NUMEROLOGY THE PEOPLE WHO BORN ON THESE DATES WILL BE BLESSED BY VENUS PLANET PJN GH SK
Numerology: ఈ తేదీల్లో పుట్టిన వారిపై శుక్రుడి అనుగ్రహం.. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం మీదే
ప్రతీకాత్మక చిత్రం
Numerology: న్యూమరాలజీ ప్రకారం.. పలు తేదీల్లో పుట్టిన వారిపై శుక్రుడి అనుగ్రహం ఉంటుంది. తద్వారా వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా విజయం సాధిస్తారు.
Numerology Today: న్యూమరాలజీ ప్రకారం... ఒక్కో తేదీలో పుట్టిన వారిపై ఒక్కో నంబర్ ప్రభావం ఉంటుంది. ఒక నెలలో వేర్వేరు తేదీల్లో పుట్టిన వారిపై.. ఒకటి నుంచి తొమ్మిది నంబర్ల ప్రభావం ఉంటుంది. వీటిలో నంబర్ 6 అనేది శుక్ర గ్రహానికి చెందినది. ఈ సంఖ్యతో జన్మించిన వ్యక్తులను పూర్తిగా శుక్ర గ్రహం పాలిస్తుంది. వీరు ఆదర్శవాదిగా ఉంటారు. సంతోషంగా ఉండటానికి శుక్ర గ్రహం ఉపయోగకరంగా ఉంటుందని భావించాలి. ప్రేమ, ఆప్యాయత, రిలేషన్షిప్ అనేవి వీరి జీవితంలో ప్రధాన ప్రాముఖ్యత కలిగి ఉంటాయి.
వీరి జీవితంలో వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు.. అంటే ఆడవాళ్లకు మగవాళ్లు, మగవాళ్లకు ఆడవాళ్లు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అలాంటి వ్యక్తులు ఇతరుల ప్రభావానికి దూరంగా ఉంటే, వారు వ్యక్తిత్వం, ఆకర్షణను కాపాడుకుంటారు. వారు సంగీతం వంటి కళాత్మక విషయాలతో కూడిన వృత్తిలో విజయం సాధిస్తారు. కళ, సాహిత్యం, థియేటర్, సౌందర్య ఉత్పత్తులు వంటివి వీరికి ఉత్తమ కెరీర్ ఆప్షన్లుగా నిలుస్తాయి. పరిస్థితులు లేదా బంధువుల కారణంగా వీరి జీవితంలో మంచి ప్రారంభం ఉండకపోవచ్చు, కానీ చివరికి వారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయం సాధిస్తారు. అయితే అన్ని విషయాల్లో వీరు క్లాసిక్ టేస్ట్‌తో కనిపిస్తారు. బెస్ట్ పర్పార్మెన్స్‌తో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తారు.
ఆస్తి, లాటరీ మొదలైన వాటి నుంచి ఊహించని డబ్బును పొందేందుకు జీవితం వారికి గొప్ప అవకాశాలను అందిస్తుంది. వృత్తులలో కీర్తి, ఆర్థిక స్థిరత్వం పొందుతారు. మంచి ఇమేజ్, సోషల్ స్టేటస్ సాధిస్తారు. ఇలాంటి హోదా కంటే ముందు వారు ప్రజలలో గౌరవం దక్కించుకుంటారు. ఇంటీరియర్ డిజైన్, ఫ్యాషన్ డిజైన్, బ్యూటీ ప్రొడక్ట్స్, పెయింటింగ్, మ్యూజిక్, యాక్టింగ్, క్రికెట్, హోటల్, జర్నలిజం, ట్రావెల్ అండ్ పబ్లిషింగ్‌లో పని చేస్తే, వీరు మంచి కీర్తిని పొందుతారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.