Home /News /astrology /

NUMEROLOGY TODAY 27TH JUNE 2022 DAILY NUMEROLOGY KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS GH PJN MKS

Numerology: (జూన్ 27) న్యూమరాలజీ : ప్రియమైన వ్యక్తితో భావోద్వేగాలను పంచుకునే రోజు ఇది..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నంబర్ల ఆధారంగా వ్యక్తులపై పడే ప్రభావాన్ని న్యూమరాలజీ నిపుణులు అంచనా వేస్తుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం జూన్ 27, సోమవారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
న్యూమరాలజీ ప్రకారం వ్యక్తులపై ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యల ప్రభావం ఉంటుంది. ఈ నంబర్ల ఆధారంగా వ్యక్తులపై పడే ప్రభావాన్ని న్యూమరాలజీ నిపుణులు అంచనా వేస్తుంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం జూన్ 27, సోమవారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

#Number 1 : (నెలలో 1, 20, 19, 28 తేదీలలో జన్మించిన వ్యక్తులు) అకడమిక్ లేదా స్పోర్ట్స్ పోటీల్లో హీరోలాగా విజయం సాధించి గౌరవాన్ని పొందే రోజు. మీరు తప్పనిసరిగా సమావేశాలు, స్టేజ్, ఈవెంట్‌లకు వెళ్లి నాయకుడిగా ఉండాలి. మీ సృజనాత్మక ప్రసంగ శైలి ఇతరులపై అద్భుతమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కొత్త బిజినెస్ రిలేషన్స్ ఏర్పరచుకోవడానికి మంచిరోజు. జంటలు లవ్ రిలేషన్స్ ఆస్వాదించడానికి ఉత్తమ రోజు. విద్యావేత్తలు, రచయితలు, సినీ దర్శకులు, కళాకారులు, డ్యాన్సర్లు, సౌరశక్తి డీలర్లు, సంగీతకారులు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, జ్యువెలర్లు, గ్లామర్ పరిశ్రమకు చెందినవారు గొప్ప ప్రజాదరణను సాధించే రోజు.
మాస్టర్ కలర్స్: ఆరెంజ్
లక్కీ డే: ఆదివారం, మంగళవారం
లక్కీ నంబర్‌: 1, 9
విరాళాలు: దేవాలయాలకు పసుపు, ఆవాలు దానం చేయండి.

#Number 2: (నెలలో 2, 11, 20, 29వ తేదీలలో జన్మించినవారు) సమస్యలు ముగిసేలా ఉన్నాయి కాబట్టి ఓపిక పట్టి ముందుకు సాగండి. అనవసరంగా ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రాకూడదని గుర్తుంచుకోండి. పనిలో సీనియర్ల సహాయంతో విజయం సాధిస్తారు. అవకతవకల విషయంలో మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. మీ పిల్లలు, బంధువులతో గడపడం, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం, చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం, స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం, మీ భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వడం.. వంటి వాటికి బెస్ట్ డే. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, ఎగుమతి వ్యాపార ఒప్పందాలు చేపట్టవచ్చు. రిలేషన్‌షిప్‌లో సున్నితంగా ఉండకుండా, రొమాంటిక్‌గా ఉంటే శ్రేయస్సు మీ సొంతం.
మాస్టర్ కలర్స్: పింక్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
విరాళాలు: హెల్పర్స్‌కు పింక్ కలర్ దుస్తులను విరాళంగా ఇవ్వండి

#Number 3: (నెలలో 3, 12, 22, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు) చిటికెడు పసుపుతో రోజును ప్రారంభించండి. సృజనాత్మకత అనేది ఈకు కెరీర్‌లో అన్ని అవకాశాల ద్వారాలను తెరుస్తుంది. కొత్త ఆఫర్‌లతో నిండిన రోజు. మీ ప్రయత్నాలకు గుర్తింపు లభిస్తుంది. పంటలు కోయడానికి, దాని నుంచి డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం. మీ ప్లాన్‌లు రియల్ ఎస్టేట్‌లో వర్కవుట్ అవుతాయి, కాబట్టి ఆ దిశగా ప్రయత్నించాలి. ముఖ్యంగా సింగర్స్, కోచ్‌లు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులను బాగా ఆకట్టుకునే రోజు ఇది. దుస్తులు, ఆభరణాలు, పుస్తకాలు, డెకర్, ధాన్యాలు లేదా ప్రయాణ బుకింగ్స్ షాపింగ్ చేయడానికి ఇది ఉత్తమమైన రోజు. డిజైనర్లు, హోటళ్లు, యాంకర్లు, స్పోర్ట్స్ కోచ్‌లు, ఫైనాన్సర్లు, సంగీతకారులు ఈరోజు ప్రత్యేక విజయాలను ఆస్వాదిస్తారు.
మాస్టర్ కలర్స్: రెడ్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 9
విరాళాలు: ఆలయాలకు చందనం దానం చేయండి

#Number 4: (నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వ్యక్తులు) మంచి గుడ్‌విల్, మనీ మేనేజ్‌మెంట్ సహాయంతో మీరు ఆస్తిలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ముందుంటారు. శివుడిని జపించండి, ఇది సవాళ్లను తగ్గిస్తుంది, రోజును సంపదతో నింపుతుంది. సీరియస్ రిలేషన్‌షిప్స్‌లో ఉన్నవారికి ఇది అనుకూలమైన రోజు. బిజినెస్ రిలేషన్స్ లేదా ప్రభుత్వ ఉత్తర్వులు ఆలస్యం లేకుండానే ముందుకెళ్తాయి. ఫైనాన్స్‌కు సంబంధించిన ప్రధాన నిర్ణయాలు లాభాన్ని ఆర్జిస్తాయి. సేల్స్ ఉద్యోగులు, IT ఉద్యోగులు, థియేటర్ ఆర్టిస్ట్ లేదా నటులు, టీవీ యాంకర్లు, డ్యాన్సర్‌లు ఈరోజు సక్సెస్‌ఫుల్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల మంచి ప్రయోజనాలను పొందేందుకు అవకాశాల కోసం తప్పనిసరిగా ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకోవాలి. మెటల్, గార్మెంట్స్ తయారీదారులు వ్యాపారంలో కొత్త ఆఫర్‌ను ఆశించాలి. ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవడానికి ఆకుకూరలను ఎక్కువగా తీసుకోండి.
మాస్టర్ కలర్స్‌: ఊదా
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
విరాళాలు: పిల్లలకు దుస్తులు దానం చేయండి

#Number 5: (నెలలో 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు) స్టాక్స్, ప్రాపర్టీ, ఎగుమతి దిగుమతి వ్యాపారం, ట్రావెల్ ఏజెన్సీ లేదా విద్య విషయాల్లో ఒక అడుగు ముందుకు వేయండి. ఇది స్వల్పకాలిక లక్ష్యాలను సాధించడానికి మంచి రోజు. ఈరోజు మీకు ఊహించని అదృష్టాన్ని కలిగించే సందర్భాలు ఉన్నాయి. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడానికి మీరు కుటుంబం, స్నేహితుల పూర్తి మద్దతును పొందుతారు. మనీ ప్రాఫిట్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీలు, రక్షణ శాఖల ఉద్యోగులు పెట్టుబడిపై రాబడిని పొందే అవకాశం ఉంది. కుటుంబానికి కృతజ్ఞులుగా ఉండాలి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు, క్రీడలు, ఈవెంట్‌లు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాలి.
మాస్టర్ కలర్స్: టీల్
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
విరాళాలు: జంతువులకు ఆహారాన్ని దానం చేయండి

#Number 6 : (నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వ్యక్తులు) ప్రియమైన వ్యక్తితో భావోద్వేగాలను పంచుకునే రోజు ఇది. నేడు ఈవెంట్‌లకు హాజరు కావడం, ఇంటర్వ్యూలు, ఆటలు ఆడడం, షాపింగ్ చేయడం, టూరింగ్, ప్రయాణం, వ్యక్తిగత వస్త్రధారణ, అసైన్‌మెంట్ పూర్తి చేయడం వంటి కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. జీవితానికి శ్రేయస్సు, పరిపూర్ణతను తెచ్చే విలాసవంతమైన రోజు ఇది. బిజినెస్ క్లయింట్‌ల సమస్యలను పరిష్కరించడానికి, డిన్నర్ లేదా షాపింగ్ కోసం బయటకు వెళ్లడానికి మంచి సమయం. గృహిణులు, క్రీడాకారులు, ప్రాపర్టీ డీలర్లు, చర్మవ్యాధుల నిపుణులు, డిజైనర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రోకర్లు, చెఫ్‌లు, విద్యార్థులు వృద్ధిని పెంచే కొత్త అసైన్‌మెంట్‌లను అందుకుంటారు. రొమాంటిక్ రిలేషన్స్ ఇంటికి సంతోషాన్ని తిరిగి తెస్తాయి.
మాస్టర్ కలర్స్: వయొలెట్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
విరాళాలు: ఆలయాలకు వెండి నాణెం విరాళంగా ఇవ్వండి

#Number 7: (నెలలో 7, 16, 25వ తేదీలలో జన్మించిన వ్యక్తులు) పాల నీటితో స్నానం చేసి మీ రోజును ప్రారంభించండి. ఈరోజు ప్రయాణం చేయడం లేదా పార్టీకి వెళ్లడం మానుకోవాలి. మీ తెలివితేటలు అన్నింట్లో విజయాలను గెలుచుకోగలవు కాబట్టి సవాళ్లను అంగీకరించండి. తల్లి, ఇతర సీనియర్ల సూచనలను శ్రద్ధగా వినండి. ఈరోజు పెద్దదిగా అనిపించే సమస్య త్వరలో మాయమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని కిందకి లాగే అవకాశం ఉంది, కానీ ఇందులో విజయం సాధించలేరు. జ్యువెలరీ వ్యాపారులు, న్యాయవాదులు, కొరియర్, పైలట్లు, రాజకీయ నాయకులు, థియేటర్ ఆర్టిస్ట్, CA, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు ప్రత్యేక అదృష్టం కలుగుతుంది.
మాస్టర్ కలర్స్‌: ఆరెంజ్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7, 9
విరాళాలు: పేదలకు పసుపు బియ్యం దానం చేయండి

#Number 8 : (నెలలో 8, 17,26 తేదీలలో జన్మించిన వ్యక్తులు) దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఆలోచించి, వాటిని సాధించడానికి ముందుకు సాగండి. పెద్ద కంపెనీలతో మీ అనుబంధం ఈరోజు అద్భుతమైన రాబడిని పొందుతుంది. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి, యంత్రాల కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. అయితే అనేక బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చట్టపరమైన వివాదాలు త్వరలో పరిష్కారమవుతాయి. వైద్యులు, ఉపాధ్యాయులు, క్రీడాకారులు, రాజకీయ నాయకులు, తయారీదారులు విజయాలతో గౌరవంగా భావిస్తారు. వ్యక్తిగతంగా భాగస్వాములతో వాదనలు జరిగే అవకాశం ఉన్నందున కూల్‌గా ఉండండి. ధాన్యాలు దానం చేయడం, సిట్రస్ జాతి పండ్లు తినడం ఈరోజు తప్పనిసరి.
మాస్టర్ కలర్: డీప్ పర్పుల్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
విరాళాలు: నిరుపేదలకు గొడుగు దానం చేయండి

#Number 9: (నెలలో 9, 18, 27 తేదీలలో జన్మించినవారు) ఇది మ్యుజిషియన్స్‌కు అంకితమయ్యే రోజు. న్యాయవాదులు, విద్యావేత్తలు, వైద్యులు, రచయితలు, ఎగుమతి దిగుమతి వ్యాపారులు, IT ప్రొఫెషనల్స్, గ్లామర్, జ్యోతిష్యం, స్పోర్ట్స్ ఐటెమ్స్‌తో డీల్ చేసేవారికి మంచి రోజు. అందరిలో మీరు సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా ఉంటారు. ప్రేమలో ఉన్నవారు తమ ఫీలింగ్స్‌ను ఎక్స్‌ప్రెస్ చేయడానికి ఒక అద్భుతమైన రోజు. బిజినెస్ రిలేషన్స్, ఒప్పందాలు ఉన్నత స్థాయికి చేరుకుంటాయి. గ్లామర్ పరిశ్రమ, మీడియాలో ఉన్న వ్యక్తులు కీర్తిని ఆనందిస్తారు. రాజకీయ నాయకులు ఈ రోజు గొప్ప అవకాశాలను అందుకుంటారు. ప్రజాప్రతినిధులు, విద్యార్థులు రిలేషన్‌షిప్స్ ఏర్పరచుకోవడానికి, పురోగతి సాధించడానికి ఈ రోజును తప్పక ఉపయోగించుకోవాలి. విద్యార్థులు, ట్రైనర్స్‌కు ఈ రోజు ప్రత్యేక ప్రకటన ఉంటుంది.
మాస్టర్ కలర్: రెడ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
విరాళాలు: రెడ్ మసూర్‌ దానం చేయండి

జూన్ 27న జన్మించిన ప్రముఖ వ్యక్తులు: R D బర్మన్, P T ఉష, ఆగస్టస్ డి మోర్గాన్, గంగాధర్ శాస్త్రి, నితిన్ ముఖేష్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు