హోమ్ /వార్తలు /కాలజ్ఞానం /

Numerology: న్యూమరాలజీ : ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి..

Numerology: న్యూమరాలజీ : ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి..

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

నేటి న్యూమరాలజీ (ప్రతీకాత్మక చిత్రం)

న్యూమరాలజీ ప్రకారం జులై 27వ తేదీ బుధవారం ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

(పూజా జైన్ -న్యూమరాలజిస్ట్, ఫోన్ నెం: +91 90526 47890)

పుట్టిన తేదీ ప్రకారం ఒక్కొక్కరిపై ఒక్కో సంఖ్య ప్రభావం ఉంటుంది. న్యూమరాలజీ ప్రకారం జులై 27వ తేదీ బుధవారం కొందరికి కలిసి వస్తుంది. మరికొందరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ ప్రమాదాలు, శుభాలు ఉన్నాయో, ఏ దానాలు చేస్తే మంచిదో న్యూమరాలజీ నిపుణులు సూచించారు. అవేంటో తెలుసుకోండి..

#Number 1 : నెలలోని 1, 10, 19, 28వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 1 వస్తుంది. చాలా పనులను సజావుగా ముగించే స్నేహపూర్వక రోజు. మీరు తప్పనిసరిగా సమావేశానికి, వేదికకు, ఈవెంట్‌లకు వెళ్లి మైక్ పట్టుకోవాలి. మీ సృజనాత్మక ప్రసంగ శైలి, ఇతరులకు అద్భుతమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవాలని గుర్తుంచుకోండి. జంటలు సంపన్నంగా ఉండటానికి, ప్రేమ సంబంధాలను ఆస్వాదించడానికి అనుకూల సమయం. కళాకారులు, నృత్యకారులు, సోలార్‌ ఎనర్జీ డీలర్లు, రచయితలు, ప్రభుత్వ అధికారులు, వైద్యులు, సంగీతకారులు, గ్లామర్ పరిశ్రమకు చెందిన వారికి ప్రజాదరణ లభిస్తుంది.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: ఆదివారం, మంగళవారం

లక్కీ నంబర్‌: 1, 9

దానాలు: పేదలకు ఆరెంజెస్‌ దానం చేయాలి

#Number 2 : నెలలోని 2, 11, 20, 29వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 2 ప్రభావం ఉంటుంది. ఇతరుల విమర్శలను విస్మరించాలి, ఎందుకంటే వారు కేవలం అసూయతో ఉంటారు. మీ పనితీరు మరింత మెరుగవుతుంది. కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఇతరులకు సహాయం చేయడానికి ముందుకు రండి. మీరు పనిలో సీనియర్ల సహాయంతో విజయం సాధిస్తారు. మ్యానిపులేషన్స్‌ మీకు పడవు కాబట్టి మిమ్మల్ని మీరు నిగ్రహించుకోండి. మీ పిల్లలు, బంధువులతో గడపడం, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడం, చిన్న ట్రిప్ ప్లాన్ చేయడం, స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం, భాగస్వామికి ఆశ్చర్యకరమైన బహుమతిని ఇవ్వడానికి మంచి రోజు. భాగస్వామ్య పెట్టుబడులు, ఎగుమతి వ్యాపార ఒప్పందాలను చేయండి. మీరు కంప్లైంట్‌లను పక్కనపెడితే రిలేషన్‌లో రొమాన్స్‌ డెవలప్‌ అవుతుంది.

మాస్టర్‌ కలర్‌: పింక్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 2

దానాలు: యాచకులకు పెరుగు అందజేయాలి

#Number 3 : నెలలోని 3, 12, 21, 30వ తేదీలలో జన్మించిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 3 పని చేస్తుంది. ఇది పని ఒత్తిడితో పాటు మీ నైపుణ్యాలకు గుర్తింపునిచ్చే రోజు. ఆధ్యాత్మికత, జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇది ప్రయాణించాల్సిన సమయం. మీరు ఆధ్యాత్మికత కౌన్సెలింగ్‌ని కెరీర్ ఎంపికగా అన్వేషించాలి. ముఖ్యంగా గాయకులు, కోచ్‌లు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, న్యాయవాదులను బాగా ఆకట్టుకునే రోజు. బట్టలు, ఆభరణాలు, పుస్తకాలు, డెకర్, ధాన్యాలు లేదా ప్రయాణ బుకింగ్‌లు, షాపింగ్ చేయడానికి ఇది ఉత్తమమైన రోజు. డిజైనర్లు, హోటల్‌ నిర్వాహకులు, యాంకర్లు, లైఫ్, స్పోర్ట్స్ కోచ్‌లు, ఫైనాన్సర్లు, సంగీతకారులు ఈరోజు ప్రత్యేక విజయాలను ఆస్వాదించే అవకాశం ఉంది. దయచేసి పసుపు తీసుకోవడంతో మీ రోజును ప్రారంభించండి.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌

లక్కీ డే: గురువారం

లక్కీ నంబర్‌: 3, 9

దానాలు: ఆలయాలకు చందనం దానం చేయాలి

#Number 4 : నెలలోని 4, 13, 22, 31వ తేదీలలో జన్మించిన వారిపై నంబర్‌ 4 ప్రభావం ఉంటుంది. వాణిజ్యపరమైన ఆస్తులపై పెట్టుబడి పెట్టే వారికి అనుకూలమైన రోజు. వ్యాపార ఒప్పందాలు లేదా ప్రభుత్వ ఉత్తర్వులలో జాప్యం నెలకొంటుంది. ఫైనాన్స్‌కు సంబంధించి ఈరోజు తీసుకున్న ప్రధాన నిర్ణయాలు చాలా ఆలస్యం ఎదుర్కొంటాయి. సేల్స్ ఉద్యోగులు, IT ఉద్యోగులు, థియేటర్ ఆర్టిస్ట్, నటీనటులు, టీవీ యాంకర్లు, డ్యాన్సర్‌లు ఈరోజు ప్రయోజనాలను పొందేందుకు, ప్రకాశవంతమైన అవకాశాల కోసం తప్పనిసరిగా ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకోవాలి. నిర్మాణ వస్తువులు, మెటల్, గార్మెంట్స్ తయారీదారులు వ్యాపారంలో కొత్త ఆఫర్‌ను ఆశించాలి. గ్రీన్ లీఫ్ వెజ్ ఫుడ్‌ని తినాలి.

మాస్టర్‌ కలర్‌: పర్పుల్

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: స్నేహితుడికి మనీ ప్లాంట్‌ అందజేయాలి

#Number 5 : నెలలోని 5, 14, 23వ తేదీలలో పుట్టిన వారికి న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ 5 పని చేస్తుంది. మనస్సు గల వ్యక్తులతో కలిసిపోయే వైఖరిని మరచిపోయి ఇతరులను విశ్వసించడం ప్రారంభించండి. దీర్ఘకాల సమస్యలను పరిష్కరించడానికి మీరు కుటుంబం, స్నేహితుల పూర్తి సపోర్ట్‌ పొందుతారు. ఆర్థిక లాభాలు మామూలుగానే కనిపిస్తున్నాయి కానీ ఎగుమతి దిగుమతులపై పెట్టుబడిపై రాబడిని పొందే అవకాశం ఉంది. మీకు ఇచ్చిన గౌరవానికి కుటుంబానికి మీ కృతజ్ఞతలు తెలియజేయాలి. ఈరోజు స్టాక్ మార్కెట్, క్రీడలు, ఈవెంట్‌లు, పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో అదృష్టాన్ని ప్రయత్నించాలి. ఈ రోజు మీ భాగస్వామి పూర్తిగా మీ సొంతం.

మాస్టర్‌ కలర్‌: గ్రీన్‌, ఆరెంజ్‌

లక్కీ డే: బుధవారం

లక్కీ నంబర్‌: 5

దానాలు: అనాథాశ్రమాలకు, జంతువులకు పాలు దానం చేయాలి

#Number 6 : నెలలోని 6, 15, 24వ తేదీలలో నంబర్‌ 6 ప్రభావం కనిపిస్తుంది. అవకాశం చిన్నదైనా పెద్దదైనా ఉపయోగించుకోండి, అది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. జీవితానికి ఆనందాన్ని, పరిపూర్ణతను తెచ్చే సౌకర్యవంతమైన రోజు. బిజినెస్‌ క్లయింట్‌ల సమస్యలను పరిష్కరించడానికి, డిన్నర్ లేదా షాపింగ్ కోసం బయటకు వెళ్లే సమయం. గృహిణులు, క్రీడాకారులు, ప్రాపర్టీ డీలర్లు, డెర్మటాలజిస్టులు, గాయకులు, డిజైనర్లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్, బ్రోకర్లు, చెఫ్‌లు, విద్యార్థులు వృద్ధిని పెంచే కొత్త అసైన్‌మెంట్‌లను అందుకుంటారు. రొమాంటిక్‌ రిలేషన్‌షిప్స్‌ ఇంటికి సంతోషాన్ని తెస్తాయి.

మాస్టర్‌ కలర్‌: వయోలెట్‌

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: ఆలయానికి వెండి నాణేలు అందజేయాలి

#Number 7 : నెలలోని 7, 16, 25వ తేదీలలో జన్మించిన వారిపై 7వ నంబర్‌ ప్రభావం ఉంటుంది. మీరు ముఖ్యమైన వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు ఈరోజు తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలి. మీ తెలివితేటలు అన్ని అంశాలు గెలుచుకోగలవు కాబట్టి అందించిన సవాలును అంగీకరించండి. తల్లి, ఇతర సీనియర్ల సూచనలను శ్రద్ధగా వినండి. ఈరోజు పెద్దదిగా అనిపించే సమస్య త్వరలో మాయమవుతుంది. ఎవరైనా మిమ్మల్ని కిందకి లాగే అవకాశం ఉంది, కానీ వారు విజయం సాధించలేరు. జ్యువెలరీలో ఉన్న వ్యక్తులు, న్యాయవాదులు, కొరియర్ రంగంలోని వారు, పైలట్లు, రాజకీయ నాయకులు, థియేటర్ ఆర్టిస్ట్‌, CA, సాఫ్ట్‌వేర్ ఉద్యో్గులకు ప్రత్యేక అదృష్టం కలిసి వస్తుంది.

మాస్టర్‌ కలర్‌: ఆరెంజ్‌

లక్కీ డే: సోమవారం

లక్కీ నంబర్‌: 7, 9

దానాలు: కాపర్‌ మెటల్‌ దానం చేయాలి

#Number 8 : నెలలోని 8, 17, 26వ తేదీలలో జన్మించిన వ్యక్తులపై న్యూమరాలజీ ప్రకారం 8వ నంబర్‌ ప్రభావం కనిపిస్తుంది. పంపిణీ, దాతృత్వంతో రోజును ప్రారంభించండి. పెద్ద కంపెనీలతో మీ అనుబంధం భవిష్యత్తులో అద్భుతమైన రాబడిని కలిగిస్తుంది. కానీ ప్రస్తుత సమయం కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది, కాబట్టి ఓపిక పట్టండి. ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. ఆస్తి, యంత్రాల కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు మీకు అనుకూలంగా మారుతాయి. అనేక బాధ్యతల కారణంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. చట్టపరమైన వివాదాలు త్వరలో పరిష్కారమవుతాయి. వైద్యులు, తయారీదారులు విజయాలతో గౌరవంగా ఫీల్‌ అవుతారు. వ్యక్తిగతంగా భాగస్వాములతో వాదనలు జరిగే అవకాశం ఉంది. ధాన్యాలు దానం చేయడం, పుల్లని పదార్థాలు తినడం తప్పనిసరి.

మాస్టర్‌ కలర్‌: పర్పుల్‌

లక్కీ డే: శుక్రవారం

లక్కీ నంబర్‌: 6

దానాలు: అవసరమైన వారికి గొడుగు దానం చేయాలి

#Number 9 : నెలలోని 9, 18, 27వ తేదీలలో పుట్టిన వారిపై 9వ సంఖ్య ప్రభావం చూపిస్తుంది. మీరు గాయపడే, అవమానాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. మీరు ఈరోజు క్రౌడ్‌కి దూరంగా ఉండాలి. ప్రేమలో ఉన్నవారు తమ భావోద్వేగాలను వ్యక్తపరచడానికి ఒక అద్భుతమైన రోజు. వ్యాపార సంబంధాలు, ఒప్పందాలు కార్యరూపం దాల్చడానికి మరింత సమయం కావాలి. గ్లామర్ పరిశ్రమ, మీడియాలో ఉన్న వ్యక్తులు కీర్తిని పొందుతారు. రాజకీయ నాయకులు ఈ రోజు గొప్ప అవకాశాలను అందిస్తారు. కాబట్టి ప్రజాప్రతినిధులు, విద్యార్థులు సహకరించడానికి, పురోగతిని సాధించడానికి ఈ రోజును తప్పక ఉపయోగించుకోవాలి. విద్యార్థులు, శిక్షకులు, సంగీతకారులు, రచయిత, డిజైనర్లు, వైద్యులు, న్యాయవాదులు, ఇంజనీర్లు, నటీనటులు ఉత్తమ ప్రజాదరణను పొందుతారు.

మాస్టర్‌ కలర్‌: రెడ్‌

లక్కీ డే: మంగళవారం

లక్కీ నంబర్‌: 9

దానాలు: ఎర్ర కందిపప్పును దానం చేయాలి

జులై 27వ తేదీన జన్మించిన కొందరు ప్రముఖులు : రాహుల్ బోస్, కృతి సనన్, K S చిత్ర, ఉద్ధవ్ థాకరే, విశ్వ మోహన్ భట్

Published by:Madhu Kota
First published:

Tags: Astrology, Numerology

ఉత్తమ కథలు