హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: న్యూమరాలజీ : చాలా అవకాశాలు మీ తలుపు తడతాయి..

Numerology: న్యూమరాలజీ : చాలా అవకాశాలు మీ తలుపు తడతాయి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 2వ తేదీ మంగళవారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం ఆగస్టు 2వ తేదీ మంగళవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదాలు తీసుకుంటూ ఉండండి. మీ పరిపక్వత మెరుగుపరచడంలో అవి సహాయపడతాయి. ఎందుకంటే మీ పనితీరును ప్రభావితం చేయడానికి ఇతరులు సృష్టించిన సంక్లిష్టతలు కూడా కారణాలుగా ఉన్నాయి. ఓపికగా, జాగ్రత్తగా ఉండండి. ఆఫీసులో సీనియర్‌లతో చేతులు కలపితే సక్సెస్ వస్తుంది. ఖాతాదారులు, బంధువులతో ఆరోగ్యకరమైన సంబంధాలు, నమ్మకాన్ని పెంపొందించుకోడానికి ఇది అనుకూలమైన రోజు. వ్యక్తిగత జీవితంలో లౌక్యంగా ఉండాలి. కొత్త పెట్టుబడులు ఫలించి రాబడి పెరుగుతుంది.

మాస్టర్ కలర్ : లేత గోధుమ

లక్కీ డే : ఆదివారం

లక్కీ నంబర్ : 1

దానం : పసుపు ధాన్యాలను పశువులకు లేదా పేదలకు దానం చేయండి.

#Number 2 : నెలలో 2, 11, 20, 29వ తేదీలలో జన్మించినవారికి 2 వస్తుంది. ఈ రోజు పరిస్థితులకు మీ ఆత్మగౌరవాన్ని రాజీ పడనివ్వకండి. ఇది భావోద్వేగాలతో నిండిన రోజు. దేవుడు, కుటుంబ పెద్దల ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు తెలుపుతారు. మాస్ కమ్యూనికేషన్, షాపింగ్‌తో ప్రారంభించదగ్గ అందమైన రోజిది. కొత్త ఒప్పందాలకు అనుకూలంగా ఉంది. దౌత్యపరమైన కమ్యూనికేషన్ ఈరోజు కీలక పాత్ర పోషిస్తుంది. ప్రియమైనవారితో భావోద్వేగ సమయాన్ని గడుపుతారు. కలలు నెరవేరే అవకాశాలున్నాయి కాబట్టి మీ రోజును విశ్రాంతి కార్యకలాపాలతో ముగించడానికి సిద్ధంగా ఉండండి. తెల్లని దుస్తులు ధరిస్తే కలిసొస్తుంది.

మాస్టర్ కలర్ : క్రీమ్

లక్కీ డే : సోమవారం

లక్కీ నంబర్ : 2

దానం : ఆలయంలో వెండి నాణెం దానం చేయండి.

#Number 3 : నెలలో 3, 12, 22, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం 3 నంబర్ వస్తుంది. అరటి చెట్టును నాటడం, చక్కెర కలిపిన నీటిని గురుదేవునికి అందించడం ఆశీర్వాదకరం. మీ స్నేహితులను ఆకట్టుకోవడానికి ఇది ఒక గొప్ప రోజు. బోధన, పబ్లిక్ స్పీకింగ్, డ్యాన్స్, వంట, డిజైనింగ్, నటన, మార్కెటింగ్ లేదా ఆడిటింగ్‌ రంగాల వారు ప్రతిభను ప్రదర్శించే సమయం. ఫైనాన్స్, యోగా రంగం, విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది.

మాస్టర్ కలర్ : ఆరెంజ్

లక్కీ డే : గురువారం

లక్కీ నంబర్స్ : 3, 9

దానం : పశువులు లేక పేదలకు అరటిపళ్లు దానం చేయండి.

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. భవిష్యత్తు వ్యూహాలతో ఈరోజంతా తీరికలేని పనులుంటాయి. పత్రాల పట్ల జాగ్రత్త వహించండి. మెషీన్లను ఆపరేట్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ సమయం డబ్బు సంపాదించే ఆలోచనలు, వ్యాయామం, ఆడిటింగ్, కౌన్సెలింగ్, మార్కెటింగ్‌లో గడపాలి. తయారీ, యంత్రాలు, ఎలక్ట్రానిక్స్, వైద్యం, నటన, క్రీడలు మరియు రాజకీయాలలో మీరుంటే కొత్త సహకారం లేదా భాగస్వాముల కోసం వెళ్లాలి. వ్యక్తిగత సంబంధాలు ఆరోగ్యంగా ఉంటాయి. స్నేహితులతో ప్రశాంత సమయాన్ని గడుపుతారు. స్వీట్లు తినడం తప్పనిసరి.

మాస్టర్ కలర్ : బ్లూ

లక్కీ డే : మంగళవారం

లక్కీ నంబర్ : 9

దానం : ఆశ్రమాలలో దుస్తులు దానం చేయండి.

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. ప్రయాణం, పార్టీలో ఆనందం పొందుతారు. ఇతరుల ఆధిపత్యాన్ని కంట్రోల్ చేయడానికి మీరు బలంగా ఉండాలి. ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు ఒక రోజు వరకు తిరిగి వస్తాయి. ఆక్వా ధరించడం సమావేశాలలో సహాయపడుతుంది. ఇంటర్వ్యూలు, ప్రపోజల్స్ కోసం ఆనందంగా బయటకు వెళ్లండి. జీవనశైలిలో క్రమశిక్షణ తప్పనిసరి. మీరు ఈరోజు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత భాగస్వాముల విశ్వాసాన్ని పొందగలుగుతారు, తద్వారా జీవితాన్ని మధురంగా ​​మార్చుకుంటారు. ఈరోజు పాత స్నేహితుడిని కలుస్తారు.

మాస్టర్ కలర్ : ఆక్వా

లక్కీ డే : బుధవారం

లక్కీ నంబర్ : 5

దానం : అనాథలకు పచ్చని పండ్లను దానం చేయండి.

#Number 6 : నెలలో 6, 15, 24 తేదీలలో జన్మించిన వారిపై 6 ప్రభావం ఉంటుంది. మీరు కుటుంబానికి, బంధువులకు ఇష్టమైనవారు కాబట్టి ఈ రోజు అన్ని కట్టుబాట్లు, బాధ్యతలను నెరవేర్చడానికి కీలకమైన రోజు. చాలా అవకాశాలు మీ తలుపు తట్టబోతున్నాయి. కుటుంబ మద్దతును ఆశీర్వాదంగా భావిస్తారు. ఆఫీసులో ప్రమోషన్ల కోసం భాగస్వామి, మదింపుతో గడిపే సమయం. వ్యాపారంలో సక్సెస్ సాధించే జ్ఞానం మీకుంది. స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. శృంగారం సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. సోషల్ నెట్‌వర్క్ వనరులను, సద్భావనను ఉపయోగించడంలో సహాయం చేస్తుంది.

మాస్టర్ కలర్ : పీచ్

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్ : 6

దానం : తెల్లని స్వీట్లను యాచకులు లేదా పిల్లలకు దానం చేయండి.

#Number 7 : నెలలో 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారికి 7 వస్తుంది. ఆఫీసులో వ్యక్తులను గుడ్డిగా విశ్వసించడం మానుకోవాలి. ఒక ఎమోషనల్ కన్ఫ్యూజన్ మీ రోజును గందరగోళంగా మార్చుతుంది. మీ బాధ్యతలను పెంచుకోవడం మానుకోండి. స్టాక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. వైద్యం, లా ప్రాక్టీస్, మెడికల్ ఫీల్డ్, మీడియా, ఎగుమతి దిగుమతులు, రాజకీయ రంగాల్లోని ఆడవారికి ఇది లక్కీ డే. ఆపోజిట్ జెండర్ సూచనలను అంగీకరించండి. అకౌంట్ల నిర్వహణ, వ్యాపార ఒప్పందాలు ఆలస్యం అవుతాయి. పెళ్లి సంబంధాలు కుదురుతాయి. శివాలయాన్ని సందర్శించి, అభిషేకం చేయడం ద్వారా రోజు విజయవంతంగా ముగుస్తుంది.

మాస్టర్ కలర్ : సీ గ్రీన్

లక్కీ డే : గురువారం

లక్కీ నంబర్ : 7

దానం : ఆలయంలో రాగి లేదా కాంస్య లోహాన్ని దానం చేయండి.

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. వ్యాపారంలో రిస్క్ తీసుకునే మీ సామర్థ్యం ఈ రోజు చాలా ఎక్కువగా ఉంది. కలలను వాస్తవికతగా మార్చడానికి ఇవాళ లక్కీ డే. ధన బలంతో చట్టపరమైన కేసులు పరిష్కరించుకుంటారు. వ్యాపార ఒప్పందాలలో వశ్యత కీలకం, అహంకారాన్ని పక్కన పెట్టాలి. హాస్య స్వభావంతో మీ భాగస్వామి ఆకట్టుకుంటారు. డబ్బు లావాదేవీల మధ్య రోజంతా బిజీగా ఉంటారు, అందువల్ల రోజు మంచి సంతృప్తితో ముగుస్తుంది. శాఖా హారంతోనే ఆరోగ్యం. వృద్ధాశ్రమంలో దానధర్మాలు తప్పనిసరి.

మాస్టర్ కలర్ : సీ బ్లూ

లక్కీ డే : శనివారం

లక్కీ నంబర్ : 6

దానం : అవసరమైన వారికి పాదరక్షలను దానం చేయండి.

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. అంగారకుడి అనుకూలతతో డాక్టర్లు, ఇంజనీర్లు తమ బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే రోజు ఇది. కొత్త ఆఫర్‌ను అంగీకరించేందుకు, ఉద్యోగం లేదా కొత్త సంబంధంలోకి మారేందుకు, ఇంటర్వ్యూలకు హాజరయ్యేందుకు ఇవాళ లక్కీ డే. ప్రేమికులు తమ భాగస్వామిని ప్రపోజ్ చేయడానికి అనుకూలం. వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు సజావుగా సాగుతాయి. రాజకీయాలు, మీడియా, ఫైనాన్స్ లేదా విద్యా పరిశ్రమలోని వ్యక్తులు భారీ వృద్ధిని చూస్తారు. డిజైనింగ్ పరిశ్రమలో ఉన్న వ్యక్తులు ఇంటర్వ్యూ లేదా పోటీ పరీక్షలకు వెళ్లాలి. తల్లిదండ్రులు ఈరోజు తమ పిల్లలను చూసి గర్వపడతారు.

మాస్టర్ కలర్ : బ్రౌన్

లక్కీ డే : మంగళవారం

లక్కీ నంబర్ : 9

దానం : ఆలయంలో బ్రౌన్ రైస్ దానం చేయండి.

ఆగస్ట్ 2న జన్మించిన ప్రముఖులు: విజయ్ రూపానీ, సిద్ధార్థ రాయ్ కపూర్, పింగళి వెంకయ్య, సుష్మా రెడ్డి, రమేష్ బైస్.

First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు