Dhanteras 2021: ధంతేరాస్‌.. ఈ టైంలో షాపింగ్‌ చేస్తే.. 3 రెట్ల ప్రయోజనం!

ప్రతీకాత్మక చిత్రం

Dhanteras 2021: ఈ రోజున ప్రజలు బంగారం, వెండి, పాత్రలు, వివిధ ఆభరణాలు మొదలైన వాటిని శుభ సమయంలో కొనుగోలు చేస్తారు.

  • Share this:
సంవత్సరం ధంతేరస్ నవంబర్ 2, మంగళవారం (Dhanteras, 2 Nov, Tuesday) వస్తుంది. దీపావళి (Diwali 2021) ధంతేరస్ పండుగ నుండే ప్రారంభమవుతుంది. ఈ రోజున ధన్వంతరి ఆరాధన (Dhanvantri Puja 2021) ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉందని చెబుతారు.

ధంతేరాస్‌ (Dhanteras) రోజున బంగారం, వెండి లేదా మట్టి దీపాలు మార్కెట్ను నుంచి ఇంటికి తీసుకు రావడం శుభప్రదంగా భావిస్తారు. మీరు ఈ రోజు వెండి లక్ష్మి-గణేష్ నాణేలను కూడా కొనుగోలు చేయవచ్చు.ఈసారి పండుగ మంగళవారం అంటే నవంబర్‌ 2న జరుపుకోనున్నారు. జోతిషుల ప్రకారం బంగారం, వెండి కొనడం వల్ల ప్రయోజనాలు పొందడానికి ఈ ఏడాది ధంతేరాస్‌ రోజు రెండు శుభ యోగాలు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: ‘స్క్విడ్‌ గేమ్‌’లోని ఈ కాస్ట్యూమ్స్‌ కోసం తెగ వెతుకుతున్నారట!

ధంతేరాస్‌ రోజు చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. ఈ యోగ సమయంలో షాపింగ్‌ చే స్తే.. మీ అదృష్టం పెరుగుతుంది. మంగళవారం, ద్వాదాశి తిథి యాదృశ్చికంగా శుభ యోగం జరగనుంది. అయితే, ద్వాదశి తిథి నవంబర్‌ 1న ప్రారంభమై నవంబర్‌ 2వ తేదీ ఉదయం 11.30 గంటల వరకు ఉంటుంది. కాబట్టి నవంబర్‌ 2వ తేదీ మంగళవారం సూర్యోదయం నుంచి ఉదయం 11 గంటల వరకు త్రిపుష్కర యోగం లభిస్తుంది.

ఈ యోగ సమయంలో బంగారం, వెండి, మట్టి దీపాలు కొనుగోలు చేయడం చాలా పవిత్రమైందిగా పరిగణిస్తారు. జోతిఫుల ప్రకారం ఈ శుభ సమయంలో కొనుగోలు చేయడం వల్ల 3 రెట్ల ప్రయోజనాలు కలుగుతాయి. ఉదాహరణకు ఈ త్రిపుష్కర యోగ సమయంలో ఇల్లు, వాహనం లేదా నగలు కొనుగోలు చేస్తే.. భవిష్యత్తులో అది మూడు రెట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు.

ఇది కూడా చదవండి:  రోహిత్‌ శర్మ వైఫ్‌ అంత చదువుకుందా?

అమృత యోగం ప్రయోజనాలు..
జోతిషుల అభిప్రాయం ప్రకారం ధంతేరాస్‌ మరో శుభకరమైన రోజు అమృత యోగం. మార్కెట్‌ నుంచి కొత్త వస్తువులు కొనడానికి ఇది అమృత సమయంగా పరిగణిస్తారు. ధంతేరాస్‌ రోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అమృత గ డియలు. మనం త్రిపుష్కర యోగా, ప్రయోజనాన్ని అమృత యోగ సమయాన్ని కలిపితే ధంతేరాస్‌ రోజు మధ్యాహ్నం 1.30 వరకు ఏవైనా వస్తువులు కొనుగోల్లు చేయడానికి శ్రేయస్కరం
Published by:Renuka Godugu
First published: