Dhanteras 2021: దీపావళి దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాల్లో కూడా వేడుకలు జరుపుకుంటారు. ఈ వెలుగుల దీపావళి (diwali 2021) హిందు మతంతో ప్రత్యేకంగా ముడిపడి ఉంటుంది.అందుకే ఈ పండుగను ప్రత్యేకంగా నిర్వహించుకుంటారు. దీపావళి ముఖ్యంగా 5 రోజుల పండుగ. ఇది ధన్ త్రయోదశి లేదా ధన్‌తేరాస్ (Dhanteras) తో ప్రారంభమవుతుంది. అందుకే ఈ పండుగకు ధన్‌తేరాస్ ముఖ్యమైంది.
Diwali 2021: దీపావళి రోజు పటాకులు పేల్చి, స్వీట్లను తినడం ఎంతో ముఖ్యం. ఉదయాన్నే లేచి గంగా స్నానం లేదా నూనె పెట్టుకుని స్నానం చేయాలి. దీనికి శుభ సమయం తెల్లవారుజాము 3 గంటల నుంచి 5.30 గంటల మధ్య నూనె స్నానం చేయాలి.
ఈ ధన్‌తేరాస్ కార్తీక మాసం కృష్ణపక్షంలో 13వ రోజున వస్తుంది. ఎప్పటిలాగే ఈ ఏడాది నవంబర్ 2 మంగళవారం ధన్‌తేరాస్ జరుపుకోనున్నారు. ఇది సంపద,శ్రేయస్సు, గర్వానికి చిహ్నంగా పరిగణిస్తారు.
మతవిశ్వాసాల ప్రకారం ధన్వంతరి భగవాణుడు ధన్‌తేరాస్ రోజునే జన్మించాడు. అందువల్ల ఆభరణాలు, పాత్రలు, వాహనాలు మొదలైనవాటిని కొనడం వల్ల శుభప్రదంగా భావిస్తారు.
ఇది కూడా చదవండి: సాయిపల్లవి ఫిట్నెస్ సీక్రెట్.. జిమ్ మాత్రం కాదండోయ్!
ధన్‌తేరాస్ రోజు ఏదైనా దుకాణం నుంచి ధనియాలను రూ.5 పెట్టి కొనుగోలు చేసుకుని ఇంటికి తీసుకువచ్చి ధన్వంతరి, లక్ష్మి ముందు పెట్టాలి. ఆరాధ్య దైవాన్ని స్మరించుకున్న తర్వాత కొన్ని ధనియాలను ఎర్రటి గుడ్డలో చుట్టి భద్రంగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.
లక్ష్మిదేవికి స్వీట్స్ ఇష్టం. అందుకే అమ్మను ఆనందంగా ఉంచడానికి ఆరోజు కేవలం రూ.5తో భోగ్‌ను నైవేద్యంగా పెట్టి పూజ చేయవచ్చు. ఇలా చేస్తే.. లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది.
ఒక పెట్టెలో లేదా నిధిలో ఉడుత చిత్రాన్ని పెట్టుకోవడం వల్ల ప్రతికూల శక్తిని నాశనమవుతుంది. ముఖ్యంగా డబ్బు ఉన్న ప్రదేశంలో పెట్టుకోవాలి. ఇది సంపద ప్రవాహాన్ని పెంచుతుంది. ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదలను తెస్తుంది.
మీరు ఏవైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే, ధన్‌తేరాస్ రోజు 5 టాకా చక్రాలను కొనుగోలు చేసి ఇంటి వెలుపల కాల్చాలి. ఆ పని అన్ని ఆక్షాంక్షలు నేరవేరుతాయని మత విశ్వాసం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dhanteras 2021, Dhanteras gold, Diwali 2021