుల కంటే ఎక్కువ పుణ్యం లభిస్తుంది. కార్తీక పూర్ణిమ రోజు ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణం కట్టుకోవాలి. ఈ రోజు శివుడికి గంగాజలం, తేనె, పచ్చిపాలను సమర్పించి ప్రసన్నం చేసుకోవాలి.

First published:

ఉత్తమ కథలు