Home /News /astrology /

NUMEROLOGY SUGGESTIONS NUMEROLOGY TODAY 4TH JULY 2022 KNOW YOUR LUCKY NUMBER OTHER DETAILS GH PJN MKS

Numerology: (జులై 4) న్యూమరాలజీ : ఇవాళ ఆకస్మిక ధనలాభం పొందుతారు..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం జులై 4వ తేదీ సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)
పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 4వ తేదీ సోమవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. కొత్త ఆఫర్‌లను తిరస్కరించండి. ముందుగా పాత ప్రాజెక్ట్‌లను పూర్తి చేయండి. భాగస్వామ్య ఒప్పందాలకు దూరంగా ఉంటే మంచింది. యంత్రాలు, ప్రభుత్వ భూముల కొనుగోలులో మీ పెట్టుబడి రాబడిగా మారుతుంది. యంత్రాలు, సౌందర్య సాధనాలు, హస్తకళల వ్యాపారం, నిర్మాణం, వ్యవసాయం, పుస్తకాలు, మందులు, ఫైనాన్స్ మార్కెటింగ్ రంగాల వారు లాభాలు గడిస్తారు. ఉపాధ్యాయులు, కోచ్‌ల నుండి విద్యార్థులకు ప్రశంసలు అందుతాయి. ఈరోజు శివుని మంత్రంతో సూర్య భగవానుణ్ని పూజిస్తే మేలు.
మాస్టర్ కలర్: పసుపు
లక్కీ డే: ఆదివారం
లక్కీ నంబర్ : 7
దానాలు : ఆశ్రమంలో పసుపు బియ్యం దానం చేయండి.

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీనే మీకు వ్యక్తిగత ఆస్తి కాబట్టి ఎక్కడ ఇరుక్కుపోయారో అక్కడ కాస్త వంగి ఉండండి. సీనియర్‌లకు రహస్య సమాచారాన్ని తెలియజేయడానికి అనుకూల సమయం. చట్టపరమైన కట్టుబాట్లు సజావుగా నెరవేరుతాయి. మీ గౌరవాన్ని దెబ్బతీసే వ్యక్తిని కలిసేఉంటారు. ప్రభుత్వ ఒప్పందాలను కుదుర్చుకోడానికి పాత సంబంధాలను ఉపయోగించుకునే రోజు ఇది. ఎగుమతి దిగుమతులు, రసాయనాలు, కారకులు, బిల్డర్లు, రాజకీయ నాయకులు కొత్త విజయాలను అందుకుంటారు.
మాస్టర్ కలర్ : స్కై బ్లూ
లక్కీ డే : సోమవారం
లక్కీ నంబర్ : 6
దానాలు : దేవాలయంలో పాలు లేదా నీళ్లు దానం చేయండి.

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. డబ్బు సంపాదించే మీ ఆలోచనలు ఇవాళ కార్యరూపం దాల్చాలనని గుర్తుంచుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఒప్పందాల మొదలుకు ఇది మంచి రోజు. రాజకీయ నాయకులు తమ ప్రతిభ, విజ్ఞానం, నైపుణ్యాలు ప్రదర్శించడానికి అనువుగా ఉంది. ఆఫీసులో రిక్రూట్‌మెంట్ మీకు స్వాగతం పలుకుతుంది. విక్రయాలు, మార్కెటింగ్‌కు చెందిన వ్యక్తులు జ్ఞానంతో పాటు ప్రసంగంతోనూ ఆకట్టుకుంటారు. ఈరోజు తీసుకునే నిర్ణయాలన్నీ ప్రత్యేకంగా అమ్మకాలు, రాజకీయ నాయకులు, సంగీతకారులు, ఎలక్ట్రానిక్ మీడియా, ఆటోమొబైల్ వ్యాపారులు, డాన్స్ మాస్టర్లకు అనుకూలంగా మారతాయి. ప్రేమలో ఉన్నవారు తమ భావాలను బహిరంగంగా మార్చుకోవాలి. గురు నామాన్ని జపిస్తూ, పసుపు వస్త్రాలు ధరిస్తే అదృష్టం పెరుగుతుంది.
మాస్టర్ కలర్: యెల్లో, ఆరెంజ్
లక్కీ డే : గురువారం
లక్కీ నంబర్ : 3, 1
దానాలు : మహిళా సహాయకులకు కుంకుమ దానం చేయండి.

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. రాజకీయాలు, యంత్రాలు, వ్యవసాయం, తయారీ, హస్తకళలు, దర్శకత్వం, కోచింగ్, క్రీడా వస్తువులు, బ్యాంకింగ్, చమురు వ్యాపారంలో డబ్బు సంపాదనకు అనుకూలంగా ఉంది. భవిష్యత్తులో పనికొచ్చే నిర్ణయాల కోసం మీరు క్రమశిక్షణ, పరిపూర్ణత పాటించాలి. రాజకీయాలు, వినోద రంగంలో ఉన్నవారికి ఇది చాలా కష్టమైన రోజు. వైద్య, వ్యవసాయ రంగాల్లోని వారికి సానుకూల మార్పులు వస్తాయి. విద్యార్థులు గ్రూప్ స్టడీ చేయడం లేదా ఉన్నత ఎదుగుదల కోసం తోటివారి మద్దతు తీసుకుంటారు. ఈరోజు నాన్ వెజ్ తినడం మానుకోండి.
మాస్టర్ కలర్ : బ్లూ
లక్కీ డే : శనివారం
లక్కీ నంబర్ : 9
దానాలు: యాచకుడికి పచ్చి అరటిపండ్లు దానం చేయండి.

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. గణేశుడిని ఆరాధనతో మీరు రోజును ప్రారంభించండి. క్రమశిక్షణ పాటించకుంటే అవకాశాలను కోల్పోతారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం చుట్టుపక్కల వారందరినీ ఆకట్టుకుంటుంది కానీ విధేయతను కాపాడుతుంది. బ్యాంకర్లు, నటులు, రిటైలర్లు, పంపిణీదారులు, క్రీడాకారులు గుర్తింపు, ప్రయోజనాలను పొందే రోజు ఇది. సేల్స్, స్పోర్ట్స్ లో ఉన్నవారికి ఫాస్ట్ మూమెంట్ అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు తమ విద్యావిషయక విజయాలను కూడా ఆనందిస్తారు.
మాస్టర్ కలర్ : టీల్
లక్కీ డే : బుధవారం
లక్కీ నంబర్ : 5
దానాలు : ఆకు కూరలు దానం చేయండి.

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగంలో పూర్తి నిజాయితీగా ఉండటం వల్ల చాలా మంది తమ ఎదుగుదల కోసం మీపై ఆధారపడతారు. వివాహం కోసం ప్రతిపాదించడానికి, ఒప్పందంపై సంతకం చేయడానికి, విలాసాలను ఆస్వాదించడానికి, శ్రేయస్సును పొందడానికి, ప్రయాణాలకు వెళ్లడానికి, మాస్ మీడియాను ఎదుర్కోవడానికి, విజయాన్ని జరుపుకోవడానికి ఇది అనువైన రోజు. కుటుంబంతో గడపడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి గొప్ప రోజు. వీసా కోసం వేచి ఉంటే మీరు సానుకూలత ఏర్పడుతుంది. కొత్తగా ల్యాండ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని చూస్తున్న వారు ముందుకు సాగవచ్చు.
మాస్టర్ కలర్ : టీల్
లక్కీ డే : శుక్రవారం
లక్కీ నంబర్ : 6
దానాలు: పేదలకు తెల్లటి తీపి పదార్థాలు దానం చేయండి.

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. ఇవాళ నమ్మకద్రోహం జరిగే అవకాశం ఉన్నందున సామాజికవర్గం పట్ల జాగ్రత్త వహించండి. చాలా చిక్కులు, డబ్బు పరమైన పరిష్కారాల తర్వాతే న్యాయపరమైన దావాలు గెలుస్తారు. పెద్దలు, పూర్వీకుల ఆశీర్వాదాలతోనే క్రీడలు, వ్యాపార ఒప్పందాలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షలలో ఉన్నత స్థాయి విజయం సాధించగలరు. గురు మంత్రాన్ని తప్పక పఠించాలి. మృదువుగా, దయతో మాట్లాడితే ఇవాళ పనులు పూర్తవుతాయి. పొగాకు లేదా మద్యానికి దూరంగా ఉండటం నేర్చుకోవాలి, సాధారణ వెజ్ ఆహారాన్ని స్వీకరించాలి.
మాస్టర్ కలర్ : ఆరెంజ్
లక్కీ డే : సోమవారం
లక్కీ నంబర్ : 7
దానాలు : ఆలయంలో పచ్చి పసుపును దానం చేయండి.

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. పరిసరాలలో పచ్చని మొక్కలకు నీరు పెట్టండి. దీర్ఘకాలిక లక్ష్యాలు పూర్తి కావడానికి మీరు ఇంకొంచెం నడవాల్సినట్లు కనిపిస్తోంది. ఈలోపు స్వల్పకాలిక లక్ష్యాలు సవాళ్లను ఎదుర్కొంటాయి. ఈరోజు లాభాలు పొందేందుకు గంటల తరబడి శ్రమించాల్సి ఉంటుంది కానీ రోజు చివరి నాటికి మీరు చాలా డబ్బు సంపాదిస్తారు. మీరు జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఎక్కువ సమయం వెచ్చిస్తారు. ఉన్నత స్థాయి వైద్యులు సేవలందిస్తూ ప్రశంసలు అందుకుంటారు. ప్రజాప్రతినిధులు సాయంత్రం నాటికి డబ్బు ప్రయోజనాలను పొందుతారు. విరాళాలు, వ్యాయామంలో సమయాన్ని వెచ్చించండి.
మాస్టర్ కలర్ : సీ బ్లూ
లక్కీ డే : శుక్రవారం
లక్కీ నంబర్ : 6
దానాలు : యాచకులకు సిట్రస్ పండ్లను దానం చేయండి.

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీకు అండగా, విధేయులుగా ఉన్నందుకు స్నేహితులు, కుటుంబీకులకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆకస్మిక ధనం లేదా వృద్ధిని చూస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అందని రోజు. క్రీడాకారులు, విద్యార్థులు సంతకం చేసే ముందు పూర్తిగా అన్ని పత్రాలను పరిశీలించాలి. వైద్యులు, వైద్య నిపుణులు, పబ్లిక్ స్పీకర్లు, చెఫ్‌లు, మీడియా వ్యక్తులు, నటులు, CA, ఉపాధ్యాయులు, క్రీడాకారుడు, హోటల్ వ్యాపారులు ఊహించని అదృష్టాన్ని ఆస్వాదించడానికి వీలుంది.
మాస్టర్ కలర్ : రెడ్
లక్కీ డే : మంగళవారం
లక్కీ నంబర్ : 3, 9
దానాలు : ఇంటి సహాయకురాలికి ఎర్రటి గాజులు విరాళంగా ఇవ్వండి.

జూలై 4న జన్మించిన ప్రముఖులు: నీనా గుప్తా, అల్లూరి సీతారామ రాజు, గుల్జారీలాల్ నందా, సైరస్ మిస్త్రీ, కొణిజేటి రోశయ్య.
Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

తదుపరి వార్తలు