Home /News /astrology /

NUMEROLOGY TODAY 2ND JULY 2022 DAILY NUMEROLOGY KNOW YOUR LUCKY NUMBER PREDICTIONS TODAY AND THESE SHOULD AWAY FROM PRIDE GH PJN SRD

Numerology: జులై 2 న్యూమరాలజీ.. ఆ రంగంలో పనిచేసే మహిళలకు ఈ రోజు లక్కీ డే.. వీరు అహాన్ని పక్కన పెట్టాలి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

Numerology: న్యూమరాలజీ ప్రకారం జులై 1వ తేదీ శుక్రవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు.

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 2వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

నంబర్‌ 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. ఈరోజు కుటుంబంలో సామరస్యం నెలకొనాలంటే స్త్రీలు ఇతరుల తప్పులను విస్మరించాలి. సహచరులు సృష్టించిన అడ్డంకులు ఉన్నప్పటికీ, మీరు ఉత్తమ అవుట్‌పుట్‌తో రోజును గెలుస్తారు. ఈ రోజు మీరు ఆత్మవిశ్వాసంతో ఉంటారు. క్లయింట్‌లు లేదా కస్టమర్‌లతో దీర్ఘకాలిక సంబంధాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి రోజు.

మాస్టర్‌ కలర్‌: బీజ్‌

లక్కీ డే: ఆదివారం

లక్కీ నంబర్‌: 1

దానాలు: పసుపు రంగులోని పప్పులను దానం చేయాలి

నంబర్‌ 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఈ రోజు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేయడం మంచి ఆలోచన కాదు. తెల్లని దుస్తులు ధరించి రోజును ప్రారంభించండి. చంద్రుని ఆశీర్వాదం తీసుకోండి. భాగస్వామ్యాల్లోకి ప్రవేశించడానికి, వివాహం కోసం మ్యాచ్‌లను చూడటానికి ఉత్తమమైన రోజు. దౌత్యపరమైన కమ్యూనికేషన్ ఈరోజు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రియమైనవారితో ఎమోషనల్‌ టైమ్‌ గడపడానికి కూడా ఇది గొప్ప రోజు.

మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

దానాలు: పేదలకు చక్కెర ధానం చేయాలి

నంబర్‌ 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ఉదయాన్నే నుదుటిపై చందనాన్ని ధరించండి. ఈరోజు కన్సల్టెన్సీ సంస్థలకు మంచి ఫలితం ఉంటుంది. మధ్యవర్తి సహాయంతో పాత వివాదాలను పరిష్కరించుకొనే సూచనలు ఉన్నాయి. మీ స్నేహితులను కలుసుకోవడానికి, ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు. మీరు కౌన్సెలింగ్, స్పోర్ట్స్, టీచింగ్, పబ్లిక్ స్పీకింగ్, డ్యాన్స్, వంట, డిజైనింగ్, యాక్టింగ్, మార్కెటింగ్ లేదా ఆడిటింగ్‌లో ఉంటే వ్యక్తిత్వ ప్రదర్శనకు సమయం.

మాస్టర్‌ కలర్‌: పీచ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 9

దానాలు: ఆలయాలకు ఎల్లో మస్టర్డ్‌ అందజేయాలి

నంబర్‌ 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. మీ తెలివే మీ బలం. ఖాతాదారుల సమావేశంలో లేదా ప్రదర్శనలతో అద్భుతమైన ప్రశంసలు అందుకుంటారు. ఎక్కువ సమయం డబ్బు సంపాదించే ఆలోచనలు, వ్యాయామం, ఆడిటింగ్, కౌన్సెలింగ్, మార్కెటింగ్‌లో గడపాలి. తయారీ, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, వైద్యం, నటన, క్రీడలు , రాజకీయాలలో వ్యవహరిస్తే కొత్త సహకారం లేదా భాగస్వాముల కోసం వెళ్లాలి. వ్యక్తిగత సంబంధాలు కూడా గందరగోళం లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి.

మాస్టర్‌ కలర్‌: బ్లూ

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: పేదలకు వస్త్రాలు దానం చేయాలి

నంబర్‌ 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. గణేశుడికి పూజలు చేసి, ఆశీర్వాదం తీసుకోండి. పెట్టుబడి ప్రణాళికలు అధిక రాబడిని ఇస్తాయి. కార్యాలయంలో కదలిక ఈరోజు విజయానికి కీలకం, కాబట్టి సమావేశాలకు వెళ్లండి. మీ ఆధిపత్య వైఖరిపై నియంత్రణ కలిగి ఉండండి. ఆక్వా ధరించడం వల్ల సమావేశాల్లో మేలు జరుగుతుంది. ప్రయాణ ప్రియులు విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నించవచ్చు. మీరు ఈ రోజు వ్యక్తిగత భాగస్వామి విశ్వాసాన్ని పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: అనాథలకు పచ్చని పండ్లు దానం చేయాలి

నంబర్‌ 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. మీరు ఉత్తమ బంధువులు, స్నేహితులు, పిల్లలు, వ్యాపార భాగస్వాములను పొందారు. కాబట్టి ఈ రోజు మీ విధేయతను నిరూపించుకోవడానికి ఒక రోజు. అలాగే చాలా అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. మీరు కుటుంబం, స్నేహితుల సపోర్ట్‌ను పొందడం ఆశీర్వాదంగా భావిస్తారు. భాగస్వామితో గడిపేందుకు మంచి రోజు.

మాస్టర్‌ కలర్‌: ఆక్వా

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: ఆలయాలకు సిల్వర్‌ కాయిన్‌ దానం చేయాలి

నంబర్‌ 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. గందరగోళాన్ని నియంత్రించండి ఎందుకంటే ఇది వ్యక్తిగత ఆందోళనకు దారి తీస్తుంది. మీ బాధ్యతలను పెంచుకోవడం మానుకోండి. మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు. మోడలింగ్, రాజకీయాలు, వైద్యం, లా ప్రాక్టీస్, మెడికల్ ఫీల్డ్, మీడియా, ఎగుమతి దిగుమతి, IT రంగాలకు చెందిన మహిళలకు అదృష్టం కలిసి వస్తుంది. బాస్ సూచనలను అంగీకరించడానికి ప్రయత్నించండి . ఆడిటర్ల సలహాలను స్వీకరించడానికి ప్రయత్నించండి. శివాలయాన్ని దర్శించడం, రుద్రాభిషేకం చేయడం వల్ల సంతోషం కలుగుతుంది.

మాస్టర్‌ కలర్‌: ఎల్లో, గ్రీన్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7

దానాలు: పేదలకు, పశువులకు అరటిపండ్లు దానం చేయాలి

నంబర్‌ 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఈ రోజు అవకాశాలు, లగ్జరీతో నిండి ఉంది. నెట్‌వర్కింగ్ ద్వారా లీగల్ కేసులు పరిష్కారమవుతాయి. వ్యాపార ఒప్పందాలను ఛేదించడానికి ఈరోజు సమయపాలన, అంకితభావం కీలకం. అహాన్ని పక్కన పెట్టాలి. మీరు డబ్బు లావాదేవీల మధ్య రోజంతా బిజీగా ఉంటారు, అందువల్ల రోజు మంచి సంతృప్తితో ముగుస్తుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి వెజ్ ఫుడ్‌కు పరిమితం అవ్వండి. వృద్ధాశ్రమంలో దానధర్మాలు నేడు తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ

లక్కీ డే: శనివారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: అవసరమైన వారికి పాదరక్షలు దానం చేయాలి

నంబర్‌ 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. విద్య, ఔషధాలు, నటన, రత్నాలు, ఆభరణాలు, స్టాక్ మార్కెట్‌లో పనిచేస్తున్న మహిళలకు ఈ రోజు కలిసి వస్తుంది. కొత్త రిలేషన్‌లు, ఇంటర్వ్యూలకు హాజరు కావడం, కొత్త ఇల్లు కొనడం, పార్టీలు చేసుకోవడం, షాపింగ్ చేయడం వంటివి అన్నీ అనుకూలంగానే ఉంటాయి. వ్యాపార పత్రాలపై సాఫీగా సంతకం చేస్తారు. రాజకీయాలు, మీడియా, ఫైనాన్స్ లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు భారీ వృద్ధిని సాధిస్తారు. డిజైనింగ్ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షలకు వెళ్లాలి. ఈరోజు తల్లిదండ్రులు తమ పిల్లల గురించి గర్వపడతారు.

మాస్టర్‌ కలర్‌: బ్రౌన్‌

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: పశువులకు బ్రౌన్‌ బ్రెడ్‌ దానం చేయాలి

జులై 2వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు వీరే..
మహ్మద్ అజీజ్, గౌతమి, రజా మురాద్, లిండ్సే లోహన్ అనుపమ వర్మ
Published by:Sridhar Reddy
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు