Home /News /astrology /

NUMEROLOGY SUGGESTIONS NUMEROLOGY TODAY 6TH JULY 2022 KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS GH PJN MKS

Numerology: (జులై 6) న్యూమరాలజీ : లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి అనుకూల సమయం..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం జులై 6వ తేదీ బుధవారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 6వ తేదీ బుధవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. సంపన్న జీవనశైలి భవిష్యత్తుకు ఇబ్బందిని కలిగిస్తుంది, మీ ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రస్తుత పనితో సంతృప్తి చెందాలి. చట్టపరమైన అంశాలు ఒత్తిడిని పెంచవచ్చు, కానీ పాత కనెక్షన్‌ల సపోర్ట్‌ను తప్పనిసరిగా వినియోగించుకోవాలి. మధ్యాహ్న భోజనంలో పసుపు రంగు ఆహార పదార్థాలు తినండి. దయచేసి ఆకర్షణను పెంచడానికి తోలు ఉత్పత్తులను ఉపయోగించకండి. వ్యక్తిగత జీవితం కూడా అసంతృప్తిగా అనిపించినా ఓపిక పట్టాలని గుర్తుంచుకోండి.
మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: ఆశ్రమాలకు పసుపు రంగు పండ్లు అందజేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. అందంగా ఉండే ఏదైనా పని, వ్యక్తిగత జీవితంలో సంతృప్తిని కలిగిస్తుంది. వ్యాపార కట్టుబాట్లు అడ్డంకులు ఎదుర్కొంటారు. భాగస్వామ్యానికి సమయం ఆసన్నమైంది. రాజకీయ నాయకులు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి, ప్రయాణాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు, గృహిణులు ప్రశంసలు అందుకుంటారు.
మాస్టర్‌ కలర్‌: స్కైబ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 2, 6
దానాలు: పేదలకు వైట్‌ స్వీట్స్‌ దానం చేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. అన్ని గృహ బాధ్యతలను నెరవేర్చడానికి, కుటుంబంతో ఆనందించడానికి ఇది గొప్ప రోజు. మీ మార్గంలో కొత్త రిలేషన్‌ ఏర్పడే సూచనలు ఉన్నాయి. అదృష్టం అనుకూలిస్తుంది కానీ భవిష్యత్తుకు మేలు చేస్తుంది. రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు, సంగీతకారులు, డిజైనర్లు, న్యూస్ యాంకర్, నటులు, డ్యాన్సర్లు, రెస్టారెంట్ల యజమానులు, గృహిణులు, హోటల్ వ్యాపారులు, రచయితలు కెరీర్ వృద్ధికి సంబంధించి ప్రత్యేక ప్రకటన అందుకునే అవకాశం ఉంది.
మాస్టర్‌ కలర్‌: రెడ్‌, బ్లూ
లక్కీ డే: గురువారం
లక్కీ నంబర్‌: 3, 1
దానాలు: స్థానికులకు అరటి పండ్లు దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. ఈ రోజు మీ వ్యక్తిత్వంలో పెద్ద మార్పు ఉంది, ఇది దేశంపై మీకు మరింత బాధ్యత పెంచుతుంది. మీరు సమాజం కోసం పని చేయాలని, సేవ చేయాలని భావిస్తారు. ఆహారాన్ని దానం చేయడం ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. నిర్మాణం, యంత్రాలు, లోహాలు, సాఫ్ట్‌వేర్, బ్రోకర్లు ఈరోజు ఒప్పందంపై సంతకం చేయకుండా ఉండాలి. అద్భుతమైన వృత్తి జీవితం, గర్వించదగిన తల్లిదండ్రులు అనే అందమైన అనుభవం పొందుతారు.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9
దానాలు: పేదలకు ఆహారం, దుస్తులు దానం చేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మీ భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించడంపై నియంత్రణ కలిగి ఉండండి. రివార్డ్‌లను స్వీకరించడానికి, పనితీరుకు గుర్తింపు పొందడానికి అనుకూలమైన రోజు. ఆస్తి లేదా మెషినరీ పెట్టుబడులు పెట్టడానికి డబ్బు ప్రయోజనాలు త్వరలో వస్తాయి. క్రీడాకారుడు, చలనచిత్ర దర్శకులు, నగల వ్యాపారులు, ఫైనాన్స్‌లు, ఎగుమతిదారులు, రిటైల్ వ్యాపారవేత్తలు, ప్రయాణికులు ఉత్తమ ఫలితాలను పొందుతారు. సమావేశాల్లో అదృష్టాన్ని పెంచుకోవడానికి ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించాలి. ఈ రోజు జీవితం మీకు నచ్చిన బహుమతులను అందిస్తుంది. లవ్‌ ప్రపోజ్‌ చేయడానికి అనుకూల సమయం.
మాస్టర్‌ కలర్‌: సీ గ్రీన్‌
లక్కీ డే: బుధవారం
లక్కీ నంబర్‌: 5
దానాలు: అనాథాశ్రమాలకు పాలు అందజేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఈరోజు లక్ష్మీ దేవి ఆచారాలను ఆచరించి, ఆమె ఆశీర్వాదాలను పొందండి. మిమ్మల్ని విస్మరించిన వ్యక్తుల నుంచి పూర్తి సపోర్ట్ అందుకుంటారు. అవకాశాలు, లగ్జరీ, శ్రేయస్సు, గౌరవం, అధికారాన్ని ఆస్వాదించడానికి ఒక రోజు. తల్లిదండ్రులు పిల్లల సపోర్ట్‌ అందుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల ఆశీర్వాదం పొందుతారు. మీరు అందరినీ సంతోషపెట్టలేరు కాబట్టి మీ భుజంపై ఎక్కువ బాధ్యతలు తీసుకోకూడదని గుర్తుంచుకోండి. జ్యువెలర్స్, నటీనటులు, జాకీలు, వైద్యులు నైపుణ్యాలను ప్రదర్శించవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం తండ్రులు మార్గనిర్దేశం చేయవచ్చు, అది వారి జీవితానికి అనుకూలంగా ఉంటుంది.
మాస్టర్‌ కలర్‌: బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: ఆశ్రమాలకు వెసెల్స్‌ అందజేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఈరోజు మోసం, నమ్మకద్రోహం పట్ల జాగ్రత్త వహించండి. దయచేసి పని ప్రదేశంలో బాస్ లేదా పెద్దలతో వాగ్వాదాలకు దూరంగా ఉండండి. మీ నిజాయితీకి ప్రతిఫలంగా రిలేషన్‌ నమ్మకం, గౌరవాన్ని ఇస్తుంది. ఈ రోజు డబ్బుకు సంబంధించిన మోసాలకు గురయ్యే అవకాశం ఉంది, ఈరోజు అన్ని పత్రాలను సమీక్షించాలి. ప్రభుత్వ టెండర్లు, రియల్ ఎస్టేట్, పాఠశాలలు, ఇంటీరియర్స్, గ్రెయిన్స్‌లో పని చేసే వారికి ఇది గొప్ప రోజు. మీరు ఎమోషనల్‌గా ఉండనంత కాలం వ్యాపార సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి.
మాస్టర్‌ కలర్‌: ఎల్లో, బ్లూ
లక్కీ డే: సోమవారం
లక్కీ నంబర్‌: 7
దానాలు: పసుపు రంగు వస్త్రం దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. రోజు ప్రారంభించడానికి శని, శివుని అన్ని ఆచారాలను నిర్వహించండి. వ్యాపారంలో లావాదేవీలు అత్యంత విజయవంతమవుతాయి. ఆరోగ్యం, కుటుంబ సభ్యులకు బాగా సమయం కేటాయించాలని గుర్తుంచుకోండి. ఒప్పందాలు లేదా ఇంటర్వ్యూలకు తప్పనిసరిగా హాజరు కావాలి. కుటుంబంతో గడపడం వల్ల ఈరోజు ఆస్తి వస్తుంది. దయచేసి ఈరోజు బయట తినడం మానుకోండి. మనీ బ్యాలెన్స్, మెచ్యూర్‌ లవ్‌ను సాధించడానికి ఈ రోజు అనుకూలం.
మాస్టర్‌ కలర్‌: సీ బ్లూ
లక్కీ డే: శుక్రవారం
లక్కీ నంబర్‌: 6
దానాలు: పశువులకు పచ్చని ధాన్యాలు అందజేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. గ్లామర్ పరిశ్రమకు చెందిన కళాకారుడు, వైద్య నిపుణులు ఈ రోజు పూర్తిగా పని పెరుగుదల, అభివృద్ధిని ఆస్వాదిస్తారు. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో అధికారాన్ని పొందడానికి పాత స్నేహితులు లేదా సహచరులను సంప్రదించడానికి ఒక అద్భుతమైన రోజు వేచి ఉంది. రోజు ప్రారంభించడానికి ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. మెటల్‌తో డీల్ చేసే వ్యక్తులు భవిష్యత్తులో లాభదాయకంగా ఉండేలా బాధ్యతలు తీసుకోవడానికి అంగీకరించాలి.
మాస్టర్‌ కలర్‌: రెడ్‌
లక్కీ డే: మంగళవారం
లక్కీ నంబర్‌: 9, 6
దానాలు: పేదలకు నారింజ పండ్లు దానం చేయాలి

జులై 6వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : రణవీర్ సింగ్, 14వ దలైలామా, సిద్ధాంత్ కపూర్, సచిన్ బన్సల్, శ్వేతా త్రిపాఠి
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు