Home /News /astrology /

NUMEROLOGY TODAY 17TH MAY 2022 NUMEROLOGY PREDICTIONS KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS PJN GH MKS

Numerology: (మే 17) న్యూమరాలజీ: వీలైనన్ని బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనండి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం మే 17వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం మే 17వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరికి జీవితంలో కొత్త దశ ప్రారంభమవుతుంది. ఓ సంఖ్య ప్రభావం ఉన్నవారు ఎదుటివారికి నో చెప్పడం తెలుసుకోవాలి. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయి. ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. వారి అభిప్రాయాలు తెలుసుకోండి..

#Number 1: నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. మీరు జీవితాంతం స్వతంత్రంగా పని చేయలేరనే వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇతరుల మద్దతు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి. చాలా సమస్యలు దాదాపు ముగింపు దిశగా ఉన్నాయి. జీవితంలో కొత్తది త్వరలో ప్రారంభమవుతుంది. కొత్త స్థలం, స్థానం, స్నేహితుడు లేదా వ్యాపారంలో కొత్త పెట్టుబడి, కొత్త ఉద్యోగం, కొత్త ఇల్లు కావచ్చు. ఆస్తి వ్యవహారాలు, డబ్బు ప్రయోజనాలు మధ్యస్తంగా ఉంటాయి. కానీ వివాదాలు లేకుండా ఉంటాయి.
మాస్టర్‌ కలర్‌: బ్లూ, ఎల్లో
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 3
దానాలు: ఆశ్రమాలకు ఆహారం దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. మీ ఓవర్ ఫ్లెక్సిబుల్ స్వభావం అనేక సమస్యలకు దారి తీస్తుంది. మీరు ఎప్పుడైనా "వద్దు" అని చెప్పడం నేర్చుకోవాలి. ప్రజలు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించాలని గుర్తుంచుకోండి. ఎగుమతి దిగుమతి, వైద్యులు, ఇంజినీర్లు, బ్రోకర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, స్టాక్ మార్కెట్, భాగస్వామ్య సంస్థలు నిర్వహిస్తున్న వారు విజయాలు అందుకుంటారు. భాగస్వామి లేదా తోటివారి ద్వారా మానసికంగా బాధ పడతారు లేదా బాధ పెడతారు.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: పశువులకు తాగునీరు అందజేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. మీ సహోద్యోగుల సృజనాత్మక ఆలోచనలు, ప్రసంగం మీ యజమానిని, ఇంట్లో కుటుంబాన్ని ఆకర్షిస్తే ఉద్దేశాలను తెలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు అన్ని పరిస్థితులలో పని చేసేంత అనువుగా ఉంటారు కాబట్టి విజయం ఎంతో దూరంలో లేదు. డబ్బు వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడికి మంచి సమయం. ఉదయం చందనాన్ని నుదుటిపై ధరించండి.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: పేదలకు సన్‌ఫ్లవర్ ఆయిల్‌ దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఈ రోజు వారి లక్ష్యం కోసం నిరంతరం పని చేయాలి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరింత ఉన్నతంగా ఎదగాలి. మీ డబ్బు విషయాలలో ఎవరితోనూ ప్లాన్‌లను పంచుకోకండి. విద్యార్థులు అనుకూలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి. ఆకుకూరలు దానం చేయడం అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. క్రీడాకారులకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. మీరు కుటుంబం, స్నేహితునితో సమయం గడపలేనంత బిజీగా ఉంటారు.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: యాచకులకు పాదరక్షలు దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. సమస్యలు మరచిపోయి కొత్త సంబంధాలకు వెళ్లండి. భాగస్వామికి మీ భావాలను ప్రతిపాదించడానికి అనువైన రోజు. యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఆస్తిని విక్రయించడానికి, అధికారిక పత్రాలపై సంతకం చేయడానికి అలాగే పర్యటనకు వెళ్లడానికి గొప్ప రోజు. న్యూస్ యాంకర్లు, నటీనటులు, హస్తకళా కళాకారుడు, ఇంజినీర్లు అన్ని వైపుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. మీ నాయకత్వ పాత్ర చుట్టుపక్కల చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.
మాస్టర్‌ కలర్‌: టేల్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: అనాథ అశ్రమాల్లోని పిల్లలకు పచ్చని పండ్లు దానం చేయాలి

#Number 6: నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. సేల్స్, ఫుడ్, మార్కెటింగ్, ట్రేడింగ్, డిస్ట్రిబ్యూషన్, డిఫెన్స్, ఎయిర్‌లైన్స్, ఆభరణాలు, సౌందర్య సాధనాలు, గృహాలంకరణ రంగాలలో పని చేస్తుంటే ఈ రోజు సంతోషకరమైన ఫలితాలను అందుకుంటారు. ఈ రోజు మీకు కలిసి వస్తుంది కాబట్టి కలలను నెరవేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు మీరు అన్ని రకాల ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ ఆప్యాయత, మద్దతు శ్రేయస్సును తెస్తుంది. రోజు విలాసవంతంగా గడుపుతారు.
మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6, 9
దానాలు: పేదలకు తెలుపు ధాన్యాలు దానం చేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. మీ ఆచరణాత్మక ఆలోచనతో, సరైన సమయంలో ఏమి చేయాలో తెలుసుకోవడం ద్వారా మీరు యుద్ధంలో విజయం సాధిస్తారు. సంబంధాలు, పనితీరు, ఆర్థిక వృద్ధిని ఆస్వాదించే సమయం త్వరలో వస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందడానికి శివుడు, శని ఆచారాలను తప్పక ఆచరించాలి.
మాస్టర్‌ కలర్‌: ఎల్లో
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: అనాథలకు దుస్తులు పంపిణీ చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. పాత పనులను పూర్తి చేయడంలో జాప్యం కారణంగా మీరు వృత్తిపరమైన బాధ్యతలతో అధిక భారాన్ని అనుభవిస్తారు. చుట్టుపక్కల ప్రజలందరూ మీకు నమ్మకమైన అనుచరులు కాబట్టి నాయకత్వాన్ని ఆస్వాదించే సమయం. ఖాతాలను జాగ్రత్తగా చూసుకోవాలి. కుటుంబంతో సమయం గడపాలి. దయచేసి గ్రీన్ గార్డెన్ చుట్టూ కొంత సమయం గడపండి. ఈరోజు వీలైనన్ని బహిరంగ కార్యక్రమాలకు హాజరై మైక్ పట్టుకోవాలి.
మాస్టర్‌ కలర్‌: పర్పుల్‌
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పేదలకు గొడుగులు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. ఈ రోజు ఇంటి పని, ఇంటి బాధ్యతలను నెరవేర్చడం, పార్టీని నిర్వహించడం, సోషల్ వర్క్ చేయడం, స్టాక్స్ వ్యాపారం చేయడం, డెర్మటాలజిస్టులు, ఆడిటర్లు, సైంటిస్ట్ సర్జన్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు రివార్డ్‌లు, గుర్తింపును పొందేందుకు ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఈ రోజు వినోదం, శక్తి, ఉత్సాహంతో నిండి ఉంటుంది. ఆర్థిక లాభాలు, ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈరోజు సజావుగా జరిగే అవకాశం ఉంది.
మాస్టర్‌ కలర్‌: రెడ్‌, బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఇంట్లో పనిచేసే మహిళకు ఎరుపు కట్చీఫ్‌ దానం చేయాలి

మే 17వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు: పంకజ్ ఉధాస్, నుస్రత్ భరూచా, ప్రీతి గంగూలీ, శ్యామ్ రామ్సే, బి ఎస్ చంద్రశేఖర్
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు