హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Dhanteras 2021: ధన్‌తేరాస్‌ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!

Dhanteras 2021: ధన్‌తేరాస్‌ రోజు ఈ వస్తువులను దానం చేస్తే.. లక్ష్మీకటాక్షం!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dhanteras 2021: ధన్‌తేరాస్‌ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి (laxmi devi)వారిని కరుణిస్తుందని నమ్మకం.

దీపావళికి రెండు రోజులు ముందుగా వచ్చేది ధన్‌తేరాస్‌ (Dhanteras 2021)  . ఈరోజు బంగారం, వెండితోపాటు మరికొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటారు. దీంతో అశేష ధనలాభం వస్తుందని నమ్మకం. అదేవిధంగా ఈరోజు కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం అశుభంగా పరిగణిస్తారు కూడా. అయితే, ధన్‌తేరాస్‌ రోజు కొన్ని వస్తువులు దానం చేయడం వల్ల లక్ష్మీదేవి (laxmi devi)వారిని కరుణిస్తుందని నమ్మకం.

దీపావళి ధన్‌తేరాస్‌ (Dhanteras 2021)  ఐదు రోజుల పండుగ. ఈరోజున ఆయుర్వేద పితామహుడిగా పరిగణించబడే ధన్వంతరి, సంపదల దేవుడు కుబేరుడిని పూజిస్తారు. ఈరోజు కొంతమంది వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ధన్‌తేరాస్‌ రోజున షాపింగ్‌ చేయడం ముఖ్యంగా భావిస్తారు. అయితే, ఈరోజు దానం చేయడం కూడా అంతే ముఖ్యమని మీకు తెలుసా? ధన్‌తేరాస్‌ రోజు దానం చేస్తే.. మా లక్ష్మి సంతోషిస్తుంది. వారికి ఆనందం, శ్రేయస్సు ఆశీర్వాదాలు ఇస్తుందని నమ్ముతారు.

ఇది కూడా చదవండి: ఈ సీజన్‌లో ఇమ్యూనిటీని సత్వరమే పెంచే సూపర్‌ సూప్‌!

ధన్‌తేరాస్‌ (Dhanteras 2021)కు దానం ఇచ్చే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అదేంటో తెలుసుకుందాం. మొదట తెల్లని వస్తువులు దానం చేయకూడదు. రెండోది సూర్యాస్తమయానికి ముందు మీరు అన్ని వస్తువులను దానం చేయడం శుభం.

ధాన్యం..

ధన్‌తేరాస్‌ రోజున ధాన్యాన్ని దానం చేయడం వల్ల పవిత్రమైందిగా భావిస్తారు. మీరు ధాన్యం దానం చేయలేకపోతే, ఈ రోజు పేదవారికి ఒక్కరికైనా ఆహారం ఇవ్వచ్చు. భోజనంలో తీపి, దక్షిణ ఉండేలా చూసుకోవాలి. భోజనం చేయలేకపోతే, పేదవాడికి మిఠాయిలు, దక్షిణ కూడా ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల ఇంటికి సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.

ఇది కూడా చదవండి:  జాగ్రత్త! డెంగీదోమ ఈ టైంలోనే ఎక్కువగా తిరుగుతుందట..

దుస్తులు..

ధన్‌తేరాస్‌కు వస్త్రదానం చేయడం కూడా ప్రత్యేక గౌరవం. ఈ రోజు పేదవారికి బట్టలు దానం చేస్తే, అది ఇంట్లో ఆనందం, సంపదను కలిగిస్తుంది. బట్టలు దానం చేసేటప్పుడు, తెల్లని వస్త్రాలు దానం చేయకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే.. అశుభం. ఈరోజు పసుపు వస్త్రాలను దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు.

ఇనుము..

ధన్‌తేరాస్‌ రోజు ఇనుము దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇనుమును దానం చేయడం వల్ల అరిష్టం.. అదృష్టంగా మారుతుందని అంటారు. ఆ సమయంలో మీరు ఏ చిక్కుల్లో ఉన్నా.. ఇక అది పూర్తయినట్లు లెక్క. విధి తలుపులు కూడా తెరుచుకుంటాయి అంటారు.

చీపురు..

ఈ విధంగా ధన్‌తేరాస్, దీపావళి రోజు కొత్త చీపురు కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. అయితే, ధన్‌తేరాస్‌ రోజు చీపురు దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణిస్తారు. అంటే, చీపురును శుభ్రం చేసే కార్మికులకు లేదా ఆలయానికి దానంగా ఇవ్వచ్చు. ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం శుభప్రదంగా ఉంటుంది.

First published:

Tags: Dhanteras 2021, Diwali 2021

ఉత్తమ కథలు