Home /News /astrology /

NUMEROLOGY TODAY 21ST MAY 2022 NUMEROLOGY PREDICTIONS KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS PJN GH MKS

Numerology: (మే 21) న్యూమరాలజీ: ఆపోజిట్‌ జెండర్‌తో అదృష్టం పెరుగుతుంది..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం మే 21వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్నవారు పాత వివాదాలను ముందుకు తెచ్చి పరిష్కరించుకోవాలి. మరొకరికి గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తులు కలిసే సూచనలు ఉన్నాయి. నంబర్ల వారీగా అందరి న్యూమరాలజీ వివరాలివే..

ఇంకా చదవండి ...
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 21వ తేదీ శనివారం కొందరికి కలిసి వస్తుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్నవారు పాత వివాదాలను ముందుకు తెచ్చి పరిష్కరించుకోవాలి. మరొకరికి గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తులు కలిసే సూచనలు ఉన్నాయి. కొందరి చుట్టూ ఉన్న వ్యక్తులు అసూయపడతారు. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో  న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. పాత ఆస్తులు లేదా పాత వివాదాలకు సంబంధించిన సమస్యలను మళ్లీ వెలుగులోకి తెచ్చి వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలి. ఆస్తిని కొనుగోలు చేయడం కంటే, ఆస్తిని విక్రయించేందుకు అనుకూల సమయం. క్రీడలలో గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. నిర్మాణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ పుస్తకాలు, మందులు, ఫైనాన్స్ వ్యాపారం సజావుగా పుంజుకుంటుంది. మీరు ఈరోజు సూర్యాస్తమయానికి ముందే ముఖ్యమైన అసైన్‌మెంట్‌లను ముగించాలి.
మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 1
దానాలు: యాచకులకు పసుపు రంగు ధాన్యాలు దానం చేయాలి.

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. మీరు ఎల్లప్పుడూ నిబద్ధతతో నిజాయితీగా ఉంటారు. కానీ అది మిమ్మల్ని బాధ పెడుతుంది గుర్తుంచుకోండి . మానసికంగా ఇబ్బంది పెట్టే సమస్యలను ఎదుర్కొనేందుకు ఈరోజు బలంగా ఉండండి . చట్టపరమైన కట్టుబాట్లు సజావుగా నెరవేరుతాయి. ఈరోజు ఎవరైనా మీ గౌరవాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి. ఆడవాళ్లు పబ్లిక్ ప్లాట్‌ఫారమ్‌లకు హాజరవ్వాలి.
మాస్టర్‌ కలర్‌: స్కైబ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: ఆలయాలకు నూనె లేదా పాలు దానం చేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. మీరు చాలా ప్రతిభావంతులు, చురుకైనవారు, కాబట్టి సొంతంగా శత్రువులను సృష్టించుకొనే అవకాశం ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయపడతారు. సాయంత్రం పాల నీటితో స్నానం చేయడం ఉత్తమ పరిష్కారం. మీ జ్ఞానంతో పాటు ప్రసంగం ద్వారా ప్రజలను ఆకట్టుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రత్యేకంగా విద్యావేత్తలు, సంగీతకారులు, బ్యాంకర్లు లేదా రచయితలకు అనుకూలంగా మారతాయి.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: పిల్లలకు ఎల్లో పెన్సిల్‌, పెన్‌ దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. పనిలో, అంకితభావంలో మీ పరిపూర్ణత ఎక్కువగా ఉంటుంది, కాబట్టి విజయం చాలా దగ్గరగా ఉంటుంది. విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదు, భవిష్యత్తు కోసం ఈ రోజు నిర్ణయాలు తీసుకోవాలి. క్రీడలు, రాజకీయాలు, వినోద రంగాలకు చెందిన వారు ప్రయాణాలు చేయడానికి ఉత్తమమైన రోజు. నిర్మాణం లేదా స్టాక్ మార్కెట్ వ్యాపారానికి సానుకూలంగా ఉంటుంది. మీడియా, మెటల్, వైద్య, వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. దయచేసి ఈరోజు నాన్ వెజ్ తినడం మానుకోండి.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: శనివారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: యాచకులకు వస్త్రాలు దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మిమ్మల్ని ఎల్లప్పుడూ అందరూ ఇష్టపడతారు. గత పనితీరుకు సంబంధించిన ప్రయోజనాలు పొందే రోజు. పాత స్నేహితుడు లేదా బంధువు సహాయం కోసం త్వరలో వస్తారు. మీరు వారికి సపోర్ట్‌ ఇవ్వాలి. బ్యాంకర్లు, క్రీడాకారులు, నటులు, రాజకీయ నాయకులు. సేల్స్‌, స్పోర్ట్స్‌లో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది.
మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: పచ్చని ఆకు కూరగాయలు దానం చేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. మీరు మీ కుటుంబానికి ఒక నక్షత్రం, కార్యాలయంలో చాలా మందికి కంటి చూపు. కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడానికి, నిశ్చితార్థం చేసుకోవడానికి, ప్రేమను వ్యక్తపరచడానికి, ప్రయాణాలు చేపట్టడానికి, నైపుణ్యాలను సూచించడానికి, ప్రదర్శనలు ఇవ్వడానికి, మాస్ మీడియాను ఎదుర్కోవడానికి, విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడానికి అనువైన రోజు. పిల్లలు, జీవిత భాగస్వామితో గడపడానికి గొప్ప రోజు. కొత్త ఫ్యాక్టరీని స్థాపించడానికి స్థలం కోసం చూస్తున్న వారు మంచి ఆప్షన్‌ ఎంచుకొంటారు.
మాస్టర్‌ కలర్‌: టేల్‌
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పేదలకు స్వీట్లు అందజేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. విజయం మీ చేతుల్లో ఉంది. మీరు ఈ రోజు హీరోగా మిగిలిపోతారు, కాబట్టి వ్యాపారంలో రిస్క్ తీసుకోవాలి. న్యాయపరమైన అంశాల్లో విజయం సాధించేందుకు  జ్ఞానం, విశ్లేషణ అవసరం. ఆపోజిట్‌ జెండర్‌తో అదృష్టం పెరుగుతుంది. తప్పక గురు మంత్రాన్ని జపించండి. రాజకీయ నాయకులకు ఒక అందమైన రోజు కానీ మృదువైన ప్రసంగం కీలకం.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: ఆలయాలకు ఆయిల్‌ దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. హార్డ్ వర్క్ అవసరమైన ప్రతిచోట ఈరోజు అదృష్టం, స్థిరత్వం కీలక పాత్ర పోషిస్తాయి. డబ్బు వస్తుంది కానీ కొన్ని అవకతవకలను తీసుకొస్తుంది. మీరు ఉన్నత స్థాయి జ్ఞానాన్ని పొందడంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ప్రజాప్రతినిధులు సాయంత్రం నాటికి ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు.
మాస్టర్‌ కలర్‌: సీబ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: యాచకులకు పుల్లని పండ్లు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. పని చేస్తున్న ఆడవారైనా, పని చేయని వారైనా ఈ రోజు ఆకట్టుకుంటారు, ఆదర్శంగా నిలుస్తారు. ఆకస్మిక అభివృద్ధి, విజయం అందే సూచనలు ఉన్నాయి. క్రీడాకారులు, విద్యార్థులు అద్భుతమైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఒక అడుగు ముందుకు వేయాలి. చెఫ్‌లు, మహిళా నటులు, గాయకులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారుడు, హోటల్‌ రంగంలో ఉన్నవాళ్లు మంచి అదృష్టాన్ని పొందుతారు.
మాస్టర్‌ కలర్‌: రెడ్‌ ఆరెంజ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: యాచకులకు, ఇంట్లో పనిచేసే వారికి దానిమ్మ పండ్లు ఇవ్వాలి

మే 21వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు: మోహన్ లాల్, ఆదిత్య చోప్రా, ముఖేష్ తివారీ, సుజోయ్ ఘోష్, ఆదిత్య గోవిత్రికర్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు