Home /News /astrology /

NUMEROLOGY TODAY 26TH JUNE 2022 DAILY NUMEROLOGY KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS GH PJN MKS

Numerology: (జూన్ 26) న్యూమరాలజీ : ఈ రంగాల వారికి లాభదాయకం..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు ఎదురయ్యే రోజువారీ పరిస్థితులను విశ్లేషించవచ్చు. జూన్ 26 ఆదివారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
న్యూమరాలజీ ప్రకారం ఒక్కో తేదీలో పుట్టిన వారిపై ఒక్కో నంబర్ ప్రభావం ఉంటుంది. నెలలో వివిధ తేదీల్లో పుట్టిన వారికి సంఖ్యాశాస్త్రం ఒకటి నుంచి తొమ్మిది సంఖ్యలు కేటాయించింది. ఈ సంఖ్యల ఆధారంగా వ్యక్తులకు ఎదురయ్యే రోజువారీ పరిస్థితులను విశ్లేషించవచ్చు. జూన్ 26 ఆదివారం నాడు ఎవరికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకుందాం.

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. సోషల్ నెట్‌వర్క్‌ను ఆన్ చేసి, కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకోండి. మీ పనితీరును ఇతరులు అడ్డుకోవచ్చు, కానీ భవిష్యత్తులో వృద్ధికి ఇవన్నీ సహాయపడతాయి. కొత్త కోర్సును ప్రారంభించడం, కొత్త స్థలంలో పనిచేయడం, యంత్రాలు కొనడం లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం, కొత్త ఇల్లు వంటి వాటిని ప్రారంభించాలనుకుంటే.. చట్టబద్ధత గురించి ఒకటికి రెండుసార్లు ఆలోచించి, పాత కుటుంబ సభ్యుల మద్దతును మార్గదర్శకంగా తీసుకోవాలి. డబ్బు ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వివాదాలు ఉండవు. మెడికల్ ప్రాక్టీషనర్లకు ఈ రోజు ప్రత్యేక అదృష్టం కలుగవచ్చు. వ్యవసాయం, విద్యా రంగంలో ఉన్నవారికి లాభదాయకంగా కనిపిస్తోంది.
మాస్టర్ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1
విరాళాలు: ఆశ్రమాలకు గోధుమలు దానం చేయండి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఈ రోజు సంపద పెరగడానికి మద్దతు ఇస్తుంది. మీ కన్నీళ్లను ఎక్కడ చూపించాలో, ఎక్కడ దాచాలో మీరు తెలుసుకోవాలి. మీ నిజాయితీ విజయానికి కారణం అవుతుంది. ప్రజలు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి సమస్యలను పరిష్కరించడానికి ప్రాక్టికల్‌గా ఉండండి. ఒంటరిగా ఉన్నవారికి వారి ప్రేమను కనుగొనడం గొప్ప విషయం. లీగల్ ఆఫీసర్లు, లిక్విడ్ బిజినెస్ డీలర్లు, కన్సల్టెంట్స్ టీచర్లు, ఎగుమతి దిగుమతి వ్యాపారం, డాక్టర్లు, ఇంజనీర్లు, బ్రోకర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, స్టాక్ మార్కెట్, భాగస్వామ్య సంస్థలతో డీల్ చేసేవారి సంక్లిష్టమైన రోజు తర్వాత విజయాన్ని జరుపుకుంటారు. భాగస్వామి లేదా సహచరుల కారణంగా మీరు నిరాశకు గురవుతారు లేదా మానసికంగా బాధపడవచ్చు, కానీ ఇది తాత్కాలికమైనది. .
మాస్టర్ కలర్‌: బ్రౌన్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
విరాళాలు: పశువులకు నీరు దానం చేయండి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. డైరెక్ట్ కమ్యూనికేషన్ అద్భుతంగా పని చేస్తుంది. ఇది ఆశయాలను చేరుకోవడానికి, చట్టపరమైన సలహా తీసుకోవడానికి మంచి రోజు. అన్ని పరిస్థితులలో పని చేయగలిగే సౌలభ్యం మీకు విజయాన్ని సిద్ధంగా ఉంచుతుంది. కొందరు మీ ఇమేజ్‌ను అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నిస్తారు, కాబట్టి చుట్టుపక్కల వారితో జాగ్రత్తగా ఉండాలి. అలాగే సామాజిక పరంగా కూడా అప్రమత్తంగా ఉండండి. డిజైనర్లు, రచయితలు, నటులు, మ్యుజిషియన్స్ వంటి సృజనాత్మక వ్యక్తులు, మోటివేషనల్ స్పీకర్లు, కోచ్‌లు పేరు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడికి మంచి సమయం. ఉదయమంతా మీ గురువును ఆరాధించండి.
మాస్టర్ కలర్‌: బ్రౌన్
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 9
విరాళాలు: గుడికి చందనం అందజేయండి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. రోజును ఏదో ఒక రకమైన దాతృత్వంతో ప్రారంభించాలి. మీరు ఈరోజు చాలా డబ్బు సంపాదిస్తారు కానీ మీ ఆరోగ్యం లేదా వ్యక్తిగత కుటుంబ జీవితం కోసం ఖర్చు చేస్తారు. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరింత ఉన్నత స్థాయికి ఎదుగుతారు. ఈరోజు నాన్ వెజ్, మద్యానికి దూరంగా ఉండండి. విద్యార్థులకు అనుకూలంగా ఉండే రోజు. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. దుస్తుల విరాళం మీ అదృష్టాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. తయారీదారులు, వైద్యులకు ఆర్థిక లాభాలు అధికంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. ఈ రోజు దాతృత్వం తప్పనిసరి.
మాస్టర్ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
విరాళాలు: యాచకులకు చెప్పులు దానం చేయండి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీరు వృత్తిలో లేదా వ్యక్తిగత జీవితంలో కొత్తదనం కోసం ఎదురు చూస్తుంటే, ఈ రోజు ఊహించని మార్పును తెస్తుంది. రోజులోని అడ్డంకులను తగ్గించడంలో అదృష్టం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పార్ట్నర్‌కు మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి అనువైన రోజు. స్టాక్స్ కొనడానికి, భూమి కొనుగోలు చేయడానికి, స్పోర్ట్స్ మ్యాచ్‌లు ఆడేందుకు, ఆస్తిని విక్రయించడానికి, అధికారిక పత్రాలపై సంతకం చేయడానికి నేడు మంచి రోజు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, డైరెక్టర్లు, న్యూస్ యాంకర్లు, నటీనటులు, ఆర్టిస్టులు, విద్యావేత్తలు, లాయర్లు, రాజకీయ నాయకులు అన్ని విధాలుగా ప్రశంసలు అందుకుంటారు. మీ సద్భావనకు హాని కలిగించే విధంగా ఉండేలా మాట్లాడకూడదు.
మాస్టర్ కలర్‌: టీల్
లక్కీ డే : బుధవారం
లక్కీ నంబర్‌: 6
విరాళాలు: అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకు గ్రీన్ ఫ్రూట్స్ దానం చేయండి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. భవిష్యత్తుకు మేలు చేసేదిగా అనిపించే వర్క్ ప్రొఫైల్‌ను విస్తరించడానికి మంచి రోజు. నేడు మీకు సంపన్నమైన, విలాసవంతమైన, శృంగారభరితమైన దినం. కెరీర్‌లో అవకాశాలు కూడా ఈ రోజు మీకు లభిస్తాయి. ముందు టీమ్, గ్రూప్‌గా, తర్వాత ఒంటరిగా పనిచేస్తే ఈ రోజు సంతోషకరమైన ఫలితాలను తెస్తుంది. టైమ్ సపోర్ట్‌తో ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ గౌరవం, మద్దతు శ్రేయస్సును తెస్తుంది. గృహిణులు, డిజైనర్లు, లాయర్లు, టెక్కీలు, రాజకీయ నాయకులు, నటీనటులు ప్రత్యేక ప్రశంసలు, అదృష్టాన్ని ఆస్వాదిస్తారు.
మాస్టర్ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6, 9
విరాళాలు: దయచేసి పేదలకు పంచదార దానం చేయండి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. కొత్త ఆఫర్‌లను తిరస్కరించి, ప్రస్తుత పని చేయడం మంచిది. ఇది గందరగోళం, దూకుడును తగ్గిస్తుంది. తర్వాత ఉత్పాదకంగా ఉండే అవకాశాలను విశ్లేషిస్తూ ఉండండి. రిలేషన్‌షిప్స్, పనితీరు, ఆర్థిక వృద్ధిని ఆనందించే సమయం త్వరలో వస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మిడ్‌నైట్ పార్టీలకు దూరంగా ఉండండి. వ్యాపారంలో పాత కుటుంబ సభ్యుల మద్దతు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. క్రీడాకారులు విజయాన్ని అనుభవిస్తారు. అపోజిట్ జెండర్, పెద్దలు మీ అదృష్టాన్ని పెంచుకోవడంలో సహాయపడతారు. శివుని ఆశీర్వాదం పొందడానికి తప్పనిసరిగా పూజలు చేయాలి.
మాస్టర్ కలర్‌: టీల్
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 3
విరాళాలు: పిల్లలకు పసుపు రంగు పెన్సిల్స్ దానం చేయండి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. షార్ట్ కట్ ఐడియాలకు దూరంగా ఉంటూ సంప్రదాయ పద్ధతులను అనుసరించండి. బాధ్యతలు స్వీకరించడానికి ముందుంటారు కానీ చురుకుగా, శ్రద్ధగా ఉండండి. ఆఫర్ వచ్చినట్లు భావించి, వ్యాపారంలో పెద్ద బ్రాండ్‌లతో అసోసియేట్ అవ్వడానికి ప్రయత్నించండి. చుట్టుపక్కల ప్రజలందరూ మీకు నమ్మకమైన అనుచరులు కాబట్టి నాయకత్వాన్ని ఆస్వాదించే సమయం. ఆరోగ్యకరమైన జీవనశైలిని జాగ్రత్తగా చూసుకోవాలి, కుటుంబంతో సమయం గడపాలి. దాతృత్వం, హెల్పర్స్‌తో మంచి మాటల ద్వారా మీ దయను చాటండి. మీ చుట్టూ ఉన్న పచ్చని మొక్కలకు నీరు పెట్టండి.
మాస్టర్ కలర్‌: వయొలెట్
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
విరాళాలు: పేదలకు నల్ల పప్పులను దానం చేయండి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీరు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని గుర్తుంచుకోండి. సోషల్ వర్క్‌లో ఎల్లప్పుడూ నిజాయితీగా, దయతో ఉండండి. సంగీత కచేరీలు లేదా గ్లామర్ షోలను ఆస్వాదించడానికి ఇది ఒక మంచి రోజు. నటీనటులు, హీలర్లు, శిక్షకులు, జ్యువెలర్స్, కౌన్సెలర్, సర్జన్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు రివార్డులు, గుర్తింపును ఆస్వాదిస్తారు. ఈ రోజు ప్రయోజనాలు, అవకాశాలు కీర్తి, వినోదం, శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఆర్థిక లాభాలతో పాటు ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈరోజు సజావుగా జరిగే అవకాశం ఉంది. నమ్మకం, శ్రేయస్సుతో రిలేషన్‌షిప్‌ను ముందుకు తీసుకెళ్లండి.
మాస్టర్ కలర్‌: రెడ్
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
విరాళాలు: ఎరుపు రంగు ఖర్చీఫ్ విరాళంగా ఇవ్వండి

జూన్ 26న జన్మించిన ప్రముఖ వ్యక్తులు: తరుణ్ సాగర్ జీ, సురేష్ గోపీ, కునాల్ కపూర్, బంకిమ్ చంద్ ఛటర్జీ, అర్జున్ కపూర్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు