(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
Numerology Today: జూన్ 11 న్యూమరాలజీ. పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జూన్ 11వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం.
నంబర్ 1:
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 1 వస్తుంది. మీ పనితీరు ఈరోజు హీరోలా ఉంటుంది. పెట్టుబడులు, కొత్త ఆఫర్లు లేదా ప్రతిపాదనలు, ఒప్పందాలు, సలహాదారుల మార్గదర్శకత్వం, వ్యూహాలు రూపొందించడం, కొత్త సంబంధాలను ఏర్పరచుకోవడం లేదా ఇంటర్వ్యూకు సిద్ధపడడం వంటి అన్నింట్లో గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు అందుకునే ప్రశంసలు, డబ్బు సంపాదన ఇతరుల్లో అసూయ కలిగిస్తుంది. విజయం సాధించాలంటే ఆఫీసులో మీ సీనియర్లతో చేతులు కలపండి.
మాస్టర్ కలర్: సీ గ్రీన్
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్: 1
దానాలు: పసుపు పండ్లు దానం చేయాలి
నంబర్ 2:
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 2 ప్రభావం ఉంటుంది. ఈరోజు మీ రొమాంటిక్ ఫీలింగ్స్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. భాగస్వామితో షాపింగ్‌ను ఆస్వాదించడానికి ఇది ఒక అందమైన రోజు. కాంట్రాక్ట్ లేదా టెండర్లలోకి ప్రవేశించడానికి ఇది ఉత్తమమైన రోజు. ప్రియమైనవారితో భావోద్వేగ సమయాన్ని గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. మీ కలలు వాస్తవంగా మారడం అవాస్తవంగా అనిపిస్తోంది కాబట్టి ఓపిక పట్టండి. తెల్లని దుస్తులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది.
మాస్టర్ కలర్: వైట్, గ్రీన్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 2
దానాలు: యాచకులకు పాలు దానం చేయాలి
నంబర్ 3:
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 3 పని చేస్తుంది. లక్కీ బ్యాక్‌గ్రౌండ్‌లో బలంగా ప్లే చేస్తున్నందున మీ నెట్వర్క్ని విస్తరించడానికి ఈ రోజును ఉపయోగించండి. ఇది పరిసరాల నుంచి జ్ఞానాన్ని తీసుకోవడానికి ఒక రోజు. వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం. గత సంఘటనలను మరచిపోయి, రోజును ఉత్తమంగా మార్చుకోవడానికి మీ హృదయపూర్వకంగా మాట్లాడండి. మీ స్నేహితులను కలుసుకోవడానికి, ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు. మీరు డ్యాన్స్, వంట, డిజైనింగ్, యాక్టింగ్, టీచింగ్ లేదా ఆడిటింగ్‌లో ఉంటే ప్రతిభను ప్రదర్శించే సమయం.
మాస్టర్ కలర్: పీచ్, ఆక్వా
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్: 3, 9
దానాలు: ఆలయాలకు కుంకుమ దానం చేయాలి
శని దేవుడిని పూజిస్తున్నారా..? అయితే ఈ నియమాలు పాటించాల్సిందే.. లేదంటే నష్టం తప్పదు..
నంబర్ 4:
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్ 4 ప్రభావం ఉంటుంది. పాత సమస్యలను పరిష్కరించడానికి, వ్యక్తిగత జీవితంలో సందేహాలను నివృత్తి చేసుకునే రోజు. ఈ రోజు వ్యాపార ప్రణాళికల చర్యలతో నిండి ఉంటుంది. క్లయింట్ ప్రెజెంటేషన్లు ప్రశంసలు అందుకుంటాయి. ఎక్కువ సమయం మార్కెటింగ్, లాభాలను పొందడం, ఆస్తులను చూడటం, కొత్త లేదా పాత ఒప్పందాలను చేసుకోవడం, అగ్రిమెంట్లపై సంతకం చేయడంలో గడపాలి. ప్రయాణాలలో, యంత్రాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
మాస్టర్ కలర్: స్కై బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 9
దానాలు: పేదలకు పచ్చని ధాన్యాలు దానం చేయాలి
నంబర్ 5:
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్ 5 పని చేస్తుంది. మీ డబ్బు, శక్తిని అతిగా ఉపయోగించడం మానుకోండి. ఈరోజు మీ సహచరులు, పరిచయస్తులతో జాగ్రత్త వహించండి. స్టాక్ మార్కెట్ వ్యాపారాలు, బిడ్డింగ్, క్రీడలు, గ్లామర్, మీడియా, ప్రభుత్వ ఉద్యోగాల ప్రయత్నాలలో అదృష్టం కలిసి వస్తుంది. పెట్టుబడి అంతా రిస్క్ ఫ్రీ, కాబట్టి ముందుకు సాగండి. సీ గ్రీన్ దుస్తులు ధరిస్తే మంచిది.
మాస్టర్ కలర్: సీ గ్రీన్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్: 5
దానాలు: అనాథలకు పచ్చని పండ్లు దానం చేయాలి
నంబర్ 6:
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్ 6 ప్రభావం కనిపిస్తుంది. మీరు జీవితంలోని అన్ని వైపుల నుంచి సపోర్ట్ అందుకుంటారు. మీరు పిల్లలు, సహోద్యోగుల సపోర్ట్ ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. గ్లామర్, శిక్షణ, ఎగుమతి దిగుమతి, వస్త్రం, రియల్ ఎస్టేట్, లగ్జరీ వస్తువులకు సంబంధించిన వ్యాపారాలకు అనుకూల సమయం. వాహనాలు, ఇల్లు, యంత్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.
మాస్టర్ కలర్: ఆక్వా
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్: 6
దానాలు: పేదలు, ఆలయాలకు చక్కెర దానం చేయాలి
నంబర్ 7:
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్ ప్రభావం ఉంటుంది. పాత పరిచయాలను ఉపయోగించడానికి, ఒప్పందాలలో విజయం సాధించడానికి ఇది గొప్ప రోజు. ఈరోజు తీసుకునే హేతుబద్ధమైన నిర్ణయాలు వ్యాపారంలో బాధ్యతలను తగ్గిస్తాయి. మిమ్మల్ని గౌరవించే వారికి మాత్రమే మీ కృతజ్ఞతలు తెలియజేయాలని గుర్తుంచుకోండి. లాయర్ల సూచనలను అంగీకరించడానికి ప్రయత్నించండి. వివాహ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయి. శివాలయాన్ని సందర్శించడం, అభిషేకం చేయడం మేలు.
మాస్టర్ కలర్: సీ గ్రీన్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్: 7
దానాలు: పేదలకు సాల్ట్ దానం చేయాలి
ఈ నాలుగు రాశుల వారు శని దేవుడికి ఎంతో ఇష్టమైన వారు.. వీరికి విజయం తప్ప ఓటమనేదే లేదు..
నంబర్ 8:
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్ ప్రభావం కనిపిస్తుంది. లక్ష్యాలను సాధించాలంటే ఈ రోజు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలి. కాబట్టి సంకోచించడం మానేసి ముందుకు సాగండి. ఈరోజు సౌకర్యవంతమైన వైఖరిని, చిరునవ్వుతో కూడిన ముఖాన్ని ఉంచుకోవాలి. ప్రభుత్వ కనెక్షన్ల శక్తిని ఉపయోగించండి. మనీ సెటిల్మెంట్, దౌత్య విధానాన్ని ఉపయోగించి చట్టపరమైన కేసులు పరిష్కారమవుతాయి. పశువులకు దానధర్మం నేడు తప్పనిసరి.
మాస్టర్ కలర్: సీ బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్: 6
దానాలు: స్థానికులకు పాదరక్షలు ఇవ్వాలి
నంబర్ 9:
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీరు నటుడు, రాజకీయ నాయకులు, వ్యాపారులు, పబ్లిక్ ఫిగర్ లేదా మీడియా వ్యక్తి అయితే, భవిష్యత్తులో అభివృద్ధిని సాధిస్తారు. పాత వివాదాలను పరిష్కరించుకోవడానికి పరస్పర విశ్వాసాన్ని పరిగణించాలి. అధిక అదృష్టం కారణంగా వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు జరుగుతాయి. ఇబ్బంది పెడుతున్న వారు ఎప్పటికీ చాలా దూరం వెళతారు.
మాస్టర్ కలర్: ఆరెంజ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్: 9
దానాలు: ఆలయాలకు ఎరుపు వస్త్రాలు దానం చేయాలి
జూన్ 11వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
లాలూ ప్రసాద్ యాదవ్, మహాబలి షేరా, జూలియా మార్గరేట్, రామ్ ప్రసాద్ బిస్మిల్, రాజమోహన్ రెడ్డి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Astrology, Future Prediction, Numerology