Home /News /astrology /

NUMEROLOGY TODAY 28TH MAY 2022 NUMEROLOGY PREDICTIONS KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS PJN GH MKS

Numerology: (మే 28) న్యూమరాలజీ: ఈరోజు ఎక్కువగా ఆలోచించడం మానుకోండి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం 28వ తేదీ శనివారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం 28వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్న నాయకులు కమ్యునికేషన్‌ నైపుణ్యాలు ప్రదర్శించడానికి అనుకూలమైన రోజు. కొందరు సరైన బిజినెస్‌ పార్ట్‌నర్స్‌ను ఎంచుకొంటారు. ఇంకొందరు వివాహానికి సంబంధించి ప్రపోజల్స్‌ చేయడానికి అనువైన సమయం. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. సూర్య మంత్రాన్ని జపించి, రోజు ప్రారంభించండి. మంచి ఫలితాలను ఇస్తుంది. నాయకులు తమ కమ్యూనికేషన్ నైపుణ్యాలను ప్రదర్శించి ప్రపంచాన్ని గెలవడానికి గొప్ప రోజు. మీరు ఇతర గ్రూప్స్‌, బ్రాండ్‌లతో సహకరించడానికి, ప్రసంగాలు చేయడానికి, ఆస్తులలో పెట్టుబడి పెట్టడానికి, ఇంటర్వ్యూలకు హాజరు కావడానికి లేదా ఈరోజు ప్రత్యేక స్నేహితుడికి ప్రేమను తెలియజేయడానికి ప్రయత్నించాలి. ఈ రోజు మీరు అన్ని సౌకర్యాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదించడం లేదా లక్ష్యాన్ని సాధించడం సులభం అవుతుంది.
మాస్టర్‌ కలర్‌: ఎల్లో, ఆరెంజ్‌
లక్కీ డే: ఆదివారం, గురువారం
లక్కీ నంబర్‌: 1
దానాలు: సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. సరైన భాగస్వాములను ఎంచుకునే అవకాశం ఉంది. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను సాధించడానికి అనుకూలమైన రోజు. పిల్లలు, బంధువులతో గడపడానికి కూడా ఇది గొప్ప రోజు. శివుడు, చంద్రుడి ఆశీర్వాదాలు తీసుకోండి. ద్రవపదార్థాలు, ఎలక్ట్రానిక్, మందులు, ఎగుమతి దిగుమతులు, సౌరశక్తి, వ్యవసాయం, రసాయనాల వ్యాపారాలలో లాభాన్ని పొందే సూచనలు ఉన్నాయి.
మాస్టర్‌ కలర్‌: బ్లూ, వైట్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: యాచకులకు చక్కెర దానం చేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. నాయకులు, కెప్టెన్‌లు, కోచ్‌లు, ఉపాధ్యాయులు, ఫైనాన్సర్‌లకు ఈ రోజు భారీ విజయాన్ని అందుకోవడానికి ఒక అందమైన రోజు. కానీ రోజును ప్రారంభించడానికి గురువు, తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని గుర్తుంచుకోండి. ఈ రోజు విద్యార్థులకు విజయవంతమైన రోజు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. మీ భాగస్వామిని ఆకట్టుకోవడానికి ఇది గొప్ప రోజు, కానీ రాతపూర్వకంగా మాత్రమే సంభాషణ జరపాలి. వివాహానికి మీ లవ్‌ను ప్రపోజ్‌ చేయడానికి అనువైన రోజు. గురు గ్రహం శక్తిని పెంచడానికి మహిళలు పసుపు రంగులో భోజనం వండాలి, మొత్తం కుటుంబానికి వడ్డించాలి.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3,1
దానాలు: ఆలయాలకు చందనం దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీ మనస్సు సంక్లిష్టతలతో నిండి ఉంది, కానీ రోజు గడిచేకొద్దీ, మీ విశ్వాసం పెరుగుతుంది, గందరగోళం తగ్గుతుంది. ఈరోజు పెట్టుబడి పెట్టిన డబ్బు గోప్యంగా ఉండాలి. ఎక్కువ సమయం పత్రాలను సమీక్షించడానికే వెచ్చించాలి. ఎగుమతి దిగుమతులతో వ్యవహరిస్తే, మీ మనసు చేసే సూచనలను జాగ్రత్తగా వినండి. వ్యక్తిగత సంబంధాలలో ఎమోషనల్ మలుపులు ఉంటాయి. ఎవరినైనా బాధపెట్టే అవకాశం ఉంది, కాబట్టి కమ్యూనికేషన్‌లో జాగ్రత్తగా ఉండండి.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: గ్రీన్‌ పెన్‌, పెన్సిల్‌ను పిల్లలకు దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీ ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండాలి. మీ స్వేచ్ఛను ఉపయోగించుకోవడంలో జాగ్రత్త వహించండి. మీ సహచరులు, పరిచయస్తులతో జాగ్రత్త వహించండి, మీ రహస్యాలను వారితో పంచుకోవద్దు. స్నేహితులు, బంధువులతో ఉదారంగా, ప్రాక్టికల్‌గా ఉండండి. టీల్ రంగు దుస్తులు ధరించి సమావేశాలకు హాజరైతే మేలు. దయచేసి ఈరోజు లిక్కర్, నాన్ వెజ్ మానుకోండి.
మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పిల్లలకు పచ్చని మొక్కలు దానం చేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. వ్యక్తిగత సంబంధాలలో ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఈరోజు ఎక్కువగా ఆలోచించడం మానుకోండి. తల్లిదండ్రులు కుటుంబం, స్నేహితులు, సహోద్యోగుల సపోర్ట్‌ ఉండటం ఆశీర్వాదంగా భావిస్తారు. ఆఫీసులో మీటింగ్‌లు, డీలింగ్‌లు, హోస్టింగ్, మార్కెటింగ్, ప్రెజెంటేషన్‌లలో గడపడానికి అనుకూల సమయం. ప్రభుత్వ టెండర్లలో రిస్క్ తీసుకోవడానికి మీకు తగినంత అదృష్టం ఉంటుంది. వైద్యం కోసం వెళ్ళడానికి, సమీక్షలకు హాజరు కావడానికి, బట్టలు, ఆభరణాలు, వాహనాలు, మొబైల్, ఇల్లు కొనడానికి లేదా చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకోవడానికి మంచి రోజు. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి.
మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆలయాలకు ఉప్పు దానం చేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ప్రజాప్రతినిధులు తమ డబ్బు సంపాదించే ఆలోచనలను ఈరోజు గోప్యంగా ఉంచుకోవాలి. ఈరోజు పత్రాలపై సంతకం చేయకుండా ఉండండి. జీవితం ఎత్తుపల్లాల మధ్య ఊగిసలాడుతుంది, ముఖ్యంగా ఈరోజు జ్ఞానాన్ని ఉపయోగించాలి. కొత్త అవకాశం చిన్న బ్రాండ్ లేదా ఆపోజిట్‌ జెండర్‌కు చెందినదైతే అంగీకరించండి. న్యాయవాది సలహా తీసుకోవడం సరైన మార్గంలో డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన వ్యాపార ఒప్పందాలు అత్యంత విజయవంతమవుతాయి. ఈరోజు వివాహ ప్రతిపాదనలు విజయవంతం కావు.
మాస్టర్‌ కలర్‌: ఎల్లో
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆలయాలకు ఎల్లో వెస్సెల్‌ దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. మీరు ఎక్కడ సజావుగా వ్యవహరించాలని కోరుకున్నారో అక్కడ జ్ఞానం, డబ్బు శక్తిని ఉపయోగించండి. చట్టపరమైన కేసులు ప్రభావవంతమైన వ్యక్తులు లేదా డబ్బు ద్వారా పరిష్కారమవుతాయి. అయితే వ్యాపార ఒప్పందాలలో విజయం సాధించడానికి నెట్‌వర్కింగ్ ఈరోజు కీలకం. విద్యార్థులు లక్ష్యం కోసం పని చేయడానికి సమయాన్ని కేటాయించాలి.
మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: అవసరంలో ఉన్నవారికి పాదరక్షలు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు గ్లామర్ పరిశ్రమలో ఉన్నవారు డబ్బు, కీర్తిని ఆస్వాదిస్తారు. కపుల్స్‌ భవిష్యత్తును ప్లాన్ చేసుకోవడానికి ఒక అందమైన రోజు. ప్రభుత్వ టెండర్లు, ప్రాపర్టీ డీల్స్, డిఫెన్స్ కోర్సు, మెడికల్ కోర్సుల అంశాల్లో సజావుగా సంతకాలు జరుగుతాయి. గ్లామర్, సాఫ్ట్‌వేర్, సంగీతం, మీడియా లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు ప్రజాదరణను అందుకుంటారు. సంగీత విద్వాంసుల తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఎర్రకందిపప్పును దానం చేయాలి

మే 28వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : N T రామారావు, వినాయక్ దామోదర్ సావర్కర్, మీర్ తాకి మీర్, రోడ్రిక్స్, మహంత్ వైద్యనాథ్, పినాకి చంద్ర ఘోష్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు