హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri 2022: నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

Navaratri 2022: నవరాత్రి.. మొదటిరోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం పూజావిధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri puja: నవరాత్రులు (Navaratri)  దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత (Durga maata) పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.

నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ప్రతి సంవత్సరం దసరా దసరా వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం.

ఇది కూడా చదవండి: నవరాత్రి పండుగకు ముందు ఈ 5 వస్తువులను ఇంటి నుండి తీసివేయండి, లేదంటే...

అమ్మవారిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని రోజుకు ఒక అవతారం పూజించి, అమ్మకు ఇష్టమైన నైవేద్యాన్ని అందించి నచ్చిన రంగు వస్త్రాలతో అలంకరించి దేవి కృపకు పాత్రులవుదాం.

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే  బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఒకటి. అమ్మవారిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఇక శ్రీ దేవి శరన్నవరాత్రులు అంటే ఇంకా ప్రత్యేకంగా నిలుస్తాయి..

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో ఈ ఒక్క వస్తువును ఇంటికి తెచ్చుకుంటే.. ధనానికి లోటు ఉండదట!

26వ తేదీ సోమవారం.. అమ్మవారి ఉత్సవాల్లో ఇదే తొలి రోజు.. ఈ రోజున బెజవాడ కనకదుర్గ అమ్మవారు.. శ్రీ స్వర్ణకవచలాంకృత దుర్గాదేవి (Durga devi) గా భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ రోజు అమ్మను ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించుకోవాలి. ఎందుకంటే ఎరుపు ఉత్తేజానికి సంకేతం అంటారు. అలాగే నైవేధ్యం కట్టు పొంగలి, చలిమిడి , వడపప్పు , పాయసం పెట్టాలి.

ఎందుకంటే ఈ పదార్థంలోని మిరియాలు భూత, ప్రేత పిశాచాలను తరమడానికి నైవేద్యంగా పెడతారని పండితులు చెప్పే మాట. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు