హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri puja: నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం, పూజావిధానం..

Navaratri puja: నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం, పూజావిధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.నవరాత్రులు (Navaratri) దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత (Durga maata) పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.

నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ఇది కూడా చదవండి: ఈ 5 రాశుల వారు చాలా రొమాంటిక్‌.. వీళ్లను చూడగానే ప్రేమ కలుగుతుందట!

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.

ఇది కూడా చదవండి: బతుకమ్మ 5వ రోజు ప్రత్యేకమైందని తెలుసా?

4వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ చవితి..

29వ తేదీ.. నాలుగో రోజు.. అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. ఈ దేవికి

గంధపు రంగు లేదా పసుపు రంగు వస్త్రంతో అలంకరిస్తారు. ఎందుకంటే ఈ రంగు ఇచ్చే గుణానికి సంకేతం. కాబట్టి ఆ తల్లి అనుగ్రహంతోనే సమస్త జీవులకు ఆహారం చేకూరుతుంది. ఆ తల్లి అన్ని జీవరాసులకు ఆహారాన్ని ఇస్తుంది. అల్లం గారెలు, దద్దోజనం క్షీరాన్నం నైవేద్యంగా పెట్టాలి. అమ్మను శాంతపరచడానికి గారెలను పెట్టాలన్నది భక్తుల నమ్మకం. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

Tags: Dussehra, Dussehra 2022

ఉత్తమ కథలు