Home /News /astrology /

Friday: శుక్రవారం సాయంత్రం మగవారు ఈ ఒక్క వస్తువు భార్యకు ఇస్తే.. ఎంతో కలిసి వస్తుంది

Friday: శుక్రవారం సాయంత్రం మగవారు ఈ ఒక్క వస్తువు భార్యకు ఇస్తే.. ఎంతో కలిసి వస్తుంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోజు ఆవును పూజించడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంటికి వచ్చిన ఆవును పూజించడం వల్ల లక్ష్మీదేవి కృప వారిపై ప్రత్యేకంగా ఉంటుందని నమ్మకం.

మనందరికి తెలిసిన విషయం.. శుక్రవారం (Friday) లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. అంతేకాదు ఈ రోజు శుక్రుడికి కూడా ఇష్టమైన రోజు. ఈ రోజు కొన్ని నియమాలను ఆచరించడం వల్ల మీకు ధన సంపదతోపాటు.. ఇంట్లో వారి మధ్య ప్రేమ అప్యాయతలు పెరుగుతాయి. అవేంటో తెలుసుకుందాం. ముఖ్యంగా శుక్రవారం సాయంత్రం పెళ్లైన మహిళలు లక్ష్మీదేవికి ఇష్టమైన విధివిధానాలను తప్పకుండా ఆచరించడం వల్ల మీ వైవాహిక జీవితం కూడా ఆనందంగా సాగుతుంది.

  • ఈరోజు లక్ష్మీ పూజ (Lakshmi pooja) తోపాటు మరికొన్ని నియమాలను పాటించడం వల్ల మీ సంపద పెరుగుతుందని మన పురాణాలు చెబుతున్నాయి.

  • మనలో చాలా మంది రాత్రి లైట్లను ఆర్పివేసి పడుకుంటారు. కానీ, శుక్రవారం ఒక్కరోజైనా ఈశాన్య (noth-east )దిశలో ఉండే లైట్లను వెలిగించి ఉంచాలి. లేదా ఈ దిశలో కనీసం ఒక దీపాన్ని అయినా వెలిగించాలి.


ఇది కూడా చదవండి: వీట్ గ్రాస్ జ్యూస్ ఎవరు తాగకూడదు తెలుసా?

  • ఫలితంగా లక్ష్మీదేవికి ఆ ఇంటికి రావడానికి మార్గం సుగమం అవుతుందని అంటారు. ఆమె ఇంటికి సంపదను తీసుకువస్తుందని నమ్మకం.

  • ఈ శుక్రవారం ఆవుకు పచ్చిగడ్డిని తినిపిస్తే వారికి తప్పకుండా మంచి కలుగుతుందని అంటారు. కనీసం, మీరు తినే ముందు నెయ్యి బెల్లం కలిపిన ఆహారాన్ని ఆవుకు తినిపించడం వల్ల డబ్బు విషయంలో ఎలాంటి సమస్యలు ఉండవని పండితులు చెబుతున్నారు. అంతేకాదు వారికి ఎల్లవేళలా లక్ష్మీదేవి వెన్నంట ఉంటుందని అంటారు.

  • లక్ష్మీదేవిని సంతృప్తి పరచడానికి శుక్రవారం సాయంత్రం అమ్మ చిత్రపటానికి లేదా విగ్రహనికి మల్లెపూల మాలను సమర్పించాలి. ఫలితంగా మీ ఇంటికి డబ్బు కొరత ఉండదు.

  • మీ వైవాహిక జీవితం బాగుండాలి అంటే.. అమ్మవారికి గులాబీ మాల లేదా పూలను సమర్పించాలి. మీ దాంపత్య జీవితం సుఖంగా ఉంటుంది.


ఇది కూడా చదవండి: మైగ్రేన్ సమస్య ఉంటే.. ఈ ఫుడ్ అస్సలు తినకూడదు..

  • ఇంకా మీ జీవితంలో ఒడిదుడుకుల నుంచి బయటపడాలి అంటే శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి ఐదు దీపాలు వెలిగించాలి. దీన్నే పంచముఖి దీపం అంటారు. దీంతో ఇంట్లో ప్రతికూలత negativity దూరమై సానుకూల శక్తి పెరుగుతుంది.

  • అంతేకాదు జీవితంలో సంపదతోపాటు డబ్బు కూడా పెరుగుతుంది. అలాగే చాలామంది ఎంత డబ్బును సంపాదించినా.. ఆర్థిక కొరత ఏర్పడుతుంది. అటువంటివారు శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చిన తర్వాత ఆ బూడిదను మీ పర్సులో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది.

  • దీంతోపాటు ఒక రాగి నాణం, ఒక లవంగాన్ని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి మీ కోరిక కోరుకున్న తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోవచ్చు. అలాగే, శుక్రవారం భార్యకు బహుమతి ఇస్తే.. మరీ మంచిది. అందుకే ఈరోజు మీ భార్యకు ఇష్టమైన ఏదైనా వస్తువును తీసుకువస్తే మంచి జరగుతుంది. ఆ ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు.

Published by:Renuka Godugu
First published:

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు