Home /News /astrology /

NUMEROLOGY TODAY CHECK WHAT YOUR LUCKY NUMBER IS SAYING TODAY BA GH PJN

Numerology: మే 20 న్యూమరాలజీ.. పంతాలకు పోవద్దు.. వీరికి సగం అదృష్టం.. మీ సంఖ్య ఏం చెబుతుందో చూడండి

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 20వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. ఇంకొందరు రిలేషన్‌లో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరో సంఖ్య ప్రభావం ఉన్నవారు ఇతరులతో ప్రణాళికలు పంచుకోవడం ఆపేయడం మంచిది.

ఇంకా చదవండి ...
(పూజా జైన్, న్యూమరాలజిస్ట్, 9052647890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 20వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. ఇంకొందరు రిలేషన్‌లో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. మరో సంఖ్య ప్రభావం ఉన్నవారు ఇతరులతో ప్రణాళికలు పంచుకోవడం ఆపేయడం మంచిది. మరికొందరు ముందుకు వెళ్లి భాగస్వామికి లవ్‌ ప్రపోజ్‌ చేస్తారు. ఇంకొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

నంబర్‌ 1
నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. ఈ రోజు 1,2, 4ల కలయికతో ఉంటుంది. జ్ఞానం, నిర్వహణ నైపుణ్యాలు, హస్తకళ నైపుణ్యాలు, మెంటర్ గైడెన్స్‌ తీసుకోవడం, పరీక్ష రాయడం, ఇంటర్వ్యూకి సిద్ధపడటం వంటి వాటిపై ప్రభావం ఉంటుంది. అయితే వీటిని అమలు చేయడంలో అదృష్టం సగమే కలిసి వస్తుంది. ఈరోజు మీరు అన్ని రకాల రివార్డ్‌లను అనుభవిస్తారు. మీరు తప్పనిసరిగా గురువు పేరును జపించాలి. భవిష్యత్తు ప్రణాళికలను పంచుకోవడం ఆపివేయాలి. రోజు ప్రారంభించే ముందు తల్లి ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే ఆమె మొదటి, ప్రధానమైన గురువు.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1
దానాలు: సన్‌ఫ్లవర్‌ గింజలు దానం చేయాలి

నంబర్‌ 2
నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. రిలేషన్‌లో కోపాన్ని అదుపులో ఉంచుకునే రోజు. వివాదాలకు దారితీసే విధంగా కమ్యూనికేషన్‌ ఉండకూడదు. కాంట్రాక్ట్, ఒప్పందాలు, టెండర్లు, భాగస్వామ్యాలు లేదా ఈవెంట్‌లను నిర్వహించడానికి ఇది ఉత్తమమైన రోజు. స్పోర్ట్స్‌లో కోచ్‌లతో లేదా క్లాస్‌లో టీచర్లతో గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. భవిష్యత్తులో దూరాన్ని సృష్టిస్తుంది కాబట్టి భాగస్వాములపై ఆధిపత్యం చెలాయించవద్దు. తెల్లని దుస్తులు ధరిస్తే మంచిది. చంద్రునికి ప్రత్యేక పూజలు నిర్వహించాలి.

మాస్టర్‌ కలర్‌: వైట్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: యాచకులకు పాలు దానం చేయాలి

నంబర్‌ 3
నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. భవిష్యత్తును ప్లాన్ చేయడానికి రోజు అద్భుతమైనది. గత వివాదాలన్నింటినీ మరచిపోయి, రోజును ఉత్తమంగా మార్చుకోవడానికి మీ మనసుతో మాట్లాడండి. మీ స్నేహితులను కలుసుకోవడానికి, ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు. మీరు టీచింగ్, గానం, అకౌంటింగ్, డ్యాన్స్, వంట, డిజైనింగ్, యాక్టింగ్ లేదా ఆడిటింగ్‌లో ఉంటే ప్రతిభను ప్రదర్శించే సమయం. ఇండోర్ గేమ్‌లు, ఫైనాన్స్, ప్రభుత్వ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈరోజు కలిసివస్తుంది.

మాస్టర్‌ కలర్‌: పీచ్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: మహిళలకు పసుపు దానం చేయాలి

నంబర్‌ 4
నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. నాయకత్వం ద్వారా ఆకట్టుకోవడానికి , గౌరవం సంపాదించడానికి అనకూల సమయం. క్లయింట్ ప్రదర్శనలు ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువ సమయం కౌన్సెలింగ్, మార్కెటింగ్‌లో గడపాలి. యంత్రాలు, నిర్మాణం, కౌన్సెలింగ్, నటన లేదా మీడియాలో ఉన్నవాళ్లు రాతపూర్వక సంభాషణలతో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సంబంధాలు కూడా గందరగోళం లేకుండా సాధారణంగా ఉంటాయి. కుంకుమపువ్వు మిఠాయిలు, పుల్లని పండ్లను తినడం మేలు చేస్తుంది.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు పచ్చని ధాన్యాలు దానం చేయాలి

నంబర్‌ 5
నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. ఈ రోజు ప్రణాళిక ప్రకారం విషయాలు కదలవు, కాబట్టి ఒక రోజు కోసం ఒక అడుగు వెనక్కి తీసుకోండి. పెట్టుబడి ప్రణాళికలు లాభదాయకంగా ఉంటాయి. ఆక్వా ధరించి సమావేశాలకు హాజరైతే మంచిది. ఇంటర్వ్యూలు, ప్రపోజల్స్ కోసం ఆనందంగా బయటకు వెళ్లండి. ఆస్తికి సంబంధించిన నిర్ణయాలు కూడా ఈరోజు పరిపూర్ణంగా కనిపిస్తున్నాయి. ప్రయాణ ప్రియులు లాంగ్ డ్రైవ్‌లను అన్వేషించవచ్చు. ఆహారం, పానీయాలలో క్రమశిక్షణ ఈరోజు తప్పనిసరి. పనిలో తోటివారితో మృదువుగా ఉండాలని గుర్తుంచుకోవాలి, భవిష్యత్తులో ఇది చాలా సహాయపడుతుంది.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: అనాథలకు పండ్లు దానం చేయాలి

నంబర్‌ 6
నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. మీ ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఇష్టపడుతారు. ఒక రోజు విలాసవంతంగా గడపండి, అవకాశాలను అన్వేషించండి, వాగ్దానాలను నెరవేర్చండి. దేవునికి కృతజ్ఞతలు చెప్పడానికి సంతోషం, శ్రేయస్సుతో కూడిన అందమైన రోజు. మీరు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల మద్దతును కలిగి ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. నటులు, వైద్యులు, ఎగుమతి దిగుమతి వ్యాపారులు, రియల్ ఎస్టేట్, లగ్జరీ వస్తువుల వ్యాపారాలకు సంబంధించిన వారు అదృష్టాన్ని పొందుతారు. వాహనాలు, ఇల్లు, యంత్రాలు లేదా ఆభరణాలు కొనుగోలు చేయడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: వైట్‌ కాయిన్‌ దానం చేయాలి

నంబర్‌ 7
నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. కొత్త ఆఫర్ అందుకొనే సూచనలు ఉన్నాయి. ఈరోజు తీసుకునే నిర్ణయాలు వ్యాపారంలో బాధ్యతలను తగ్గిస్తాయి. ఆపోజిట్‌ జెండర్‌ సూచనలను అంగీకరించడానికి ప్రయత్నించండి, అవి మీకు ప్రయోజనం చేకూరుస్తాయి. CA యొక్క సలహా తీసుకోవడం ఖాతాలను సరైన రీతిలో నిర్వహించడంలో సహాయపడుతుంది. వివాహ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చుతాయి.

మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆలయాలకు కాపర్‌, వెండి నాణేలు దానం చేయాలి

నంబర్‌ 8
నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. సేల్స్ లేదా స్టాక్ మార్కెట్, మెడికల్, పాలిటిక్స్, బెట్టింగ్‌లో ఉన్న వ్యక్తులకు ఇది చాలా కష్టమైన రోజు. ప్రాక్టికల్‌ థింకింగ్‌, మృదువైన ప్రసంగం ఈ రోజు విజయాన్ని చేరుకోవడానికి కీలకం. డబ్బు, పరిచయాల శక్తి ద్వారా చట్టపరమైన కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపార ఒప్పందాలను ఛేదించడానికి ఈరోజు కమ్యూనికేషన్ కీలకం, కుటుంబ సంబంధాలు ఇక్కడ ఎక్కువగా పని చేస్తాయి. రోజంతా ప్రణాళికలను అమలు చేయడంలో, డబ్బు బ్యాలెన్స్ చేయడంలో బిజీగా ఉంటారు.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: అవసరంలో ఉన్న వారికి పాదరక్షలు ఇవ్వాలి

నంబర్‌ 9
నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. పరస్పర విశ్వాసం ఈరోజు విజయానికి కీలకం. ప్రేమలో ఉన్న వ్యక్తులు ముందుకు వెళ్లి వారి భాగస్వామికి ప్రపోజ్ చేస్తారు. వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు పత్రాలపై సంతకం చేయడం, ఈవెంట్‌లను నిర్వహించడం లేదా శస్త్రచికిత్స వంటివి ఒప్పందాలు సరిగా లేకపోవడం వల్ల ఆలస్యం అవుతాయి. క్రీడాకారుల తల్లిదండ్రులు తమ పిల్లల గురించి గర్వపడతారు.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఆలయాలకు ఆరెంజ్‌ కలర్‌ వస్ర్తం దానం చేయాలి

20వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
N.T.రామారావు, అంజుమ్ చోప్రా, విజయ్ మౌర్య, అనంత్ కుమార్ హెగ్డే, మంచు మనోజ్
Published by:Ashok Kumar Bonepalli
First published:

Tags: Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు