హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Dussehra 2021: దసరా ముహూర్తం.. ఈరోజు ఇది తప్పకుండా చేయండి!

Dussehra 2021: దసరా ముహూర్తం.. ఈరోజు ఇది తప్పకుండా చేయండి!

విజయ దశమి: రావణ దహనం

విజయ దశమి: రావణ దహనం

Dussehra 2021 muhurat: నవరాత్రి 2021 దసరా రోజున శ్రీ రాముడు, దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి, వినాయకుడితోపాటు హనుమంతుడిని పూజించాలి.

Dussehra హిందు క్యాలెండర్‌ ప్రకారం విజయదశమి 2021 పండుగ అక్టోబర్‌ 15న నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం ఆశ్వియుజ మాసం శుక్ల పక్షం పదో రోజున దసరా నిర్వహిస్తారు. అయితే, మన పురాణాల ప్రకారం ఈ రోజు శ్రీ రాముడు  sri ram రాక్షసుడైన రావణుడిని వధిస్తాడు. అదే రోజు మా దుర్గా మహిషాసుడిని అంతం చేయడం వల్ల చెడుపై మంచి విజయం సాధించింది. శ్రీ రాముడిని ఆరాధిస్తారు. ఈరోజు దుర్గామాతతోపాటు రాముడిని పూజించడం వల్ల జీవితంలో త్వరగా విజయం సాధిస్తారని నమ్ముతారు.  నవరాత్రుల్లో దుర్గామాత Durga mata ను వివిధ రూపాల్లో పూజిస్తారు. ఇదే దుర్గామాత పూజకు ఉత్తమ సమయమని భావిస్తారు. ఈ ఏడాది కూడా నవరాత్రులు సందడిగా చేసుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: దుర్గాష్టమి విశిష్టత.. కన్యాపూజ సమయం!


ముఖ్యంగా ఈరోజు రావణుడి Ravana దిష్టిబొమ్మను దహనం చేయడం ఒక నియమంగా పాటిస్తారు. భక్తుల జీవితంలో నుంచి కొన్ని లోపాలను తొలగించడానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా దసరాను వైభవంగా నిర్వహిస్తారు. హిందు క్యాలెండర్‌ ప్రకారం సరిగ్గా ఈరోజు నుంచి 20 రోజుల తర్వాత దీపావళి వస్తుంది. దసరాను ఏడాదిలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణిస్తారు. ఈరోజు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు.

dussehra దసరా ఈ నెల 15న శుక్రవారం వస్తోంది. మన పురాణాల ప్రకారం దసరా రోజు మహిషాసురుడిని మాత దుర్గా సంహరిస్తుంది. అందుకే దీన్ని విజయ దశమిగా జరుపుకుంటారు.

ఇది కూడా చదవండి: దుర్గామాత ఆయుధాలు ధరించడం వెనుక రహస్యం?

విజయ దశమి శుభ సమయం..

విజయ దశమి తేదీ –2021 అక్టోబర్‌ 15 (శుక్రవారం) దశమి రోజు ప్రారంభమవుతుంది. ఇది అక్టోబర్‌ 14 సాయంత్రం 06.52 నుంచి మొదలయి దశమి రోజు అంటే 15న సాయంత్రం 06.02 వరకు. శ్రావణ నక్షత్రం – అక్టోబర్‌ 14 ఉదయం 09.36 మొదలవుతుంది. ముగింపు సమయం అక్టోబర్‌ 15 ఉదయం 09.16 వరకు.

అక్టోబర్‌ 15న విజయ దశమి రోజు విజయ ముహూర్తం మధ్యాహ్నం 02.01 నుంచి 02.47 వరకు ఉంటుంది. ఈ ముహూర్తం మొత్తం వ్యవధి 46 నిమిషాలు. మ«ధ్యాహ్నం శుభ సమయం 1.15 నుంచి 3.33 వరకు.

దసరా రోజు ఆచరించాల్సినవి..

దసరా రోజు శ్రీరాముడు, దుర్గామాత, లక్ష్మీదేవి, సరస్వతి, వనాయయకుడు, హనుమంతుడిని పూజించాలి. అదేవిధంగా ఆ భగవంతుడి నుంచి ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటారు. సకల కోరికలు నేరవేర్చుకోవడానికి విజయ దశమి రోజు రామాయణం, శ్రీరామ రక్ష స్తోత్రం, సుందరకాండను పటించడం శ్రేయస్కరం.

Published by:Renuka Godugu
First published:

Tags: Durga Pooja, Dussehra 2021, Navaratri

ఉత్తమ కథలు