దీపావళి (diwali) లక్ష్మిదేవి (laxmi devi)పుట్టినరోజుగా భావిస్తారు. ఆమెకు పూజలు చేస్తారు. దీపావళిని వరుసగా 5 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ పండుగ కోసం కొన్ని రోజుల ముందే సన్నాహలు చేసుకుంటారు. దీపావళి రోజు మా లక్ష్మీ (laxmi devi) ఇంట్లోకి వస్తుందని నమ్ముతారు. దీంతో ప్రజలు చాలా రోజులుగా ఇంటిని శుభ్రం చేసే పనిలో నిమగ్నమవుతారు. ఇది మాత్రమే కాదు. దీపావళికి సంబంధించి పురాణాల ప్రకారం కొన్ని నమ్మకాలు ప్రబలంగా ఉన్నాయి.
అంగరంగ వైభవంగా నిర్వహించుకునే దీపావళి (diwali) ముఖ్యమైన పండుగల్లో ఒకటి. సాధారణంగా కొన్ని పండుగలను వివిధ ప్రాంతాలను బట్టి, వివిధ పేర్లతో నిర్వహించుకుంటారు. కానీ, దీపావళి పండుగను ఒక్క పేరుతో మాత్రమే జరుపుకుంటారు.
ఇది కూడా చదవండి: దీపావళి పొరపాటున ఈ పక్షిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
ప్రతి సంవత్సరం కార్తీమాసంలో వచ్చే అమావాస్యరోజు దీపావళిని నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది నవంబర్ 4 గురువారం దీపావళి జరుపుకోనున్నారు.
నవంబర్ 4న చతుర్ధశి ఉదయం 4.24 గంటలకు ప్రారంభమవుతుంది. తరువాత అమావాస్య ప్రారంభమవుతుంది. అమావాస్య నవంబర్ 5న ఉదయం 3.51 గంటల వరకు ఉంటుంది. నరకాసురుడి వధకు గుర్తుగా ఈ దీపావళిని నరకాసుర చతుర్ధశి అంటారు.
అంటే అమావాస్యకు ముందు వచ్చే తిథి చతుర్ధశి. ఈ కారణంగా ఉత్తర భారతదేశంలో చతుర్ధశి తిథి రోజున దీపావళి నిర్వహించుకుంటారు. తమిళనాడుతో సహా దక్షిణ భారతదేశంలో దీపావళి 4న జరుపుకుంటారు. ఇది చతుర్ధశి తథి, అమావాస్య రోజుతో సమానంగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: నాగదోషాలను తొలగించి 10 ప్రఖ్యాత నాగదేవాలయాలు!
ఇతర ఉపవాస రోజుల మాదిరిగా దీపావళి (diwali) ఉపవాసం నుంచి శ్రీకృష్ణుడిని స్మరించుకోవడానికి, మహాలక్ష్మి, కుబేరులను పూజించడానికి మంచి సమయం. అంతేకాదు దీపావళి రోజున ఇంటిని శుభ్రం చేయకుండా ఉండటం శుభప్రదం. మొదటి రోజు ఇంటిని శుభ్రం చేసి సిద్ధంగా ఉండాలి.
దీపావళి రోజు పటాకులు పేల్చి, స్వీట్లను తినడం ఎంతో ముఖ్యం. ఉదయాన్నే లేచి గంగా స్నానం లేదా నూనె పెట్టుకుని స్నానం చేయాలి. దీనికి శుభ సమయం తెల్లవారుజాము 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య నూనె స్నానం చేయాలి.
అదేవిధంగా దీపావళి పండుగ సందర్భంగా పేదలు, నిరుపేదలకు అన్నదానం లేదా మిఠాయిలు దానం చేస్తే మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని చెబుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Diwali 2021, Lakshmi