హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Navaratri puja: నవరాత్రి 5వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం..పూజావిధానం..

Navaratri puja: నవరాత్రి 5వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం..పూజావిధానం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Vizianagaram

Navaratri puja: నవరాత్రులు దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు.నవరాత్రులు (Navaratri) దుర్గామాత 9 అవతారాలను పూజిస్తాం. 2022 సోమవారం 26 నుంచి నవరాత్రులు మొదలుకానున్నాయి. తొమ్మిది రోజులపాటు జరిగే నవరాత్రి పండుగలో భక్తులు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలు చేస్తారు. అందుకే 9 రోజులపాటు ఉపవాసం కూడా ఉంటారు. నవరాత్రుల్లో దుర్గామాత (Durga maata) పెద్ద విగ్రహాలను మండపాల్లో ప్రతిష్ఠిస్తారు.

అమ్మను అలంకరించే విధానం..

ముందు కింద ఏదైన గుడ్డ పరచి పీటను ఏర్పాటు చేసుకుని దాని ఒక కంచెం పెట్టి అందులో ఒక కలశం పెట్టుకోవాలి. ఈ చెంబులో కొంచెం నీరు, పసుపు,కుంకుమ, అక్షితలు, పూలు వేసుకోవాలి. దాని మీద కొబ్బరికాయ పెట్టుకుని.. బ్లౌజ్‌ ముక్కతో చీర మాదిరి కట్టించాలి. అమ్మవారికి పూర్తి అలంకరణ చేయాలి.

ఇది కూడా చదవండి: నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారి అలంకరణ, నైవేధ్యం, పూజావిధానం..

ఇక అమ్మవారి అలంకరణ విషయానికి వస్తే బెజవాడలో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనక దుర్గా దేవి సన్నిధిలో ఈ నవరాత్రులలో అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారు. ఏ రంగు అమ్మవారిక ఇష్టం.. ఎలాంటి నైవేజ్యం పెట్టాలి.. వాటి ఫలితాలు ఏంటి..? దాన్ని అనుసరించి తెలుసుకుందాం.నవరాత్రి పూజను చేసుకుంటే ఎన్నో సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో అద్భుతమైన మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని మార్గాల్లో అమ్మ రక్షణ ఉంటూ.. శత్రు పీడ నుంచి రక్షణ కల్పిస్తుంది. అందుకే నవరాత్రి పూజ చేసుకోవాలి అంటారు.

ఇది కూడా చదవండి:  ఆరవరోజు అలిగిన బతుకమ్మ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

5వ రోజు.. ఆశ్వీయుజ శుద్ధ పంచమి..

30వ తేదీ ఐదో రోజు.. అమ్మవారికి అంత్యంత ప్రీతకరమైన రోజుల్లో ఒకటి.. పంచమి రోజున కనక దుర్గ తల్లి.. లలితా సుందరీ దేవిగా అలంకరిస్తారు. ఈరోజు అమ్మవారికి కుంకమ, ఎరుపు రంగు వస్త్రంతో అలంకరించాలి. దద్ధోజనం కేసరిబాత్‌ నైవేద్యంగా పెట్టాలి. ఎందుకంటే సకల కార్యసిద్ధికి ఈ నైవేద్యాన్ని పెట్టాలని పండితులు చెబుతారు.(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. )

Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు