Home /News /astrology /

NUMEROLOGY SUGGESTIONS NUMEROLOGY TODAY 8TH AUGUST 2022 KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS GH PJN MKS

Numerology: న్యూమరాలజీ : సమయం మీ వ్యక్తిత్వానికి విరుద్ధంగా నడుస్తోంది..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 8వ తేదీ సోమవారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada | Visakhapatnam
(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 8వ తేదీ సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. గత ప్రయత్నాల ఫలితాలను పొందడంలో జాప్యం ఉంది. సమయం మీ వ్యక్తిత్వానికి విరుద్ధంగా నడుస్తోంది, మీరు సవాళ్లను ఎదర్కోవాల్సిన రోజు. రాజకీయ నాయకులు, క్రీడా తారలు ఆఫర్‌ను విస్మరించాలి, ఎందుకంటే ఇది కష్టమైన ఒప్పందంగా అనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలు ఆలస్యంగా సాగుతాయి. డబ్బు ప్రయోజనాలు మధ్యస్తంగా ఉంటాయి, కానీ వివాదాలు లేకుండా ఉంటాయి. మానసిక ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి లేట్ అవర్స్‌లో పని చేయకూడదని గుర్తుంచుకోండి. మెడికల్ అబ్బాయిలు, స్పోర్ట్స్ కెప్టెన్లు, సోలార్ బిజినెస్, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు ఈరోజు ప్రత్యేక ఆఫర్‌ని అందుకుంటారు. వ్యవసాయం, విద్యా రంగం లాభసాటిగా కనిపిస్తోంది.
మాస్టర్‌ కలర్‌: బ్లూ, ఎల్లో
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఆశ్రమాలకు గోధుమలు దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. మానసిక దృఢత్వాన్ని పెంచుకోవడానికి భోజనంలో వైట్‌ స్వీట్లను తీసుకోండి. మీ విధేయత, నిజాయితీ విజయానికి కారణం. ప్రజలు మీ అమాయకత్వాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి జ్ఞానాన్ని ఎక్కువగా ఉంచుకోవాలని గుర్తుంచుకోండి. ఎగుమతి దిగుమతి, వైద్యులు, ఇంజనీర్లు, బ్రోకర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, స్టాక్ మార్కెట్, భాగస్వామ్య సంస్థలు విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకునే అవకాశం ఉంది. భాగస్వామి లేదా సహచరుల నుంచి లభించే గౌరవాన్ని, మానసిక సంతృప్తిని ఆశీర్వాదంగా భావిస్తారు.
మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2
దానాలు: పశువులకు తాగునీరు అందజేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. తోటివారిపై అసూయను విస్మరించి, ముందుకు సాగండి. అపరిమిత శక్తి, అనంతమైన సామర్థ్యం కలిసి మిమ్మల్ని మీ కెరీర్‌లో అగ్రస్థానంలో ఉంచుతాయి. సృజనాత్మక ఆలోచనలు, మాయా ప్రసంగాలు మీ యజమానిని, ఇంట్లో కుటుంబాన్ని ఆకర్షిస్తాయి. మీరు అన్ని పరిస్థితులలో పని చేసేంత ఫ్లెక్సిబుల్‌గా ఉంటారు. కాబట్టి విజయం ఎంతో దూరంలో లేదు. మీరు ఈ రోజు డబ్బు, వస్తువులను నిర్వహించడంలో జాగ్రత్తగా ఉండాలి. క్రియేటివ్ వ్యక్తులు, పబ్లిక్ ఫిగర్స్ కీర్తిని పొందుతారు. క్రీడా కోచ్‌లు విజయం సాధిస్తారు, డబ్బును బహుమతిగా అందుకుంటారు. నిర్మాణం, వ్యవసాయంలో పెట్టుబడికి మంచి సమయం. ఉదయం చందనాన్ని నుదుటిపై ధరించండి.
మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌, బ్లూ
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 9
దానాలు: ఆలయానికి చెక్క వస్తువులు అందజేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. అన్ని డబ్బు సంపాదించే ఆలోచనలు ప్రారంభించబడాలి, ఎందుకంటే ఇది చాలా అనుకూలమైన సమయం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినండి. భవిష్యత్తు మెరుగుపరచడానికి క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని నిర్వహించండి. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులు మరింత ఉన్నతంగా ఎదగాలి. మీ డబ్బు విషయాలలో ఎవరితోనూ ప్లాన్‌లను పంచుకోకండి. విద్యార్థులు అనుకూలంగా ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి. ఆకు కూరలు దానం చేయడం అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది. క్రీడాకారులు, సర్జన్లకు ఆర్థిక లాభాలు ఎక్కువగా ఉంటాయి. పనితీరుకు ప్రశంసలు అందుకుంటారు. మీరు కుటుంబం, స్నేహితునితో సమయం గడపలేనంత బిజీగా ఉంటారు. కాబట్టి నిశ్శబ్దంగా వారి ఫిర్యాదులను వినండి. ఈ రోజు ధర్మం తప్పక పాటించాలి.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పేదలకు పాదరక్షలు దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. షార్ట్‌కట్‌లో డబ్బు సంపాదించడంపై ఆకర్షితులు కావడం మానేయండి. కష్టపడి పని చేయడానికి సిద్ధంగా ఉండండి. మీరు నాయకుడి పాత్రను పోషించే సందర్భాలలో ఎక్కువ సమయం గడుపుతారు. భాగస్వామికి మీ ఫీలింగ్స్‌ ప్రపోజ్‌ చేయడానికి అనువైన రోజు. యంత్రాలు కొనుగోలు చేయడానికి, ఆస్తిని విక్రయించడానికి, అధికారిక పత్రాలపై సంతకం చేయడానికి అలాగే పర్యటనకు వెళ్లడానికి గొప్ప రోజు. వార్తా వ్యాఖ్యాతలు, నటీనటులు, హ్యాండిక్రాఫ్ ఆర్టిస్ట్, ఇంజనీర్లు అన్ని అంశాల్లో ప్రశంసలు అందుకుంటారు. మిమ్ములను శత్రువుల ద్వారా ట్రాప్ చేసే ఉపాయం కనుక భోగాలను నివారించాలని గుర్తుంచుకోండి.
మాస్టర్‌ కలర్‌: ఆక్వా
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: అనాథాశ్రమంలోని పిల్లలకు పండ్లు దానం చేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడంలో సోషల్ నెట్‌వర్క్‌ను సద్వినియోగం చేసుకోండి. శుక్రుడి శక్తిని బలోపేతం చేయడానికి, మీరు శుక్ర పూజ చేయాలి. కొత్త అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృషి చేసే రోజు. మీరు లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తే సంతోషకరమైన ఫలితాలను ఇస్తుంది. ఈ రోజు మీ కలలను నెరవేర్చుకోవడానికి అనుకూల సమయం. ఈ రోజు మీరు అన్ని రకాల విలాసాలను ఆనందిస్తారు. కుటుంబ ఆప్యాయత, సపోర్ట్‌ శ్రేయస్సును తెస్తుంది. బాధ్యతలను నెరవేర్చడంలో ఈ రోజు గడుపుతారు. రిటైలర్లు, ఉపాధ్యాయులు, ఆభరణాలు, సౌందర్య సాధనాల వ్యాపారం, డిజైనర్లు, న్యాయవాదులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ నాయకులు, నటీనటులు ప్రత్యేక అప్రైజల్‌, స్థిరత్వాన్ని ఆస్వాదిస్తారు.
మాస్టర్‌ కలర్‌: స్కై బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6, 9
దానాలు: ఇంట్లో పనిచేసే మహిళకు గాజులు అందజేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తూ కేతు మంత్రాన్ని జపించండి. మీరు మీ వ్యక్తులను తెలివిగా ఎన్నుకోవాలి. మీ బాధ్యతను ఇతరులకు అప్పగించకుండా ఉండాలి. త్వరలో సంబంధాలు, పనితీరు, ఆర్థిక వృద్ధిని ఆస్వాదించే సమయం వస్తుంది. ఈరోజు వ్యాపారంలో బంధువులు, స్నేహితులతో జాగ్రత్త వహించండి. క్రీడాకారులు తదుపరి వివాదాలను నివారించడానికి పోటీదారులకు దూరంగా ఉండండి. ఆపోజిట్‌ జెండర్‌ అదృష్టాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. భగవంతుని ఆశీర్వాదం పొందడానికి శివుడికి పూజలు చేయాలి.
మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 3
దానాలు: పసుపు రంగులో వండిన ఆహారం లేదా ధాన్యాలు దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు పాత అప్పులు తీరే అవకాశం ఉంది. ఈ రోజు చాలా కార్యకలాపాలు ఒకదాని తర్వాత ఒకటి జరుగుతాయి. చుట్టూ ఉన్న ప్రజలందరూ మీకు నమ్మకమైన అనుచరులు కాబట్టి నాయకత్వాన్ని ఆస్వాదించే సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ రోజు కుటుంబ సభ్యులతో గడపాలి. దయచేసి గ్రీన్ గార్డెన్, వాటర్ ప్లాంట్ల చుట్టూ కొంత సమయం గడపండి. కెరీర్‌కు సంబంధించిన నిర్ణయాలు భవిష్యత్తు కోసం కచ్చితంగా సరిపోతాయి. మీ మెంటర్ మార్గదర్శకత్వం తీసుకోండి.
మాస్టర్‌ కలర్‌: పర్పుల్‌
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పేదలకు గొడుగులు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. వృత్తిలో పేరు, కీర్తిని పొందేందుకు సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్‌ల ప్రయోజనాన్ని గుర్తుంచుకోండి. బ్యాంకర్లు, చెఫ్‌లు, హోటల్‌ వ్యాపారులు, వైద్యులు, ఫార్మసిస్ట్, సర్జన్, రాజకీయ నాయకులు, క్రీడాకారులు రివార్డులు, గుర్తింపును ఆస్వాదిస్తారు. ఈ రోజు కీర్తి, వినోదంతో నిండి ఉంటుంది. మీ లక్ష్యం వైపు ప్రయాణించడానిక శక్తి, ఉత్సాహాన్ని ఒక దిశలో ఉపయోగించండి. ఆర్థిక లాభాలు, ఆస్తి రిజిస్ట్రేషన్లు ఈరోజు సజావుగా జరిగే అవకాశం ఉంది. పరస్పర విశ్వాసం కారణంగా సంబంధం, దృఢంగా మారుతుంది.
మాస్టర్‌ కలర్‌: బ్రౌన్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు ఎర్ర కందిపప్పును దానం చేయాలి

ఆగస్టు 8వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : కపిల్ సిబల్, ఫహద్ ఫాసిల్, అబు అజ్మీ, దాదా కొండ్కే, పెంటల్, దిలీప్ సర్దేశాయ్, రాజీవ్ మహిరిషి
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు